Poodur

Poodur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poodur, Landmark & historical place, Poodur, Karimnagar.

04/05/2026

ఈరోజు పూడూర్ చౌరస్తా లో వడ్లు7 న్నర కిలోల కట్టింగు కు మిల్లర్లు అధికారులు మరియు నాయకులు కుమ్మక్కు ఐయ్యి రైతులని నిలువు దోపిడీ చేస్తున్నారు అని నిరసనగా రైతులు ధర్నా చేయడం జరిగింది సుమారు రెండున్నర గంటల పాటు వాహనాలు నిలిచి పోవడం జరిగింది.

గ్రామం లో ఉపాధి లేక వలస వెళ్తున్న యువకులు చాలా మంది వున్నారు ఒక్కరికి రెండు జీతాలు ఇవ్వకుండా ఒకరికి ఉపాధి కల్పిస్తే బాగు...
26/04/2026

గ్రామం లో ఉపాధి లేక వలస వెళ్తున్న యువకులు చాలా మంది వున్నారు ఒక్కరికి రెండు జీతాలు ఇవ్వకుండా ఒకరికి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.

పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూడూర్ లొ దివ్యంగులకు ఉచిత వీల్ చైర్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రా...
16/04/2026

పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూడూర్ లొ దివ్యంగులకు ఉచిత వీల్ చైర్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం మరియు ఉపసర్పంచ్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ బండ లింగారెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అంబేద్కర్ గారు కేవలం దళితుల నాయకుడు మాత్రమే కాదు — ఆయన ప్రతి భారతీయుడి నాయకుడు. B. R. Ambedkar అందించిన రాజ్యాంగం వల్లనే...
14/04/2026

అంబేద్కర్ గారు కేవలం దళితుల నాయకుడు మాత్రమే కాదు — ఆయన ప్రతి భారతీయుడి నాయకుడు. B. R. Ambedkar అందించిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవంతో జీవిస్తున్నాం.

అంబేద్కర్ గారు ఒక వర్గానికే కాదు, సమానత్వాన్ని నమ్మే ప్రతి మనిషికీ చెందినవారు.
ఈరోజుల్లో కూడా కొన్ని ఊర్లలో కుల వివక్ష మరియు అగ్రవర్ణాల పెత్తనం ఇంకా కనిపించడం మన సమాజానికి బాధాకరం. మనం ఎంత ముందుకు వెళ్లినా, ఈ పాత ఆలోచనలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది.

B. R. Ambedkar గారు కలలుగన్న సమానత్వ సమాజం అంటే — ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన హక్కులు, స్వేచ్ఛ ఉండే సమాజం.

మార్పు మన నుంచే ప్రారంభం కావాలి:
✔ కులం కాకుండా మనుష్యత్వాన్ని గౌరవిద్దాం
✔ వివక్షకు వ్యతిరేకంగా నిలబడదాం
✔ సమానత్వాన్ని ఆచరణలో చూపుదాం

నిజమైన అభివృద్ధి అంటే — అందరూ సమానంగా ఎదగడం.

అంబేద్కర్ జయంతి సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ గారికి గణ నివాళి 🙏

*భక్తి అవసరం కానీ  విద్య మరియు ఆరోగ్యం అత్యవసరం*“గ్రామంలో ఆధ్యాత్మిక చింతన పెరగడం మంచిదే… కానీ బడి మరియు ఆరోగ్యం ప్రాధాన...
08/04/2026

*భక్తి అవసరం కానీ విద్య మరియు ఆరోగ్యం అత్యవసరం*

“గ్రామంలో ఆధ్యాత్మిక చింతన పెరగడం మంచిదే… కానీ బడి మరియు ఆరోగ్యం ప్రాధాన్యత కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి.
బడి మరియు గ్రామంలోని ప్రజలు ఆరోగ్యాంగా ఉంటేనే గ్రామం బాగుంటుంది.”
“గుడి మనసుకు శాంతి ఇస్తుంది… బడి భవిష్యత్తు నిర్మిస్తుంది.”

మన గ్రామంలో గుడులు ఉన్నాయి, భక్తి ఉంది, పండుగలు ఘనంగా ఒకరితో ఒకరం పోటి పడుతూ జరుపుకుంటున్నాం ఇది చాలా మంచి విషయం.
కానీ ఒక చిన్న ప్రశ్న మనం మనకు మనమే అడగాలి…
మనం గుడికి ఇస్తున్న ప్రాధాన్యత, మన బడికి ఇస్తున్నామా?
గుడి మనకు ఆధ్యాత్మిక శాంతి ఇస్తుంది…
కానీ బడి మన పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది.
ఇప్పుడు మన గ్రామంలో గుడికి విరాళాలు ఇస్తున్నాం కాని బడికి మరియు ప్రభుత్వ దావకాన కి ఎంతమంది విరాళాలు ఇవ్వడానికి రెడీగా వున్నారు. సేవలు చేస్తున్నాం…
కానీ బడిలో పరిస్థితి ఎలా ఉంది?
పిల్లలకు సరైన సౌకర్యాలు ఉన్నాయా?
మన బడి బలంగా ఉందా? అని ఏరోజు ఆలోచించట్లేదు డబ్బులు పెట్టి మరి కరీంనగర్ మల్యాల గంగాధర జగిత్యాల లాంటి పట్టణాలకి డబ్బులు ఎంత అంటే అంతా పెట్టి చదివిస్తున్నాం. అదే మన గ్రామం లొ మన బడిని బాగుచేసుకొని అన్ని సౌకర్యాలని కల్పించి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులని అడుగలేమా మా పిల్లలకి మంచి విద్య ఇవ్వండి అని ఒక్కసారి మంచి ఫలితాలు రావడం స్టార్ ఐతే అందరి తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పిస్తారు.
చదువుకున్న పిల్లలు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది.
పేదరికం తగ్గుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, గ్రామానికి గౌరవం పెరుగుతుంది.
మన బడిని ప్రభుత్వ దవాఖాన ని అభివృద్ధి చేద్దాం
పిల్లల చదువుకు ఆరోగ్యానికి మన బడికి ప్రభుత్వ దావకాన కి కూడా ప్రాధాన్యత ఇద్దాం ✊🏻.

పూడూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మా అరపల్లి గ్రామ పరిస్థితి గడ్డితో నిండిన డ్రైనేజీ దీని కారణంగా దోమల బేడుదా ఎక్కువ గా వున్న...
05/04/2026

పూడూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మా అరపల్లి గ్రామ పరిస్థితి గడ్డితో నిండిన డ్రైనేజీ దీని కారణంగా దోమల బేడుదా ఎక్కువ గా వున్నది. గ్రామ సర్పంచ్ గారు పాలక వర్గం పారిశుధ్యం మీద ద్రుష్టి సారించి దోమల బెడదా నుండి కాపాడగలరు.🙏🏻🙏🏻

23/03/2026
23/03/2026

no to
***a

driving

శ్రీ శ్రీ శ్రీ సీతరామ చంద్ర స్వామి లక్ష్మణ హనుమత్ సహిత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం చాలా అంగరంగ వైభావంగా ప్రారంభం ఐనది గ్రామ...
21/03/2026

శ్రీ శ్రీ శ్రీ సీతరామ చంద్ర స్వామి లక్ష్మణ హనుమత్ సహిత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం చాలా అంగరంగ వైభావంగా ప్రారంభం ఐనది గ్రామ ప్రజలు భక్తులు ఈ విగ్రహ ప్రతిష్టపనా కార్యక్రమం లో పాల్గొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరు అని రామాలయ కమిటీ ఆహ్వానించటం జరుగుతుంది. జై శ్రీ రామ్!!!

పూడూరు రెడ్డి సంఘము ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలని సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మల్లేశం మరియు...
16/03/2026

పూడూరు రెడ్డి సంఘము ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలని సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మల్లేశం మరియు ఉపసర్పంచ్
రెడ్డి సంఘము నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Address

Poodur
Karimnagar
505501

Website

Alerts

Be the first to know and let us send you an email when Poodur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share