13/10/2025
*ఐసిడిఎస్ అధికారి నారాయణరెడ్డి పై సమగ్ర విచారణ జరిపించండి*
*శ్రీ సత్య సాయి జిల్లా ఎసిడిఎస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్బి పి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు డిర్ఓ మరియు కలెక్టర్ గారికు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పోతలయ్య, పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా స్త్రీ శిశువు సంక్షేమ శాఖ లో సీనియర్ అసిస్టెంట్ గా కొన్నేళ్లుగా పాతుకుపోయిన నారాయణ రెడ్డి భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పలువురు చీదరించుకునే విదంగా చేస్తున్నారన్నారు. వన్ స్టాఫ్ సెంటర్ నియామకాల్లోను ఎక్సపీరియెన్స్ సర్టిఫికెట్ ను సృష్టించారని, నకిలీ సర్టిఫికెట్ ను సృష్టించి ఒక్కొక్కరి ద్వారా దాదాపుగా 3లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వున్నాయన్నారు.చిక్కిలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేసి, సొంత పరిశ్రమలో నాశిరకం చిక్కిలు తయారుచేస్తూ నాసిరకం పోషకాలు అందిస్తూ చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.ఐసిడిస్ శాఖలో పనిచేస్తున్న అధికారులను గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడైనా చిన్న తప్పిదలు జరిగిన, వారి నుంచి భారీగా వసూలు చేస్తూ కోట్లకు పండగలేత్తరన్నారు. ఈ అవినీతి అధికారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు జగదీష్ అనిల్,పిఎస్యు నాయకులు కేశవ సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు*