భారతీయ జనతాపార్టీ కదిరి

  • Home
  • India
  • Kadiri
  • భారతీయ జనతాపార్టీ కదిరి

భారతీయ జనతాపార్టీ కదిరి Political organization in kadiri assembly

04/06/2026

భారతదేశ ప్రయోజనాలే పరమావధిగా మోదీ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతూ.. ఇప్పటికే 'సింధు జలాల ఒప్పందాన్ని' పక్కన పెట్టిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు ₹2,300 కోట్లతో వ్యూహాత్మక 'చినాబ్-బియాస్ లింక్ ప్రాజెక్టు' పనులను ప్రారంభించబోతోంది.

04/06/2026

ప్రధాని మోదీ గారి దార్శనికతతో రక్షణ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది. ఆపరేషన్ సింధూర్‌లో మన స్వదేశీ ఆయుధాలైన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో ₹38,424 కోట్లకు చేరాయి.

03/06/2026

గుంటూరులో అత్యాధునిక "లలిత హాస్పిటల్" నూతన భవన ప్రారంభోత్సవంలో సంచలన గణాంకాలతో మాట్లాడిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 600 పడకల అంతర్జాతీయ స్థాయి లలిత హాస్పిటల్‌ను ప్రారంభించిన అనంతరం, రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వ పక్కా యాక్షన్ ప్లాన్‌ను మంత్రి గారు వివరించారు.

ప్రసంగంలోని అత్యంత కీలక ముఖ్యాంశాలు:

సేవా నిరతి: 36 ఏళ్లుగా గుంటూరు ప్రాంతంలో ‘గివ్ బ్యాక్ టు ద సొసైటీ’ స్ఫూర్తితో నాణ్యమైన సేవలు అందిస్తున్న డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ విజయ గారి దంపతులకు అభినందనలు.

రూ. 18 కోట్ల అధునాతన MRI: గుండె, పక్షవాతం వ్యాధుల భారానికి (32% CVD మరణాలు) అడ్డుకట్ట వేసేందుకు ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పించడం ఆనందకరం.

'సంజీవని' హెల్త్ ప్లాట్‌ఫామ్: డోర్‌స్టెప్ వద్దే 42 రకాల ఉచిత పరీక్షలు అందిస్తూ, రోగుల రికార్డుల కోసం దేశంలోనే తొలిసారిగా 'సంజీవని' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తెచ్చాం.

గోల్డెన్ అవర్‌లో ప్రాణరక్షణ (STEMI): రూ.45,000 ఖరీదు చేసే ‘టెనెక్టెప్లేస్’ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందిస్తూ, 96% సక్సెస్ రేటుతో 4,900 మంది ప్రాణాలను కాపాడాము.

గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ తెచ్చిన విలయం (2020-2024):

లివర్ (కాలేయ) కొత్త కేసులు: 4,917 నుండి 11,223 కి (250% వృద్ధి) పెరిగాయి.

కిడ్నీ కొత్త కేసులు: 15,058 నుండి 23,558 కి (75% వృద్ధి) చేరాయి.

న్యూరో (స్ట్రోక్) కేసులు: 380 నుండి ఏకంగా 7,646 కేసులకు (2000% వృద్ధి) పెరిగాయి.

ఆరోగ్యశ్రీపై అసత్యాల ఖండన: ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.4,225 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలతో కలిపి ఈ రెండేళ్లలోనే రూ.6,900 కోట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులకు క్లియర్ చేసాము.

వివక్ష లేని CMRF: ధర్మవరం నియోజకవర్గానికి గత 5 ఏళ్లలో కేవలం రూ.3 కోట్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే రూ.9.42 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు అందించాం.

'స్వర్ణాంధ్రప్రదేశ్' ప్రణాళికలో భాగంగా హెల్దీ & హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించి, వికసిత భారత్‌లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం!

భారత్ మాతా కీ జై! 🇮🇳

Satya Kumar Y

03/06/2026

మమతా బెనర్జీకి షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు

31/05/2026

మోదీ హామీ అంటే - ఇచ్చిన ప్రతీ హామీని తప్పకుండా నెరవేరుస్తాం!

బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెంగాల్‌కు ఇచ్చిన ఆరు హామీలపై పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.

తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బీజేపీ కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది.

27/05/2026

దశాబ్దాల పాటు భారత్ సరిహద్దులను
బలహీన ప్రాంతాలుగా చూసిన కాలం ముగిసింది…

నేడు ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో
అవి హైటెక్ భద్రతా కవచాలుగా మారుతున్నాయి!

🔸 పాకిస్థాన్ & బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట దాదాపు 6,000 కి.మీ మేర “స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్”
🔸 AI కెమెరాలు, డ్రోన్లు, రాడార్లు, థర్మల్ ఇమేజింగ్ & గ్రౌండ్ సెన్సర్లు ఏర్పాటు
🔸 సరిహద్దు మౌలిక వసతుల కోసం ₹13,000 కోట్లకు పైగా పెట్టుబడి
🔸 క్లిష్ట ప్రాంతాల్లో 1,812 కి.మీ సరిహద్దు రహదారులు నిర్మాణం
🔸 ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో 3,180 కి.మీ ఫెన్సింగ్ పూర్తి
🔸 చొరబాట్ల నియంత్రణకు 1,000 కి.మీ పైగా ఫ్లడ్‌లైటింగ్
🔸 “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” ద్వారా సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, వైద్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణ

సాఫ్ట్ బోర్డర్ల నుంచి స్మార్ట్ & స్ట్రాంగ్ బోర్డర్ల దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.

ఇప్పుడు భారత సరిహద్దులు బలహీనంగా లేవు…
అవి దేశ రక్షణకు అజేయ కోటలుగా మారుతున్నాయి!

26/05/2026

12 సంవత్సరాల క్రితం ఇదే రోజున దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి పునాది పడింది
కర్మయోగి శ్రీ నరేంద్రమోదీ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు

25/05/2026

భారతదేశానికి తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది.

భారతదేశం ఎక్కడ నుండి చమురు కొనవలసి వచ్చినా, మేము అక్కడి నుండే కొంటాము.

అమెరికా మన నిర్ణయంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా ఫర్వాలేదు.

రష్యా మాకు చౌకగా చమురు ఇస్తే, మేము రష్యా నుంచే చమురు కొంటాము.

: ఎస్ జైశంకర్, విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వం

23/05/2026

రాష్ట్ర మంత్రి Satya Kumar Y గారు

22/05/2026

చొరబాటు దారులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ప్రతి చొరబాటుదారుడిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది.

చొరబాటుదారులను గుర్తించి దేశం నుండి పంపించివేస్తారు.

ఈ విషయంపై పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం జరగనుంది

Address

Anantapor
Kadiri

Telephone

9701886902

Website

Alerts

Be the first to know and let us send you an email when భారతీయ జనతాపార్టీ కదిరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share