07/02/2026
ఇడ్లీ పిండి, దోశ పిండి, ఐస్‌క్రీం, పల్లీ చిక్కీ, తయారుచేసే శ్రీ వైష్ణవి డైరీ వద్ద, పెద్ద స్థాయిలో ఆవు నెయ్యి తయారీ అనుభవం కానీ మౌలిక వసతులు లేవని CBI నేతృత్వంలోని SIT సమర్పించిన చార్జ్‌షీట్ స్పష్టం చేస్తోంది. అయినా కూడా, టిటిడి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందిన A.R. డెయిరీ, ఈ యూనిట్‌ను స్థానిక ప్రాసెసింగ్ కేంద్రంగా చూపిస్తూ, నెయ్యి ప్రాసెసింగ్ జరిగినట్టుగా తప్పుడు ఇన్వాయిస్‌లు, కల్పిత రికార్డులు సృష్టించి కాంట్రాక్ట్‌ను నడిపినట్టు తేలింది..
ఇడ్లీ పిండి తయారు చేసే శ్రీ వైష్ణవి డైరీతో పామ్ ఆయిల్ వ్యాపారులు కుమ్మకై, పామ్ ఆయిల్, కెమికల్స్, ఇతర కొవ్వు ఆధారిత మిశ్రమాలను ఆవు నెయ్యిలా చూపించే ప్రయత్నం చేశారు.
ఒక ప్రణాళికాబద్ధంగా హైందవ సంప్రదాయాలపై గత YSR Congress Party - YSRCP చేసిన కుట్రలో భాగమే ఈ శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణం.