28/05/2026
తారక రాముడికి ఘననివాళి
దిగ్విజయంగా ముగిసిన మహానాడు
MLA ఇంటూరి సారధ్యంలో సూపర్ సక్సెస్
12 క్లస్టర్లలో పసుపు సైనికుల ప్రభంజనం
కార్యకర్తల హాజరు నమోదులో కందుకూరు రికార్డ్
రాష్ట్రస్థాయిలో... నెంబర్ 1 స్థానంలో క్లస్టర్ -6
నియోజకవర్గాల స్థాయిలో కందుకూరుకు 4వ స్థానం
ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేసిన చంద్రన్న
రెండోరోజు వేడుకల్లో పాల్గొన్న MP వేమిరెడ్డి గారు
రెండు రోజుల మహానాడు దిగ్విజయంగా ముగిసింది. పసుపు పండుగ నిర్వహణలో.... శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సారధ్యంలో కందుకూరు నియోజకవర్గం, రికార్డ్ సృష్టించింది. ప్రతిఫలంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీనుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. మహానాడును అద్భుతంగా నిర్వహించావంటూ నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేయడం విశేషం. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
మొత్తం 12 క్లస్టర్ల పరిధిలో.... కందుకూరు పట్టణంలో 4, ఉలవపాడులో 3, గుడ్లూరులో 2, లింగసముద్రంలో ఒకచోట హైబ్రిడ్ విధానంలో మహానాడు వేడుకను రెండవ రోజు నిర్వహించారు. తొలిరోజు కంటే రెట్టింపు ఉత్సాహంతో, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కార్యక్రమాల్లో పాల్గొనగా.... పసుపు సైన్యం సందడితో కళ్యాణ మండపాలు కిక్కిరిసిపోయాయి. ప్రతి గ్రామం నుంచి వందలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు. అన్నగారికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన 103వ జయంతి సందర్భంగా మదిలో స్మరించుకున్నారు.
ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, అన్ని క్లస్టర్ల వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని, పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ముందుగా పట్టణంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ప్రత్యేక వేదికల వద్ద అన్నగారికి నివాళులు అర్పించడంతోపాటు కేక్ కటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.... వర్చువల్ విధానంలో నిర్వహించుకున్న మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత నారా లోకేష్ గురించి పదేపదే ప్రస్తావిస్తూ... రాష్ట్ర అభివృద్ధికి వారు చేసిన కృషిని వివరించారు. అలాగే కోట్ల మంది సుశిక్షితులైన సైన్యాన్ని తయారు చేయడమే కాకుండా, వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్న లోకేష్ గారి నాయకత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలంగా తయారవుతోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 20 ఏళ్ల తర్వాత కందుకూరు చరిత్రను తిరగరాస్తూ సృష్టించిన ప్రభంజనంలో.... ప్రతి కార్యకర్త చెమట చుక్క ఉందని ఆయన గుర్తు చేశారు. వారందరి కష్టాన్ని, త్యాగాన్ని తాను జీవితాంతం మరిచిపోనని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, కార్యకర్త సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పక్కనపెట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉలవపాడులో జరిగిన మహానాడులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పసుపు పండుగ మహానాడును చూస్తుంటే కడుపు నిండిపోతోందని, ఇంతమంది కార్యకర్తల ఆశీస్సులు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగేలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పట్టుదల, ముందుచూపుతో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోందని అన్నారు.
*మహానాడు నిర్వహణలో కందుకూరు రికార్డు*
మహానాడుకు సంబంధించి కార్యకర్తల హాజరు నమోదులో కందుకూరు నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో, నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే కందుకూరు పట్టణంలోని 6 వ క్లస్టర్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పార్టీ పెద్దలు ప్రకటించారు. మహానాడు తొలి రోజున ఈ క్లస్టర్ నుంచి 2555 మంది, రెండవ రోజున 3763 మంది కార్యకర్తలు తమ హాజరు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 6318 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడంతో రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించినట్లు అయ్యింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఎమ్మెల్యే ను అభినందిస్తూ, మహానాడు ను అత్యద్భుతంగా నిర్వహించారని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నియోజకవర్గ నేతలు కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆరవ క్లస్టర్ ఇంచార్జి చిలకపాటి మధును ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పలువురు నేతలు ఘనంగా సత్కరించారు.
✌🏻 ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, జనిగర్ల నాగరాజు, రాచగర్ల సుబ్బారావు, మాదాల లక్ష్మీనరసింహం, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జులు కాకుమాని హర్ష, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, వంకాయలపాటి మాల్యాద్రి, వడ్డెళ్ళ రవిచంద్ర, చిలకపాటి మధు, గొంది నరసింగరావు, బొద్దులూరి కొండలరావు, చిత్తారు మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, పోలుబోయిన శ్రీనివాసులు, బెల్లం కృష్ణమోహన్, వాసు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పార్టీ సీనియర్ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు కల్లూరి శైలజ, నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, గ్రామ మరియు వార్డు అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జులు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.