20/03/2025
దాదాపు 15 రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్పగారి మాధవి రెడ్డి గారి పని తీరు ప్రశంసనీయం. 👏👏
ప్రతి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ప్రజాసంబంధిత ఎన్నో కీలక సమస్యలను, ముఖ్యంగా కడప ప్రజల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విధానం అభినందనీయం.
ఆమె ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు:
✅ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ
✅ కడప హోమియోపతి కళాశాల అధ్యాపకుల నియామకం, వసతుల కల్పన
✅ రిఫ్రిజిరేటర్, AC టెక్నీషియన్లను కార్మిక విభాగం ద్వారా గుర్తింపు
✅ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై చర్చ
✅ రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల పెన్షన్ సమస్య పరిష్కారానికి ప్రస్తావన
✅ 1998 డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై ప్రత్యేక దృష్టి
✅ స్కూల్ పిల్లలకు ట్యాబ్ డివైజ్‌లను తొలగించి, లేబొరేటరీలు ఏర్పాటు
✅ కడప నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ లైన్ల సమస్యను లేవనెత్తడం
✅ కడపలోని టిడ్కో ఇళ్ల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి
✅ కడపలో అక్రమ లేఔట్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు
ఇవేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 16347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో, కడపలో పేద ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించేందుకు కడప కేంద్రంగా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని శ్రీ నారా లోకేష్ గారికి వినతిపత్రం సమర్పించడం అభినందనీయం.
కడప మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆమె కృషి ఎంతగానో ప్రశంసించదగినది!! 👏👏🙏🙏
ధన్యవాదాలు MLA మేడమ్ 💐💐👏👏🙏🙏
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కె.శ్రీకాంత్
40 బూత్ ఇంచార్జ్
44 డివిజన్