Team Malepati

Team Malepati Team Malepati - TDP

26/01/2026

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..!!

Happy Republic Day..!!

23/01/2026

ఏపీ భవిష్యత్తు నాయకుడు,యువతకు మార్గదర్శి,యువగళం రధసారధి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ Nara Lokesh అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!!

A very warm birthday greetings to sri Nara Lokesh Anna..!!

18/01/2026

దగదర్తి గ్రామ వెలుపోడు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఈరోజు దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలేపాటి రవీంద్ర నాయుడు, కంచర్ల సునీల్ ఆదేశానుసారం, దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి లోకేష్, సీనియర్ టిడిపి నేత మాలేపాటి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో యుగపురుషుడు సీనియర్ ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ముందుగా మాలేపాటి స్వగృహం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి, మాలేపాటి వంశభిమానులు అత్యధిక సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించి, దగదర్తిలోని మసీదు సెంటర్ కు చేరుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అక్కడి నుండి వెలుపోడు రోడ్డు సెంటర్ వరకు నడిచి వెళ్లి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి, భారీగా బాణాసంచా పేల్చి, ఘనమైన నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్.. అమర్ రహే ఎన్టీఆర్.. అంటూ నినాదాలతో వెలిపోడు రోడ్డు సెంటర్ హోరెత్తింది

ఈ సందర్భంగా మాలేపాటి లోకేష్ గారు మాట్లాడుతూ.. కారణజన్ము డు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా దగదర్తి మండలం నుండి ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన యుగపురుషునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ.. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం అన్నారు. ఆయన వేసిన బాట అనుసరణీయం. వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయాలను మనమందరం కొనసాగించాలని తెలియజేశారు.

ఉండవల్లి: ఐటీ,విద్యా శాఖల మంత్రి,మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారితో మాలేపాటి కుటుంబ సభ్యులు భేటీ...ఉండవల్లి లోని...
16/01/2026

ఉండవల్లి: ఐటీ,విద్యా శాఖల మంత్రి,మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారితో మాలేపాటి కుటుంబ సభ్యులు భేటీ...

ఉండవల్లి లోని నివాసంలో నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దగదర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు గారు,యువ నాయకులు మాలేపాటి లోకేష్ గారు,మాలేపాటి సుధాకర్ నాయుడు గారు మరియు కంచర్ల సునీల్ గారు..

ఈ సందర్భంగా దగదర్తి మండలం లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు,పార్టీ బలోపేతం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

మాలేపాటి కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని,వ్యక్తి గతంగా తన సహకారం ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉంటుందని నారా లోకేష్ గారు తెలిపారు.

సుబ్బన్న సేవలు మరువలేనివి...పార్టీ కష్ట కాలంలో కావలి నియోజకవర్గ ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టి,పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా పెద్ద ఎత్తున నిర్వహించి,కావలి ప్రజలకు,కార్యకర్తలకు ఒక పెద్ద అన్నగా అండగా నిలిచారు.తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో పని చేశారు.

కావలి లో నా యువగళం పాదయాత్ర సమయంలో సుబ్బన్న తో గడిపిన క్షణాలు,వారి ఆత్మీయత మరువలేను అని ఈ సందర్భంగా లోకేష్ గారు తెలిపారు.

వారి వెంట దగదర్తి మండలం టీడీపీ నాయకులు కంచర్ల సతీష్,కంచర్ల కృష్ణ,జక్కంపూడి సంపత్ కుమార్,తాటిచెట్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.

Address

Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when Team Malepati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share