CPM Eastgodavari

CPM Eastgodavari The CPI(M) was formed at the Seventh Congress of the Communist Party of India held in Calcutta from October 31 to November 7, 1964.

14/02/2026

మానవత్వమే నిజమైన ప్రేమ…

‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్న వాడు..’ అంటూ దిగులు పడిపోతున్న ఎందరికో మనిషి మాయమైపోలేదని, మానవత్వం ఇంకా బతికే ఉందని తాజా ఉదాహరణలు చెబుతున్నాయి.మనిషికి మనిషి సాయంగా నిలబడడం అంటే ‘ఇదీ అర్థం’ అని నిరూపిస్తున్నాయి.

సాటి మనిషికి కష్టం వస్తే ‘మనకెందుకులే’ అని చాలా మంది ఇప్పుడు దులిపేసుకోని పోవడం లేదు. ‘మనకేమీ కానీ మనిషి’కి ‘ఏమైతే మనకేంటి’ అని వదిలేసీ పోవడం లేదు. ఆ కష్టం ‘మా అందరిదీ’ అంటూ అండగా నిలబడుతున్నారు. ‘మేమున్నామని.. మీకేం కాద’ని భరోసా ఇస్తున్నారు.

ఉత్తరాఖండ్‌ నుండి తెలంగాణ వెలుగోడు వరకు ఇదే కనిపిస్తోంది. ‘మహ్మద్‌ దీపక్‌’ నుండి ‘కోవా బ్రదర్‌ వలీ’ వరకు ఇదే రుజువవుతోంది. సాటి మనిషి పట్ల చూపే మానవత్వమే నిజమైన ప్రేమ.ఇలాంటి మానవత్వమే ద్వేషానికి సమాధానం. నేటి ప్రపంచానికి అవసరం.

👉దీపక్‌కి దన్నుగా …

‘నా పేరు మహ్మద్‌ దీపక్‌’.. అంటూ ఉత్తరాఖండ్‌ నివాసి అయిన జిమ్‌ ఓనర్‌, జనవరి 26న భజరంగ్‌ దళ్‌ మూకకి చెప్పిన సమాధానం ఇప్పుడు దేశమంతా గట్టిగా వినిపిస్తోంది. నిస్సహాయస్థితిలో ఉన్న ఓ ముస్లిం బట్టల దుకాణదారుడిపై విరుచుకు పడుతున్న మూకకి ఎదురుగా నిలబడినందుకు, ముస్లిం వ్యక్తికి అండగా నిలబడినందుకు అప్పటి నుండి దీపక్‌పై ఆ మూక ఎన్ని కుయుక్తులు పన్నుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు.

చంపుతామని బెదిరించినా ఖాతరు చేయలేదని బరితెగించిన ఆ మూక, జనవరి 31న వందల సంఖ్యలో దీపక్‌ జిమ్‌ ముందు నానా యాగీ చేశారు. దానికీ దీపక్‌ భయపడలేదు కానీ, అతని జిమ్‌కి వచ్చే జనాలు మాత్రం బెంబేలెత్తిపోయారు.

ఫలితంగా 150 మంది సభ్యులతో నిత్యం వర్కౌట్లు చేస్తూ కోలాహలంగా ఉండే ఆ జిమ్‌లో ఇప్పుడు పట్టుమని 20 మంది సభ్యులు కూడా రావడం లేదు. క్రమంగా ఆ సంఖ్య 15 మందికి పడిపోయింది.దీపక్‌ జీవితం సాఫీగా సాగాలంటే జిమ్‌ సజావుగా నడవాలి. కానీ ఇప్పుడా పరిస్థితి అక్కడ కనిపించలేదు.

ఈ పరిస్థితుల్లోనే దీపక్‌ని, బట్టల దుకాణాదారుడైన అహ్మద్‌ని కలిసేందుకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సిపిఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ అక్కడికి వెళ్లారు. దీపక్‌ చూపించిన తెగువ, సాహసాన్ని అభినందించేందుకు వెళ్లిన జాన్‌కి అక్కడి వాస్తవ పరిస్థితులు తెలిశాయి. వెంటనే ఆయన దీపక్‌ జిమ్‌లో ‘ఏడాది సభ్యత్వం తీసుకుంటాను’ అంటూ సభ్యత్వ రుసుము చెల్లించారు.

అహ్మద్‌ దుకాణానికి కూడా ఎవరూ రావడం లేదని తెలుసుకుని అక్కడా దుస్తులు కొనుగోలు చేశారు. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించింది. దీపక్‌ వాస్తవ పరిస్థితి జనాలకి తెలిసింది.

ఇటీవల సోషల్‌ మీడియాలో దీపక్‌ కూడా తన పరిస్థితిని వివరించాడు.జిమ్‌ అద్దె నెలకు రూ.40 వేలు, ఇంటి లోను రూ.16 వేలు కట్టుకోవడం చాలా కష్టంగా ఉందని ఎంతో ఆవేదనగా వాపోయాడు. ఇప్పుడు జాన్‌ బ్రిట్టాస్‌ చూపిన మార్గంలో ఎందరో దీపక్‌కి సాయంగా నిలబడుతున్నారు. దేశ నలుమూలల నుండి దీపక్‌ జిమ్‌లో సభ్యత్వం తీసుకుంటున్నారు.

ఆ రోజు జరిగిన గొడవలో దీపక్‌కి అండగా పోలీసులు నిలబడలేదు. మందలు మందలుగా జిమ్‌పై మూక దాడికి తెగిస్తే ఆపలేదు.బిజెపి పాలక రాష్ట్రంలో అది ఊహించలేం. హిందూ,ముస్లిం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న ఆ మూకకి ప్రత్యర్థి ముస్లిం వ్యక్తే కానవసరం లేదు. అతనికి సహాయంగా హిందూ వ్యక్తి మాట్లాడినా సహించలేరు.

ఈ సంఘటనతో ఈ విషయం దేశ ప్రజానీకానికి కళ్లకి కట్టినట్లు అర్థమైంది. ‘ముస్లింలు ఈ దేశ పౌరులు కారా? వాళ్లని మీరు బతకనీయరా! వృద్ధుడైన అతనిపై అంత దూకుడుగా ఎందుకు వెళుతున్నారు?’ అని దీపక్‌ ఆ రోజు అడిగిన ప్రశ్నలకి ఎంతోమంది భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి.

‘నేను హిందువుని కాను,ముస్లింని కాను,సిక్కుని, జైనుని కాను.. నేను భారతీయుడిని.అన్యాయం జరగుతుంటే చూస్తూ ఈ రోజు నేను మౌనంగా ఉంటే, రేపు నా పిల్లలూ ఇదే నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఇది నాకు ఇష్టం లేదు’ అంటూ అతను విడుదల చేసిన వీడియోకి కోట్లాది భారతీయులు జేజేలు పలికారు. ఈ అభిమానం, గౌరవం ఇప్పుడు దీపక్‌ జిమ్‌లో సభ్యత్వం తీసుకోవడంలో స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా దీపక్‌కి సాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఓ సామాజిక వేత్త 100 మంది సభ్యత్వ రుసుము చెల్లించడానికి ముందుకు వచ్చారు. జిమ్‌లో సభ్యత్వం తీసుకునే వారు ఈ నెంబరుకి పంపండి అంటూ సోషల్‌ మీడియాలో 99533 11518 నెంబరు కూడా వైరల్‌ అవుతోంది

01/01/2026

Address

Kacheripeta
Kakinada

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Eastgodavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share