Ramireddy Pratap Kumar Reddy

  • Home
  • Ramireddy Pratap Kumar Reddy

Ramireddy Pratap Kumar Reddy YSR Congress Party Incharge - Kavali |
Ex MLA - Kavali Constituency ( 2014 -2024) | YSR Congress Party - YSRCP Andhra Pradesh

16/06/2026

మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే ఆ నలుగురి మీద కేసులు కట్టకపోతే .. ఎక్కడ తేల్చుకోవలో అక్కడే తేల్చుకుంటాం..!

15/06/2026

ప్రతాప్ రెడ్డి లోకల్ 🔥


నా పై మరియు మా వైస్సార్సీపీ నాయకులపై సోషల్ మీడియాలో.. దుష్ప్రచారం చేసే వారిని .. వారం రోజుల్లో అరెస్ట్ చేయకపోతే వైస్సార్...
14/06/2026

నా పై మరియు మా వైస్సార్సీపీ నాయకులపై సోషల్ మీడియాలో.. దుష్ప్రచారం చేసే వారిని .. వారం రోజుల్లో అరెస్ట్ చేయకపోతే వైస్సార్సీపీ సత్తా ఏంటో చూపిస్తాం..!🔥

-మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు


14/06/2026

దుష్ప్రచార గ్యాంగ్‌కు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కావలి, నెల్లూరు జిల్లా:

సోషల్ మీడియా వేదికగా తనపై, వైఎస్సార్‌సీపీ పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలపై కావలి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.

అయితే మంత్రి నారా లోకేష్‌పై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వెంటనే స్పందించి తనపై కేసు నమోదు చేయడంతో పాటు ఇంటి వద్దకే వచ్చి నోటీసులు అందించారని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలే గానీ అధికార పార్టీ నేతల ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు.

తాజాగా సోషల్ మీడియాలో తనపై అసత్య పోస్టులు, దుష్ప్రచారాలు చేస్తున్న ఐదుగురు వ్యక్తుల వివరాలు, పూర్తి ఆధారాలతో కూడిన ఫిర్యాదును కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సుమన్‌కు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఇటీవల కావలి డీఎస్పీని స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.

ఇలాంటి నీచమైన ప్రచారాలను కావలి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని, అయినప్పటికీ తాము చట్టాన్ని గౌరవిస్తూ న్యాయపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
దుష్ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, లేనిపక్షంలో ఉన్నతాధికారులను ఆశ్రయించి చట్టబద్ధంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

"చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం ఉండకూడదు" అని ఆయన స్పష్టం చేశారు.


కావలి రూరల్ మండలం కొనదిన్నె గ్రామానికి చెందిన EX వైస్ ప్రెసిడెంట్ కమలాపూరి రమణయ్యకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదనే విషయం తీసుకు...
13/06/2026

కావలి రూరల్ మండలం కొనదిన్నె గ్రామానికి చెందిన EX వైస్ ప్రెసిడెంట్ కమలాపూరి రమణయ్యకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదనే విషయం తీసుకుకొని కొనదిన్నె గ్రామంలోని రమణయ్య నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించి దేవుని ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను.

13/06/2026

కూటమి ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నిస్తే.. కేసులా ?

ప్రెస్‌మీట్‌లో నారా లోకేష్‌ను ప్రశ్నించారనే అక్కసుతో కావలి వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిపై అక్రమ కేసు నమోదు

విచారణకు రావాల్సిందిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నోటీసులు జారీ

సమాధానం చెప్పే ధైర్యం లేక.. కేసులా ?

13/06/2026

పేరుకేమో సొంత ఇంటికి మట్టి...తరలించిదేమో లే అవుట్లకు(రియల్ ఎస్టేట్ లకు).

ప్రశ్నిస్తే కావలిని కాపు కాస్తున్నాం..గట్టిగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు.

ప్రభుత్వ సహజ వనరుల దోపిడీని అర్థరాత్రి సమయంలో అడ్డుకుని ప్రశ్నించిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

మన్నగదిన్నెలో అక్రమ మట్టి తరలింపులు జరుగుతున్నాయని తెలుసుకుని అక్రమ రవాణా స్థలానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో అవినీతి,అక్రమాలు,స్కామ్ లు,పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సహజ వనరులను కొల్లగొడుతూ అక్రమ మట్టి, గ్రావెల్ త్రవ్వకాలు నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని మండిపడ్డారు.

కావలి నియోజకవర్గంలోని మన్నగదిన్నె గ్రామంలో కాలువల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, రాత్రి వేళల్లో చెరువులను తవ్విపడేస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు.ఈ అక్రమాలను ప్రశ్నించిన వారిని పట్టించుకోకుండా, "మా ప్రభుత్వం.. మా ఇష్టం" అనే ధోరణితో కొందరు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అక్రమ మట్టి, గ్రావెల్ త్రవ్వకాల విషయంలో కూటమి ప్రభుత్వం "అభివృద్ధి"కావలిని కాపు కాస్తున్నాం"అనే సాకుతో సహజ సంపదను నాశనం చేస్తోందని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ వ్యవహారాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని వైసీపీ కావలి నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావలి ప్రాంతంలో అవినీతి, వివిధ కుంభకోణాలు పెరిగాయని ఆరోపిస్తూ, అక్రమ త్రవ్వకాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రతాప్ రెడ్డి గారు ప్రశ్నించారు.

ఈ అక్రమ త్రవ్వకాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.





కావలి రూరల్ తుమ్మల పెంట పంచాయతీ  రామచంద్రపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న  మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డ...
13/06/2026

కావలి రూరల్ తుమ్మల పెంట పంచాయతీ రామచంద్రపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని సన్మానించిన రామచంద్రపురం గ్రామ కాపులు.

ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన కాపులకు శుభాకాంక్షలు తెలిపి వారికి నూతన వస్త్రాలు మాజీ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.



మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పోలీసుల నోటీసులు..! కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార...
12/06/2026

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పోలీసుల నోటీసులు..!

కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు.

ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన రాజకీయ విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కావలి 1వ పట్టణ ఎస్‌ఐ సుమన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడలేని భాషలో మమ్ములను మా నాయకులను పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే ఆ కేసులు మాత్రం కట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం లో భాగంగా మా మీద కేసులు కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో వీరికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు.



Address

Opposite AnjaneyaSwami Temple, Kavali

Alerts

Be the first to know and let us send you an email when Ramireddy Pratap Kumar Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramireddy Pratap Kumar Reddy:

  • Want your organization to be the top-listed Government Service?

Share