బోయిని వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి

  • Home
  • India
  • Karimnagar
  • బోయిని వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి

బోయిని వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి బోయిని వంశీకృష్ణ

27/05/2026
పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహంచిగురుమామిడి, మే 26 ..పది రోజుల వ్యవధిలో మూడోసారి పెట్రోల్‌, డీజిల్ ధరలు ప...
27/05/2026

పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం

చిగురుమామిడి, మే 26 ..
పది రోజుల వ్యవధిలో మూడోసారి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగడంపై చిగురుమామిడి మండల కాంగ్రెస్ నాయకులు బోయిని వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు పెరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలపై భారాలు పెరిగాయని పేర్కొన్నారు.
అచ్చే దిన్” పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలకు “భారాల దిన్” చూపిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని, పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు...**సామాన్యుడి సంపాదనను కేంద్రం లూటీ చేస్తోందని..**చిగురుమామ...
27/05/2026

పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు...*

*సామాన్యుడి సంపాదనను కేంద్రం లూటీ చేస్తోందని..*

*చిగురుమామిడి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బోయిని వంశీకృష్ణ....*

Address

Nawabpet, Chigurumamidi
Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when బోయిని వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share