Telugu Desam Party: Jaggayyapeta

Telugu Desam Party: Jaggayyapeta Official Page of TDP Jaggayyapeta

03/06/2026
03/06/2026

చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని నీకు..
BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే ?

గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు. కానీ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ల గురించి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయి? జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదే.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కావు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ జాబితాను రూపొందించారు.

2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలోనే 'బ్రిడ్జ్' ఆటను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తించింది. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.

అయితే గొడ్డలి పార్టీకి మాత్రం BRIDGE అంటే వాళ్ల ఇళ్లలో ఆడుకునే పేకాట అనే కోడి బుర్ర మైండ్‌సెట్ ఉంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువతను జగన్ రెడ్డి ఇలా హేళన చేస్తున్నాడు.



Sreeram Rajagopal - Tataiah

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన మేడి రోశయ్య కుటుంబం దివ్యాంగ కుమారుడు, పేద ఆర్థిక పరిస్థితులు మరియు శిథిలా...
03/06/2026

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన మేడి రోశయ్య కుటుంబం దివ్యాంగ కుమారుడు, పేద ఆర్థిక పరిస్థితులు మరియు శిథిలావస్థలో ఉన్న ఇంటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి దృష్టికి రావడంతో ఆయన చొరవ తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, దాతలు మద్దుల జయప్రకాష్, మీసాల రాజా తదితరులు ముందుకు వచ్చి సహాయం అందించారు. వారి సహకారంతో తక్కువ సమయంలోనే కొత్త ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది.

అనంతరం ఎమ్మెల్యే గారు కుటుంబాన్ని కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజంలో సేవా భావం, దాతృత్వం పెరగాలని, ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే ఎన్నో కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.




Sreeram Rajagopal - Tataiah

03/06/2026

బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇవ్వటం జగన్ వ్యతిరేకమా ? టీచర్లు అంటే జగన్ రెడ్డికి మొదటి నుంచి కడుపు మంటే.. ఆ కడుపు మంటతోనే డీఎస్సీ పై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.






Sreeram Rajagopal - Tataiah

03/06/2026

5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పి, 5 సాక్షి క్యాలెండర్లు వదిలాడు ..

ఇలాంటి గొడ్డలి పార్టీ నేతలు, యువతకు ఉద్యోగాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు.. గొడ్డలి వేటు వేస్తున్నారు..






Sreeram Rajagopal - Tataiah

03/06/2026

దేశంలో కరెంటు చార్జీలు తగ్గించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. యూనిట్‌కు 13 పైసలు తగ్గించాం. విద్యుత్ ఉత్పత్తి ఖర్చును మరింత తగ్గించి, ఆ ఫలితాలను ప్రజలకు అందించాలని చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మా ప్రభుత్వం పని చేస్తోంది.







Sreeram Rajagopal - Tataiah

03/06/2026

నాడు బాబాయ్ తల అయినా, నేడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల అయినా...

వాళ్ల తలలు వాళ్లే నరుక్కుంటారు... మన మీదకు తోస్తారు...

ఇదే గొడ్డలి పార్టీ మూల సిద్ధాంతం...






Sreeram Rajagopal - Tataiah

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

• ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు

• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు

• 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

• పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/fQDZV





Sreeram Rajagopal - Tataiah

02/06/2026

"ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ సౌకర్యం గురించి కల్లుగీత కార్మికుడు సింహాచలంను ఆరా తీసి, అతనికి వృద్ధాప్య పెన్షన్ రూ. 4000 స్వయంగా అందించిన సీఎం చంద్రబాబు.








Sreeram Rajagopal - Tataiah

02/06/2026

కల్లు గీత కార్మికుడు సింహాచలం తో ముచ్చటిస్తూ తాటి చెట్ల నిర్వహణ, కల్లు సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..








Sreeram Rajagopal - Tataiah

Address

Jaggayyapeta
521175

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Jaggayyapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Jaggayyapeta:

Share