SIRCILLA

SIRCILLA The name Sircilla is derived from sirishala (meaning centre of wealth). It is known for its textile industries, power loom business

Sircilla (సిరిసిల్ల) is a town as well as a municipality, which is located on the banks of Manair (also spelled as Maneru) river in Karimnagar district of the Indian state of Andhra Pradesh.

11/08/2024

సిరిసిల్ల - తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో “నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి” అంటూ ఛానల్లో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీంతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

11/08/2024

సిరిసిల్ల - పాత బస్టాండ్లో కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై దాడి చేస్తున్న కాకులు

బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మ పై వాలుతున్న కాకులు.

రాజన్న సిరిసిల్ల : సాగునీటి వనరులు, ఇసుక రీచ్‌లు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఖనిజ సంపదకు కేంద్ర బిందువు కానున్నద...
11/08/2024

రాజన్న సిరిసిల్ల : సాగునీటి వనరులు, ఇసుక రీచ్‌లు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఖనిజ సంపదకు కేంద్ర బిందువు కానున్నది. తాజాగా ఈ సంపద వెలుగు చూడటంతో రాష్ట్ర గనుల శాఖ మరింత పరిశోధన దిశగా అడుగులు వేస్తున్నది. కొత్తగా వేస్తున్న కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైలు మార్గం తవ్వకాల్లో ఈ ఖనిజ సంపద బయటకు రావడంతో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయం లో కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, ధార్మిక క్షేత్రమైన వేములవాడ ప్రజల కోరిక మేరకు కొత్తపల్లి- మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ మంజూరు చేయించారు. మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు లైన్‌ పూర్తి కావడంతో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు.

అందులో అత్యంత అరుదైన ఖనిజ సంపద ఉన్నట్టు గుర్తించిన అధికారులు లోతైన పరిశోధన మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఖనిజ సంపద ఉన్నట్టు గుర్తించిన గనుల శాఖ కేంద్రానికి నివేదికలు పంపించినట్టు తెలిసింది. సిరిసిల్ల జిల్లాలో ఈ ఖనిజ సంపద 562.47 చదరపు కిలోమీటర్లు ఉండగా, సిద్దిపేట జిల్లాలో మరికొంత భాగం ఉన్నట్టు గనుల శాఖ అధికారులు తెలిపారు. అందులో 15 రకాల లాంథనైడ్స్‌ ఉండగా, స్కాండియం, వైట్రియం ఖనిజాలు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. కిలో రూ.32 వేలకుపైగా విలువ చేసే వైట్రియం ప్రధానమైనది కావడంతో మరింతగా పరిశోధనలు చేసేందుకు గనుల శాఖ సన్నద్ధమవుతున్నది. సిద్దిపేట జిల్లా విఠలాపురం, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పెద్దలింగాపూర్‌, బస్వాపూర్‌, లక్ష్మీపూర్‌ గుట్టల్లోనూ పరిశోధనలు చేస్తే ఇంకా అరుదైన ఖనిజ సంపద బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు

సిరిసిల్ల అర్బన్ బ్యాంకుపై ఎగిరిన గులాబీ జెండా...ముచ్చటగా మూడవసారి కైవసం చేసుకున్న బీఆర్ఎస్ చైర్మన్ గా బీఆర్ఎస్ ఫ్యానెల్...
08/06/2024

సిరిసిల్ల అర్బన్ బ్యాంకుపై ఎగిరిన గులాబీ జెండా...

ముచ్చటగా మూడవసారి కైవసం చేసుకున్న బీఆర్ఎస్

చైర్మన్ గా బీఆర్ఎస్ ఫ్యానెల్ అభ్యర్థి రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డగట్ల మురళి ఏకగ్రీవ ఎన్నిక.

గ్రూప్‌‌ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సూచన.
08/06/2024

గ్రూప్‌‌ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సూచన.

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనం. 12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్ల గెల...
06/06/2024

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనం. 12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్ల గెలుపు

చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్న బీఆర్ఎస్.

ఎన్నికల్లో విజేతలు వీరే....

1. రాపెల్లి లక్ష్మీనారాయణ
2. గుడ్ల సత్యానంద్
3. చొప్పదండి ప్రమోద్
4. అడగట్ల మురళి
5 పాటి కుమార్ రాజ్
6. బుర్ర రాజు
7. వేముల సుక్కమ్మ
8. అడ్డగట్ల దేవదాస్
9. ఏనగందుల శంకర్
10. వలస హరిణి
11. పత్తిపాక సురేష్
12. కోడం సంజీవ్

రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్.రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ కార్య...
22/05/2024

రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు ఏసీబీకి చిక్కారు. ఎంబీ రికార్డుపై అధికారులకు పంపించేందుకు ఏడు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భాస్కర్ రావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు పంచాయతీ రాజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

గంభీరావుపేట మండలం లింగన్నపేటలో స్మశాన వాటిక కంపౌండ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్ వెంకటేష్ కు సుమారు ఐదు లక్షల బిల్లు రావాల్సి ఉంది. బిల్లు కోసం ఎంబీ రికార్డు ఏఈ, డీఈలు పూర్తి చేశారు. పై అధికారులకు పంపించేందుకు బాస్కర్ రావు రూ.8 వేలు డిమాండ్ చేశారు. వెంకటేష్ బతిమాలడంతో వెయ్యి తగ్గించి ఏడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు. డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడంతో వెంకటేష్ ఏసీబీ ఆధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వెంకటేష్ నుంచి సోమవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్ ఈఈ కార్యాలయంలో భాస్కర్ రావు ఏడు వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెంట్ గా పట్టుకున్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రికార్డు సీజ్ చేసి మంగళవారం భాస్కర్ రావును కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

● బతుకుదెరువునిస్తున్న బీడీల ఆకు ● కల్లాలు లేకున్నా సేకరిస్తున్న పల్లెప్రజలు ● కొమ్మకొట్టకపోవడంతో అంతంతే ఆకు ● అడవిలో జా...
23/04/2024

● బతుకుదెరువునిస్తున్న బీడీల ఆకు
● కల్లాలు లేకున్నా సేకరిస్తున్న పల్లెప్రజలు
● కొమ్మకొట్టకపోవడంతో అంతంతే ఆకు
● అడవిలో జాగ్రత్తగా ఉండాలి : ఎఫ్‌ఆర్వో

అటవీ ప్రాంతాల్లోని పల్లెవాసులకు నమ్మకమైన ఉపాధినిచ్చే పని ఏదైనా ఉందీ అంటే అది తునికాకు సేకరణే. వేసవిలో పెద్దగా వ్యవసాయ పనులు, ఇతర పనులు లేని రోజుల్లో గ్యారంటీగా ఇంటిల్లిపాదికీ తునికాకు సేకరణ ఉపాధి కల్పిస్తుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అటవీశివారు గ్రామాల్లో తునికి చెట్లు ఉన్నాయి. తునికాకు సేకరణకు జిల్లాలో అటవీశాఖ కల్లాలను ఏర్పాటు చేయలేదు. కానీ బీడీల తయారీకి వినియోగించే తునికాకు సేకరణతో పల్లెజనం ఉపాధి పొందుతున్నారు. వాస్తవానికి తునికి చెట్లను జనవరి, ఫిబ్రవరి నెలలో కొమ్మకొట్టడం(ఫ్రూనింగ్‌) చేస్తే మళ్లీ చిగురించి నాణ్యమైన బీడీల ఆకు లభించేది. కానీ రెండు దశాబ్దాలుగా అటవీశాఖ తునికాకు సేకరణకు జిల్లాలో స్వస్తి పలికింది. దీంతో కొమ్మకొట్టే(ప్రూనింగ్‌) పనిని ఆపేశారు. తునికి చెట్లు బాగా ఉన్న అటవీ ప్రాంతాల్లో ఆకు ఇగురు వచ్చింది. దీంతో తునికాకు సేకరణ సాగుతుంది. ఈ తునికాకును స్థానికంగా బీడీ కంపెనీ టేకేదారులకు, బీడీకార్మికులకు నేరుగా అమ్ముకుంటారు. 50 ఆకుల తునికాకు కట్ట ధరను ప్రభుత్వం రూ.3 ధర నిర్ణయించగా.. అదే తునికాకు కట్టను రూ.5 నేరుగా అమ్ముకునే అవకాశం ఉంది. ఒక్కో మహిళ నిత్యం 100 నుంచి 200 కట్టల తునికాను సేరిస్తారు. ఈ లెక్కన నిత్యం రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తారు.

జిల్లా పల్లెల్లో తునికాకు ఉనికి

జిల్లాలోని అటవీ గ్రామాల్లో తునికాకు చెట్లు ఉనికి ఉంది. కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి మండలాల్లోని అటవీ గ్రామాల్లో తునికాకు చెట్లు ఉన్నాయి. ఈ మండలాల్లోని అటవీ గ్రామాల్లో ఏటా తునికాకు సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎండలో ఇతర పనులకు వెళ్లకుండా నీడపట్టున ఉండి ఉపాధి పొందే వీలుండడంతో తునికాకు సేకరణ చేస్తున్నారు. పల్లెల్లో ఉపాధిహామీ పనులు ఉన్నా మెరుగైన ఉపాధి వస్తుందని ఆకు సేకరణపై ఆసక్తి చూపుతున్నారు.

గతంలో తునికాకు కల్లాలు

గతంలో తునికాకు సేకరణను అటవీశాఖ చేపట్టింది. జిల్లాలో 25వేల స్టాండర్డ్‌ బ్యాగుల(ఎస్‌బీ) తునికాకు సేకరణ జరిగేది. పల్లెల్లో తునికాకు కల్లాలు పెట్టి మరీ సేకరించేవారు. ఒక్క కోనరావుపేట యూనిట్‌ పరిధిలోనే 5వేల ఎస్‌బీల తునికాకు లభించేది. ఒక్కో స్టాండర్డ్‌ బ్యాగులో వెయ్యి తుని కాకు కట్టలు ఉండేవి. జిల్లాలో తునికాకు సేకరణకు అల్మాస్‌పూర్‌, గంభీరావుపేట, జిల్లెల్ల, మూడపల్లి, చందుర్తి, విలాసాగర్‌, కోనరావుపేట యూనిట్లు ఉండేవి. అప్పట్లో నక్సలైట్ల ప్రాబల్యంతో ఆకు సేకరణకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అడవుల్లో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో అధికారికంగా ఆకు సేకరణ నిలిచిపోయింది. కానీ పల్లెజనం మాత్రం ఉపాధిపై ఆశతో సేకరణ కొనసాగిస్తున్నారు. ఇంట్లో తునికాకు కట్టలు ఉంటే డబ్బులు నిల్వ ఉన్నట్లుగానే గ్రామీణులు భావిస్తున్నారు. ఇదే నమ్మకంతో ఆకు సేకరణ సాగిస్తున్నారు.

నేతకార్మికులు కావలెను.విమానంలో పొరుగు రాష్ట్రాల కార్మికుల దిగుమతి.సిరిసిల్ల శివారులోని ఓ ప్రాసెసింగ్‌ యూనిట్‌ యజమాని ఇటీ...
21/04/2024

నేతకార్మికులు కావలెను.

విమానంలో పొరుగు రాష్ట్రాల కార్మికుల దిగుమతి.

సిరిసిల్ల శివారులోని ఓ ప్రాసెసింగ్‌ యూనిట్‌ యజమాని ఇటీవల పది మంది లేబర్లను ఉత్తరప్రదేశ్‌ నుంచి విమానంలో రప్పించారు. వారికి అడ్వాన్స్‌ చెల్లించి, రైలులో వస్తే ఆలస్యమవుతుందని ఏకంగా విమాన టిక్కెట్లు భరించి పది మందిని మధ్యవర్తి ద్వారా రప్పించారు. సిరిసిల్లలో ప్రాసెసింగ్‌ యూనిట్లలో పనిచేసేందుకు నైపుణ్యం గల లేబర్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారు.

ఇది సిరిసిల్ల శివారులోని బద్దెనపల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లోని ఆధునిక ర్యాపియర్‌ లూమ్స్‌. వీటిపై వస్త్రోత్పత్తి చేసేందుకు నైపుణ్యం గల కార్మికులు కావాలి. టెక్స్‌టైల్‌పార్క్‌లోని ఆధునిక సాంచాలు నడిపేందుకు కార్మికులు లేరు. వాస్తవానికి సిరిసిల్లతో పోల్చితే.. ఈ సాంచాలు నడిపే కార్మికులకు మెరుగైన వేతనం లభిస్తుంది. అయినా.. లేబర్లు లేక లూమ్స్‌పై వస్త్రోత్పత్తి సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు రాజీవ్‌ విద్యా మిషన్‌(ఆర్వీఎం) వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇచ్చింది. ఆ బట్టను సకాలంలో అందించాలని జౌళిశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండగా.. లేబర్లు లేక.. ఆర్వీఎం బట్ట ఉత్పత్తి కావడం లేదు. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులు ఉన్న లేబర్లకు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించి మరీ పనిలో పెట్టుకుంటున్నారు. లేబర్ల కోసం వస్త్రోత్పత్తిదారుల మధ్య పోటీ నెలకొంది.

సిరిసిల్లలో వస్త్రోత్పత్తి స్వరూపం

సాంచాల సంఖ్య : 28వేలు

పాలిస్టర్‌ బట్టను నడిపే సాంచాలు : 24వేలు

కాటన్‌ వస్త్రాన్ని నడిపే సాంచాలు : 4వేలు

టెక్స్‌టైల్‌ పార్క్‌లో యూనిట్లు : 112

ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న యూనిట్లు : 65

వస్త్రోత్పత్తికి అవసరమైన కార్మికులు : 20 వేలు

అందుబాటులో ఉన్న కార్మికులు : 6వేలు

కార్మికుల కొరత ఉంది

సిరిసిల్లలో నైపుణ్యం గల నేతకార్మికుల కొరత తీవ్రంగా ఉంది. సాంచాలు నడిపేందుకు, నేటితరం ముందుకు రావడం లేదు. సిరిసిల్లను విడిచి వెళ్లిన కార్మికులు వారి సొంత ఊరిలోనే ఇతర పనుల్లో స్థిరపడుతున్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులను తెచ్చుకుని కొందరు కార్ఖానాలను నడిపిస్తున్నారు. నేతకార్మికుల కొరత ఇప్పుడు ఎక్కువైంది. పరిశ్రమల యజమానులే సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. – మిట్టకోల సాగర్‌, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు, సిరిసిల్ల

● కరెంట్‌ బిల్లుల వసూళ్లపై పట్టింపు ఏదీ..? ● ఆన్‌లైన్‌ సేవలను పునరుద్ధరించని అధికారులు ● గడువుదాటితే జరిమానా బాదుడు ● వి...
21/04/2024

● కరెంట్‌ బిల్లుల వసూళ్లపై పట్టింపు ఏదీ..?
● ఆన్‌లైన్‌ సేవలను పునరుద్ధరించని అధికారులు
● గడువుదాటితే జరిమానా బాదుడు
● విద్యుత్‌ వినియోగదారులకు ‘కొత్త’ కష్టాలు.

జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తుంది. ‘సెస్‌’ పరిధిలో వినియోగదారులకు ఆన్‌లైన్‌లో పేటీఎం ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించే అవకాశం ఉండేది. ఆర్‌బీఐ పేటీఎంను బ్యాన్‌ చేయడంతో ఆన్‌లైన్‌ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో గత మూడు నెలలుగా నేరుగా అందరూ క్యాష్‌ చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. పేటీఎం రద్దు కావడంతో ఇతర ఆన్‌లైన్‌ విధానాన్ని అమలులోకి తేవాల్సిన ‘సెస్‌’ అధికారులు, పాలకవర్గం మొద్దు నిద్రను వీడలేదు. ఫలితంగా వినియోగదారుల బిల్లుల డబ్బులు ఆన్‌లైన్‌లో ఎన్‌పీడీసీఎల్‌కు జమ అయ్యాయి. ‘సెస్‌’కు, ఎన్‌పీడీసీఎల్‌ వారి మధ్య సమన్వయం లేక వినియోగదారుల జేబులకు చిల్లులు పడ్డాయి. నిజానికి ‘సెస్‌’ పరిధిలో బిల్లులు జనరేట్‌ అయిన 14 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. లేకుంటే జరిమానాగా రూ.25 సర్‌చార్జి విధిస్తారు. అదే నెలరోజులు దాటితే రీకనెక్షన్‌ ఫీజు(ఆర్‌ఎఫ్‌) రూ.75 జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు ఉండడంతో వినియోగదారులు క్యూ కట్టి మరీ బిల్లులను సకాలంలో చెల్లించాలని భావిస్తారు.

సిరిసిల్ల సెస్‌ ఆఫీస్‌ భవనం

కాళ్ల నొప్పులతో కూర్చున్న..

కరెంట్‌ బిల్లు కట్టేందుకు వచ్చిన. నా వంతు వచ్చే వరకు లైన్‌లో నిలబడ లేక ఇలా కూర్చున్న. బిల్లులు తీసుకునే కౌంటర్లు ఎక్కువ ఉంటే ఈ సమస్య ఉండకపోయేది. ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే విధానం ఉంటే ఇంత రద్దీ ఉండకపోవు. ‘సెస్‌’ అధికారులు ఆన్‌లైన్‌ చెల్లింపులు కొనసాగించాలి.

– ఆడెపు నారాయణ, సిరిసిల్ల

గత నెలలోనూ చెల్లించలే..

‘సెస్‌’ పరిధిలోని ఆన్‌లైన్‌ పని చేయకపోవడంతో గత నెలలోనూ బిల్లులు చెల్లించలే. జరిమానాలతో ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. ఎన్నో పనులు ఉంటాయి. బిల్లు కట్టేందుకు ఇలా గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా ఉంది. ఆన్‌లైన్‌ అమలు చేయాలి.

– బండారి శ్రీనివాస్‌గౌడ్‌, సిరిసిల్ల

‘సెస్‌’ స్వరూపం..

‘సెస్‌’ పరిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం

మండలాలు: 13

మున్సిపాలిటీలు: 2, గ్రామాలు: 255

విద్యుత్‌ కనెక్షన్లు: 1.95 లక్షలు

ప్రతి నెలా వసూలయ్యే మొత్తం:

రూ.11.50 కోట్లు

ఆన్‌లైన్‌ ఒప్పందాలు జరిగాయి

‘సెస్‌’ విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకు గూగుల్‌ పే, ఫోన్‌ పేలతో ఒప్పందాలు జరిగాయి. తొందరలోనే ఆన్‌లైన్‌ చెల్లింపులు అమలులోకి వస్తాయి. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ బిల్లులు చెల్లించేలా సేవలను అమలులోకి తెస్తాం. – చిక్కాల రామారావు,

‘సెస్‌’ చైర్మన్‌, సిరిసిల్ల

సీతమ్మకు మువ్వన్నెల చీర.*బంగారు పోగులతో త్రీడీ చీర తయారీ.*నవమికి భద్రాద్రి సీతమ్మకు బహూకరణ.*సిరిసిల్ల కళాకారుడు విజయ్‌కు...
16/04/2024

సీతమ్మకు మువ్వన్నెల చీర.

*బంగారు పోగులతో త్రీడీ చీర తయారీ.
*నవమికి భద్రాద్రి సీతమ్మకు బహూకరణ.
*సిరిసిల్ల కళాకారుడు విజయ్‌కుమార్‌ సృజన.

సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌.

ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్‌ బ్లడ్‌ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్‌ నేసి అభినందనలు అందుకున్నారు.

రాజన్న కోడెలకు కరువైన వసతీ.● షెడ్లు సరిపోక ఎండలోనే... ● 150 కోడెలు ఉండే షెడ్లలో వెయ్యి జీవాలు ● అనారోగ్యానికి గురవుతున్న...
06/04/2024

రాజన్న కోడెలకు కరువైన వసతీ.

● షెడ్లు సరిపోక ఎండలోనే...
● 150 కోడెలు ఉండే షెడ్లలో వెయ్యి జీవాలు
● అనారోగ్యానికి గురవుతున్న వైనం
● పట్టించుకోని అధికారులు

వేములవాడ రాజన్న ఆలయంలోని కోడెలకు వసతి కరువైంది. గోశాలల్లో సౌకర్యాలు సరిగ్గా లేక అనారోగ్యానికి గురవుతున్నాయి. ఇటీవల ఎండలు ముదరడంతో మరింత ఇబ్బంది పడుతున్నాయి. వసతి సౌకర్యం తక్కువగా ఉండడం.. కోడెల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నాయి. షెడ్లలో కనీసం ఖాళీ స్థలం లేక ఎండలోనే విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఫలితంగా అనారోగ్యం పాలవుతున్నాయి.

భక్తుల ద్వారా ఇక్కడికి..

రాజన్న భక్తులు తమ కోరికలు నెరవేరితే నిజ కోడెను సమర్పిస్తుంటారు. తమ ఇంటిలోని కోడెను తీసుకొచ్చి ఆలయ అధికారులకు అప్పగిస్తుంటారు. ఇలా భక్తుల ద్వారా రాజన్న ఆలయానికి కోడెలు చేరుతున్నాయి. ఇలా వచ్చిన వాటి కోసం ఆలయ అధికారులు రెండు గోశాలలు ఏర్పాటు చేశారు. చెరువు కట్టకింద, తిప్పాపూర్‌లలో గోశాలలు ఉన్నాయి.

కోడెల ద్వారా కోట్ల ఆదాయం

రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించే కోడెమొక్కుల ద్వారా ఏటా సుమారుగా రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోడెల సంరక్షణకు రెండు గోశాలల్లో కలిపి ఏటా దాదాపు రూ.50లక్షల వరకు ఖర్చు అవుతుంది.

వసతికి మించి..

రాజన్నకు భక్తులు కోడెమొక్కులు చెల్లించే వాటి సంరక్షణకు గుడి చెరువు కట్టకింద ఉన్న గోశాలలో ఉంటున్నాయి. ఇక్కడ కోడెలు, ఆవులు కలిపి 150 వరకు ఉన్నాయి. తిప్పాపూర్‌ గోశాలలో 150 కోడెలను సంరక్షించేందుకు సౌకర్యాలు కల్పించారు. తిప్పాపూర్‌లో ప్రస్తుతం వెయ్యి కోడెలు ఉండంతో వసతి కరువైంది. సంరక్షణ సైతం భారంగా మారింది. దీంతో ఇటీవల మూడు కొత్త షెడ్లను నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మించి పైన తడుకల పందిళ్లు వేశారు. అయినా వసతి సరిపోవడం లేదు. గతంలో వేసిన షెడ్లు శిథిలావస్థకు చేరడంతో కోడెల సంరక్షణ ఇబ్బందిగా మారింది.

రోగల బారిన..

రాజన్నకు కోడెమొక్కుల కోసం భక్తులు చిన్న వయసులోనే తీసుకొస్తుండడంతో ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేక అనారోగ్యానికి గురవుతున్నాయి. పశువైద్యాధికారుల పర్యవేక్షణ ఉన్న ఒక్కోసారి ఇబ్బంది పడుతున్నాయి.

తెరపైకి రైతులకు ఇవ్వాలనే డిమాండ్‌..

రాజన్న ఆలయానికి మొక్కుల ద్వారా వచ్చిన కోడెల సంరక్షణ ఇబ్బందిగా మారడంతో గతంలో తెలంగాణ ఫెడరేషన్‌ ద్వారా వివిధ గోశాలలకు అందించారు. గత జనవరిలో గోశాల పేరుతో అక్రమంగా తరలించిన కోడెల వ్యాన్‌ను సీజ్‌ చేయడంతో అప్పటి నుంచి బయటి గోశాలలకు ఇవ్వడం లేదు. దీంతో ఇక్కడి గోశాలలో కోడెల సంఖ్య పెరిగింది. ఇదే సమయంంలో వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు ఉచితంగా అందివ్వాలనే డిమాండ్‌ తెరపైకి వస్తుంది. గతంలో ఇచ్చే వారని.. ఇప్పుడు ఇస్తే రైతులకు సైతం ఆర్థికంగా చేదోడుగా ఉంటుందనే వాదన వస్తుంది.

కోడెలను సంరక్షిస్తున్నాం

రాజన్న కోడెల కోసం తిప్పాపూర్‌ గోశాలలో ఇటీవల మూడు షెడ్లను ఏర్పాటు చేశాం. తడుకల పందిళ్లు వేశాం. కోడెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంరక్షణ చేస్తున్నాం. నాంపల్లి గుట్ట ప్రాంతంలో ఉన్న రాజన్న ఆలయం ఐదు ఎకరాల భూమిలో కోడెల సంరక్షణ కోసం ఇంజినీరింగ్‌ అధి కారులు ఎస్ట్‌మేషన్‌ వేయడం జరిగింది. కోడెలను రైతులకు అందించేందుకు రాష్ట్ర దేవదా య కమిషనర్‌కు లేఖను కూడా అందించాం.

– శ్రీనివాస్‌, రాజన్న ఆలయ ఏఈవో

Address

Sircilla
Karimnagar
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when SIRCILLA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share