SHO Jagtial Traffic

SHO Jagtial Traffic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Jagtial Traffic, Police station, Jagtial.

*- జులై 1 నుండి అమల్లోకి కొత్తచట్టాలు**- - -కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి**- - - జిల్ల...
01/07/2024

*- జులై 1 నుండి అమల్లోకి కొత్తచట్టాలు*

*- - -కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*

జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పి పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.*కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు - *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.* జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

Today, in view of road safety month from 15-01-2024 to 14-02-2024, Road safety awareness programmes were conducted in th...
27/01/2024

Today, in view of road safety month from 15-01-2024 to 14-02-2024, Road safety awareness programmes were conducted in the District in all the police stations areas. Gave Awareness among students and general public & Sensitized them about road accidents and it's consequences.

In view of road safety month from 15-01-2024 to 14-02-2024      program was conducted to the Students and Auto Drivers a...
24/01/2024

In view of road safety month from 15-01-2024 to 14-02-2024 program was conducted to the Students and Auto Drivers at various police stations limits in the district among general public & Sensitized them about road accidents. .

జగిత్యాల జిల్లా.....*గడువు లోగా డిస్కౌంట్ ట్రాఫిక్ చలాన్ల అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్ర...
06/01/2024

జగిత్యాల జిల్లా.....

*గడువు లోగా డిస్కౌంట్ ట్రాఫిక్ చలాన్ల అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు.*

ట్రాఫిక్ చాలన్ లు పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని తేదీ: 10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవడానికి ఇంకా 05 రోజులు మాత్రమే ఉన్నది అని వాహనదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ చాలన్ చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. https://echallan.tspolice.gov.in/publicview/ తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే , మీ సేవ,ఈ సేవ లో చెలించవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చినప్పటి నుండి ఈరోజు వరకు జిల్లా వ్యాప్తంగా 1,03,202 ట్రాఫిక్ చాలన్ల ను చెల్లించడం జరిగిందని ఇంకా 3,40,860 చలన్స్ పెండింగ్లో ఉన్నాయని ఈ యొక్క రాయితీ అవకాశాన్ని వాహనదారుల సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు.

*ఆర్టీసీ బస్సులుకు 90% శాతం రాయితీ.*

*ద్విచక్ర & త్రి చక్ర వాహనలకు 80% శాతం రాయితీ.*

*నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితి.*

జగిత్యాల జిల్లా.....*పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.* *జగిత్యాల పట్టణ మరియు ట్రాఫి...
02/01/2024

జగిత్యాల జిల్లా.....

*పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.*

*జగిత్యాల పట్టణ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు.*

ఈ సందర్బంగా ఎస్పీ గారు స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు.అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూమ్ లో రికార్డ్స్ భద్రపరచుట, 5S అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన కాలనీల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.

టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్, ట్రాఫిక్ ఎస్. ఐ రామచంద్రo, సిబ్బంది పాల్గొన్నారు

15/12/2023

పత్రికా ప్రకటన

జగిత్యాల పట్టణం: ఈరోజు జగిత్యాల పట్టణంలో తేదీ 04/12/2021రోజున ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు రెండవసారి మద్యం తాగి పట్టుబడిన కుడిసెల తిరుపతి S/0 : సాయిలు వయసు: 44, అనే వాహనదారుని జగిత్యాల జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు కోర్టులో చేయడం ప్రొడ్యూస్ చేయగా, spl జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గారు Gampa Karunakar గారు రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది.
ఇట్టి విషయాన్ని పురస్కరించుకొని ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం గారు మాట్లాడుతూ డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రెండవసారి తాగి దొరికిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని తెలియజేసినారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కోర్టుకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని కూడా త్వరలో పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అని తెలియజేసినారు.

జగిత్యాల జిల్లా....*- - - విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలి*విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలప...
25/08/2023

జగిత్యాల జిల్లా....

*- - - విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలి*

విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో జిల్లాలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండ ఉంటాయని ఒక మంచి ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ గుర్తులు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించడం జరిగింది.

సందర్భంగా విద్యార్థులకు మోటర్ వాహనాల చట్టం గురించి పోలీస్ చట్టాల గురించి తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు విద్యార్థి దశ నుండే అలవర్చుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు అని రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించ లని ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించినట్లయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు అని తెలియ చేయడం జరిగింది. త్రిబుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే వారికి డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి,ఈ- చాలన్ ద్వారా ఫైన్ లు వేయడం జరుగుతున్నదని తెలిపినారు. మైనర్ గా ఉన్నప్పుడు వాహనాలను నడప రాదని వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా ప్రమాద సంభవిస్తే తల్లిదండ్రులతో పాటు నడిపిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన వీడియోలను చూపించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ లో గల ట్రాఫిక్ గుర్తులను, సిగ్నల్స్ యొక్క ఉపయోగాల ను విద్యార్థులకు తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ రామచంద్రం, RSI కృష్ణ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, 60 మంది విద్యార్థులు, పాల్గొన్నారు.

మానవ ప్రవర్తనలో మార్పు అనేది తప్పకుండా ఉండాలి.ట్రాఫిక్ పోలీస్ వారి కౌన్సెలింగ్ ద్వారా తన తప్పును తెలుసుకొని మళ్ళీ నేను మ...
25/08/2023

మానవ ప్రవర్తనలో మార్పు అనేది తప్పకుండా ఉండాలి.
ట్రాఫిక్ పోలీస్ వారి కౌన్సెలింగ్ ద్వారా తన తప్పును తెలుసుకొని మళ్ళీ నేను మద్యం త్రాగి వాహనం నడపను అని ప్రమాణం చేసి తనలో మార్పు వచ్చిందని పబ్లిక్ గా చెప్పినందుకు గాను అభినందనలు.
ప్రజలలో మార్పు వచ్చేలా కౌన్సెలింగ్ చేసిన SI గారికి అభినందనలు.

Address

Jagtial
505327

Website

Alerts

Be the first to know and let us send you an email when SHO Jagtial Traffic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category