సిరిసిల్ల Sircilla

సిరిసిల్ల  Sircilla మన సిరిసిల్ల కావాలి

సిరుల ఖిల్లా

26/02/2025

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై వెళుతున్న బైక్ పై లారీ పడడంతో అక్కడికక్కడే మృతి..

26/02/2025

Vemulawada రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..

26/02/2025

I want to give a huge shout-out to my top Stars senders. Thank you for all the support!

Vengala Srinivas

26/02/2025

కరీంనగర్: సొంత ఇంట్లోనే భారీ చోరీ..!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ACP శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. అప్పులు ఎక్కువై ఎలా తీర్చాలో తెలియక నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడి చేయించాడు. దొంగల ముఠాతో చేయి కలిపి ఇంట్లో నుంచి 70తులాల బంగారం, రూ. 5లక్షలు చోరీ చేయించాడు. నిందితులను పట్టుకుని విచారించగా ఈవిషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్కు తరలించామని ACP తెలిపారు.

Date:25-02-2025రాజన్న సిరిసిల్ల జిల్లా.ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల సందర్భంగా 200 పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు.- పోలింగ్...
25/02/2025

Date:25-02-2025
రాజన్న సిరిసిల్ల జిల్లా.

ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల సందర్భంగా 200 పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు.
- పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలు.
- పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,

ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు అన్నారు.

ఈరోజు సిరిసిల్ల,తంగలపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ...
ఈనెల 27 వ తేదీన జరుగు ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఏర్పాటు చేసిన 41 పోలింగ్ కేంద్రాలో 23,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేల పోలింగ్ పక్రియ మొదలు నుండి పూర్తి అయ్యేవరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని పోలీస్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని,ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి గారు తెలిపారు.

ఎస్పీ గారి పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,రూరల్ సి.ఐ మొగిలి, చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ స్టేట్‌కు చ...
25/02/2025

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ స్టేట్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, పెట్టుబడులకు కల్పించిన అనుకూల పరిస్థితుల గురించి వారికి వివరించారు.

✳️తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, అవగాహనా ఒప్పందాల విషయంలో సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

✳️ఈ చర్చల్లో క్వీన్స్‌లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్ గారు, క్వీన్స్‌ల్యాండ్ ఆర్ధిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణా శాఖ మంత్రి రోస్లిన్ బేట్స్‌ గారితో పాటు ఇతర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. త...
25/02/2025

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం, అవసరమైన మౌలిక సదుపాయలు కల్పన, అందుకు అనుగుణమైన పాలసీ, తగిన సహకారాన్ని అందించడంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని చెప్పారు.

✳️హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మకమైన ‘బయో ఆసియా -2025’ రెండు రోజుల (22nd Edition) సదస్సును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సుకు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, దేశీయ సంస్థలతో పాటు ఆ రంగంలో నిపుణులు, నిష్ణాతులు హాజరయ్యారు.

✳️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “బయో ఆసియా సదస్సు హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌ రాజధానిగా మార్చింది. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో గడిచిన 25 ఏళ్లగా హైదరాబాద్ ను ఒక పవర్ హౌజ్‌గా నిలబెట్టింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్‌ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బయో సైన్సెస్‌లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శకనితతో ప్రభుత్వం ముందునుంచి పనిచేస్తోంది.

✳️జినోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. హెల్త్‌కేర్ రంగం భవిష్యత్తును నిర్ధేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా దేశవిదేశాలను ఆకర్షిస్తోంది. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాం. నిన్ననే ఆమ్‌జెన్ కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రభుత్వ సహకారానికి ఇది నిదర్శనం.

✳️జర్మనీ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించింది. ఈ వేదికపై మరో 4 బహుళజాతి కంపెనీలను తెలంగాణ పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాం. గతేడాది AI హెల్త్‌కేర్ సదస్సును కూడా విజయవంతంగా నిర్వహించాం.

✳️దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. అలాగే, గతేడాది లైఫ్‌ సైన్సెస్ రంగంలో రూ. 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. దాదాపు 150 పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయి.

✳️ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా, ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.

✳️వచ్చే పదేళ్లలో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాకుండా చైనా ప్లస్ వన్ ఆలోచనలకు సరైన ప్రత్యామ్నాయ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. నెట్ జీరో సిటీ కింద అనేక లక్ష్యాలను నిర్ధేశించాం.

✳️దేశ విదేశాల నుంచి బయో ఆసియా సదస్సుకు హాజరైన ప్రతినిధులందరికీ అభినందనలు. మీరంతా పెట్టుబడులకు తెలంగాణ అనువైన వేదికగా అవకాశాలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం”. అని ముఖ్యమంత్రి గారు సదస్సును ఉద్దేశించి వివరించారు.

✳️ఈ వేదికగా జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రిసిషన్ హెల్త్ రీసెర్చ్ (ప్రిసైస్) సింగపూర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొ. పాట్రిక్ టాన్‌కు బహూకరించారు. ప్రారంభ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు గారు, క్వీన్స్ లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్ గారితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

Address

Sircilla
Karimnagar
505301

Telephone

9989061659

Website

Alerts

Be the first to know and let us send you an email when సిరిసిల్ల Sircilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share