PDSU Kadapa

PDSU Kadapa అధ్యయనం పోరాటం

*నకిలీ బిఎడ్ కళాశాలలలో అన్ని అక్రమాలే లేనివి వున్నాట్లు చెప్పడం వైవియు అధికారులకే సాధ్యం బిల్డింగ్, అధ్యాపకులు, విద్యార్...
03/06/2026

*నకిలీ బిఎడ్ కళాశాలలలో అన్ని అక్రమాలే లేనివి వున్నాట్లు చెప్పడం వైవియు అధికారులకే సాధ్యం బిల్డింగ్, అధ్యాపకులు, విద్యార్థులు లేకున్నా అన్ని ఉన్నట్లు రిపోర్టులు వైవియు అధికారుల వింతలు బిఎడ్ కళాశాల తనిఖిలల్లో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న అధికారులు*

*పీడీఎస్ యు ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు*

జిల్లాలో యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బిఎడ్ కళాశాలల్లో ఏమి లేకున్నా అన్ని ఉన్నట్లు వైవియు అధికారులు వింతలు చూపిస్తున్నారని పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న అన్నారు. బుధవారం పీడీఎస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ..
ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బిఎడ్ కళాశాలలు తనిఖీలు జరుగుతున్నాయని, ఈ తనిఖిల్లో చాలా కళాశాలలు బిల్డింగ్ లు లేకున్నా, అధ్యాపకాలు లేకున్నా, విద్యార్థులు లేకున్నా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్నరూ. పేరుకేమో వైవియు అధికారుల తనిఖీలు అంటారు.కానీ వైవియు అధికారికంగా ఇచ్చినా కాలేజీ గుర్తింపు అడ్రస్ లో కనీసం అయ్యా కళాశాల పేరుతో గల బోర్డు కూడా ఉండదు అన్నారు. మరి వైవియు అధికారులు తనిఖీలు ఎక్కడ చేస్తున్నారని సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. ప్రధానగా వైవియు అని సిడిసి డీన్ రఘు బాబు అక్రమాలకు అంతు లేకుండా పోయిందన్నారు. దశలవారుగా పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనట్లు వారు తెలిపారు.ఇకనైనా విసి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు జగదీశ్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

బిఎడ్ కళాశాలల తనిఖల పేరుతో వైవియు అధికారుల లీలలుబిఎడ్ కళాశాలలకు కనీసం పేరుతో బోర్డు కూడా ఉండదు, తనిఖీలు పూర్తి అంటూ రిపో...
02/06/2026

బిఎడ్ కళాశాలల తనిఖల పేరుతో వైవియు అధికారుల లీలలు

బిఎడ్ కళాశాలలకు కనీసం పేరుతో బోర్డు కూడా ఉండదు, తనిఖీలు పూర్తి అంటూ రిపోర్టులు

జిల్లాలోని బిఎడ్ కళాశాలలకు బిల్డింగ్, అధ్యాపకులు, విద్యార్థులు లేకున్నా అన్ని వున్నాయి అంటూ రిపోర్టులు ఎలా ఇస్తారు...???

ఎడ్ సెట్ కౌన్సిలింగ్ లో అర్హతలేని బిఎడ్ కళాశాలలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి...

పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.అంకన్న డిమాండ్

వైవియు వైస్ ఛాన్సెలర్ బెల్లం కొండా రాజశేఖర్ గారికి వినతిపత్రం ఇచ్చిన PDSU నాయకులు...

వైవియు పరిధిలోని బిఎడ్ కళాశాలలను తనిఖీల పేరుతో అన్ని ఉన్నట్లు నకిలీ రిపోర్టులు తయారు చేస్తున్నారని, విద్యావ్యవస్థను వైవియు ,సిడిసి అధికారులు బ్రష్టుపట్టిస్తున్నారని పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.అంకన్న అన్నారు.
మంగళవారం వైవియు పరిపాలన భవనంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని బిఎడ్ కళాశాలలో ఏ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు, NCERT నిభందనలు పాటించడం లేదు, అయినా కూడా యోగి వేమన విశ్వవిద్యాలయ అధికారులు బిఎడ్ కళాశాలలతో చేతులు కలిపి వారికి అనుకూలంగా వ్యవహారిస్తునరన్నారు. బిల్డింగ్, అధ్యాపకులు లేకున్నా, విద్యార్థులు లేకున్నా, అసలు జిల్లాలో ఎక్కడ కూడా ఆ కళాశాల పేరు గల బోర్డు కూడా ఉండదు. ఈ విధంగా బోగుస్ కళాశాలలు గా వున్నా హన్నమ్మ క్రిస్టియానిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు
అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రాజంపేట
శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైల్వే కోడూరు
శ్రీమతి నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బద్వేల్
వికాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పబ్బాపురం సికెదిన్నె
అశోక్ కుమార్ రెడ్డి బిఈడి కాలేజ్ ఓబులాపురం
శ్రీ సాయి రాజేశ్వరి బిఈడి కాలేజ్ లింగాపురం ప్రొద్దుటూరు
ఫ్రెండ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి నక్కలు దీన్నే రోడ్ చాపాడు
హెలెన్ కిల్లర్ కాలేజ్ ఆఫ్ స్కూల్ స్పెషల్ ఎడ్యుకేషన్
స్వచ్ఛ్ ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు
రోసమ్మ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కడప
శ్రీ గురూజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు
సాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు మొదలైన కళాశాలల పై తనిఖీ లు పేరుతో సిడిసి డీన్ రఘుబాబు అవినీతికి పాల్పడుతున్నారని, వైస్ ఛాన్సెలర్ గా మీరు భాద్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడియస్ యు జిల్లా నగర నాయకులు మనోజ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అకాడమిక్ క్యాలెండర్‌ పై స్పష్టత ఇవ్వాలి: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు ఒకే విధానం అమలు చేయ...
25/05/2026

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అకాడమిక్ క్యాలెండర్‌ పై స్పష్టత ఇవ్వాలి: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు ఒకే విధానం అమలు చేయాలి : పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జూన్ 5 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో అకాడమిక్ క్యాలెండర్‌ పై ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వాలని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం కడప నగరంలోని పీడీఎస్‌యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1 నుంచి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం ఇంటర్ జూనియర్ కళాశాలలు ప్రస్తుతం ఇంటర్ పరీక్షా కేంద్రాలలో జూన్ 5 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే కడప జిల్లా పరిధిలో కడప నగరం, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించారని ఆర్ఐఓ వెంకటేశ్వర్లు ప్రేక్షక పాత్రలో ఉండిపోయారన్నారు.అయితే పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ, చిన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తరగతులు ప్రారంభించలేని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో అయోమయం ఏర్పడుతోందన్నారు. దీనివల్ల విద్యార్థుల మధ్య విద్యా అసమానతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, చిన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒకే తేదీ నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అకాడమిక్ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యు జిల్లా నగర నాయకులు మహేశ్, ఆరిఫ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

మే 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే POW ఆంధ్ర ప్రదేశ్ మహాసభల్ని జయప్రదం చేయండి
24/05/2026

మే 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే POW ఆంధ్ర ప్రదేశ్ మహాసభల్ని జయప్రదం చేయండి

పత్రికా ప్రకటనNEET పరీక్ష పత్రాల లీకేజీపై నిరసన – సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలి – పీడీఎస్‌యూNTAను వెంటనే రద్దు చేయాలి ...
22/05/2026

పత్రికా ప్రకటన
NEET పరీక్ష పత్రాల లీకేజీపై నిరసన – సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలి – పీడీఎస్‌యూ
NTAను వెంటనే రద్దు చేయాలి – వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి : పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న
కడప నగరంలోని బిల్టాప్ సర్కిల్ ప్రాంతంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, NEET పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పత్రాల లీకేజీ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పరీక్షల నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కోట్లాది రూపాయల కోచింగ్ మాఫియా, అవినీతి, పత్రాల లీకేజీల కారణంగా సామాన్య, పేద, గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. NEET పరీక్షల పేరుతో విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెంచి వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
NEET పరీక్ష పత్రాల లీకేజీ ఘటనపై సీబీఐతో నిష్పక్షపాత న్యాయ విచారణ జరిపించి అసలు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA)పై ప్రజల్లో విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో NTAను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి, రాష్ట్రాల విద్యా విధానాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ చేపట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కార్పొరేట్ విద్యా మాఫియా చేతుల్లో పెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నగర నాయకులు మనోజ్, మహేశ్, దుర్గేష్, గణేష్, ఉపేంద్ర, ఖాసీం, తేజ తదితరులు పాల్గొన్నారు.

*కడప జిల్లా విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి – విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు పీడీఎస్‌యూ విజ్ఞప్తి*  *ఇంటర్ ఫ...
21/05/2026

*కడప జిల్లా విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి – విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు పీడీఎస్‌యూ విజ్ఞప్తి*

*ఇంటర్ ఫలితాల పతనం, విశ్వవిద్యాలయాల్లో అవకతవకలు, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలి : పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న*

కడప జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న కోరారు. గురువారం పీడీఎస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ కడప జిల్లాలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66%, రెండో సంవత్సరం 71% మాత్రమే నమోదవ్వడం, రాష్ట్ర స్థాయిలో జిల్లా 24వ, 25వ స్థానాల్లో నిలవడం జిల్లాలో విద్యా ప్రమాణాల క్షీణతను సూచిస్తోందన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, బోధన ప్రమాణాలు పడిపోవడం, పర్యవేక్షణ లోపాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
మే 21వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న కీలక సమయంలో పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాల్సిన అధికారులు మే 20వ తేదీ నాడు ఆర్ఐఓ వెంకటేశ్వర్లు కడప నగరంలో కొత్త ప్రైవేట్ జూనియర్ కళాశాలల తనిఖీల పేరుతో హడావుడి చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
అలాగే గత వైకాపా ప్రభుత్వ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో 240కి పైగా, ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంలో 100కి పైగా ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, బిల్డింగ్ బాడుగల పేరుతో కోట్ల రూపాయల అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో ప్రస్తుతం యోగివేమన విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి పాత్ర పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, కడప జిల్లా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు మనోజ్, దుర్గేష్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

ిద్యారంగం_కాపాడాలి























ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో కడప నగరంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల తనిఖీల హడావుడి ఎందుకు? – ఇంటర్ ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు...
21/05/2026

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో కడప నగరంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల తనిఖీల హడావుడి ఎందుకు? – ఇంటర్ ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు సమాధానం చెప్పాలి : పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న

ఈ నెల 21వ తేదీ (నేటి నుంచి) ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న అత్యంత కీలక సమయంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థుల పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ, ప్రశాంత వాతావరణం కల్పించడం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించడం వంటి బాధ్యతలను పక్కనపెట్టి కడప నగరంలో పలు కొత్త ప్రైవేట్ జూనియర్ కళాశాలల తనిఖీల పేరుతో అసాధారణ హడావుడి చేయడం వెనుక అసలు కారణాలు ఏమిటో ఇంటర్ ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు ప్రజలకు బహిరంగంగా చెప్పాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న డిమాండ్ చేశారు. బుధవారం పీడీఎస్ యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ..
ప్రైవేట్ జూనియర్ కళాశాలల చుట్టూ తిరగడం వెనుక ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయా? లేక డబ్బుల కోసమే ఈ హడావుడా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు.
ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసి, విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసి, కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల ప్రయోజనాల కోసం, కనీస నిబంధనలు, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, గ్రౌండ్‌లు, మరుగుదొడ్లు, నాన్ టీచింగ్ సిబ్బంది లేకున్నా ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు మనోజ్, దుర్గేష్, ఆరిఫ్, జగదీశ్వర్ రెడ్డి, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

*రాయచోటి పీజీ కేంద్రంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించాలి*  *వెంటనే క్లాసులు ప్రారంభించి పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలి* ...
19/05/2026

*రాయచోటి పీజీ కేంద్రంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించాలి*
*వెంటనే క్లాసులు ప్రారంభించి పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలి*
*యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్‌కు పీడీఎస్‌యు వినతి*

అన్నమయ్య జిల్లా విద్యార్థుల ఉన్నత విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాయచోటి పీజీ కేంద్రాన్ని పూర్తి స్థాయి యూనివర్సిటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని, విద్యార్థులకు తరగతులు నిర్వహించి పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ పీడీఎస్‌యు ఆధ్వర్యంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్‌కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న మాట్లాడుతూ, 2021లో ప్రభుత్వం రాయచోటిలో పీజీ కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ నేటికీ విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. పూర్తి స్థాయి అధ్యాపకులు లేకపోవడం, శాశ్వత భవనాలు, హాస్టల్ సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధిక ఖర్చులు భరించలేక చదువును మధ్యలోనే ఆపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పీజీ కేంద్రంలో క్లాసులు ప్రారంభించి, పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యు జిల్లా నాయకులు మహేష్, ఖాసీం, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎండల్లో విద్యార్థులను క్లాసుల పేరుతో వేధిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై వెంటనే హత్యాయత్నం కేసులు నమోదు చేసి సీజ్ చేయాలికార...
18/05/2026

ఎండల్లో విద్యార్థులను క్లాసుల పేరుతో వేధిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై వెంటనే హత్యాయత్నం కేసులు నమోదు చేసి సీజ్ చేయాలి
కార్పొరేట్ విద్యా మాఫియాకు దాసోహం అయిన ఆర్ఐఓ వెంకటేశ్వర్లును వెంటనే బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి
— పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న

రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు, వడగాలులతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో కూడా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ విద్యార్థులను బలవంతంగా క్లాసులకు రప్పిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించడం, రెండో సంవత్సరం విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ ప్రాంతాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని, ప్రాణ భద్రతను పూర్తిగా పక్కనబెట్టి కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఫీజుల దందా కోసం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా జడ్పీ సీఈఓ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ అక్రమాల పై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంటర్ ఆర్ఐఓ వెంకటేశ్వర్లు స్పందించకపోవడం వెనుక కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో ఉన్న కుమ్మక్కు బహిర్గతమైందని అంకన్న విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా కార్పొరేట్ కళాశాలల లాభాలకే కాపలా కాస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అక్రమ తరగతులను నిలిపివేసి సంబంధిత కార్పొరేట్,ప్రైవేట్ జూనియర్ కళాశాలలను సీజ్ చేయాలని, యాజమాన్యాల పై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, ఆర్ఐఓ వెంకటేశ్వర్లును బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా నగర నాయకులు మనోజ్, మహేశ్,దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు

*ప్రైవేట్ టీచర్లను బోధనకు పెట్టారా..? అడ్మిషన్ల కోసం వీధుల్లో తిరగడానికి పెట్టారా..? : పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ...
18/05/2026

*ప్రైవేట్ టీచర్లను బోధనకు పెట్టారా..? అడ్మిషన్ల కోసం వీధుల్లో తిరగడానికి పెట్టారా..? : పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న*

రాయచోటి, మే 17 : రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి ఉపాధ్యాయులను బానిసల్లా ఉపయోగిస్తున్నాయని పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం రాయచోటిలోని డైట్‌లో మాట్లాడుతూ, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లను అడ్మిషన్లు, ఫీజులు, టార్గెట్ల కోసం ఇంటింటికీ తిప్పడం దారుణమన్నారు. టీచర్లు చదువు చెప్పాలా..? లేక అడ్మిషన్ల కోసం ప్రచారం చేయాలా..? అని ప్రశ్నించారు.

కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు టీచర్లకు నెలకు ఇన్ని అడ్మిషన్లు తేవాలంటూ టార్గెట్లు విధిస్తూ, పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం అత్యంత దౌర్జన్యమన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయించి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం అమానుషమన్నారు. తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల పేరుతో దోచుకుంటూ, మరోవైపు టీచర్లను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కళ్లముందు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. యాజమాన్యాలతో కుమ్మక్కై టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోకపోతే పీడీఎస్ యు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ముట్టడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.

🔥 ప్రైవేట్ టీచర్లను బోధనకు పెట్టారా..? అడ్మిషన్ల కోసం వీధుల్లో తిరగడానికి పెట్టారా..? 😡📚
💥 ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీపై పీడీఎస్ యు ఫైర్
⚠️ టీచర్లపై టార్గెట్లు.. జీతాల బెదిరింపులు.. విద్యను వ్యాపారంగా మార్చిన యాజమాన్యాలు!
✊ వెంటనే చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరిక

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share