14/02/2026
🙏✊ జై జనసేన ✊ 🙏 తేది 14-02-2026 న :- శనివారం ఉదయం 10 గంటలకు ఇచ్చాపురం మున్సిపాలిటీలో 4,5 వార్డులలో పర్యటించిన *ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లోళ్ళ రాజేష్ గారు*
ఇచ్చాపురం మున్సిపాలిటీ స్థానిక ప్రజలు మరియు మున్సిపాలిటీ ఇంచార్జీ రోకళ్ళ భాస్కర రావు గారు ఆహ్వానం మేరకు ఈ రోజు విచ్చేసి *జనసేన పార్టీ నాయకులు, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి లోళ్ల రాజేష్ గారు* 4, 5 వార్డుల ప్రధాన సమస్యలు ...
01.డ్రైనేజీ ద్వారా వచ్చే వ్యర్థాలు మరియు కలిసుత నీరు, ప్లాస్టిక వ్యర్థాలు పంట పొలాల్లో పేరుకుపోవడం
02. త్రాగు నీటి సమస్య
03. వీధి దీపాలు లేనందు వలన.ఇక్కడ సుమారు 07 సంవత్సరల నుంచి డ్రైనేజీ ద్వారా వచ్చే కలుషిత నీరు మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలు పంట పొలాల్లో పేరుకుపోవడం సుమారుగా 25 ఎకరాల పంట పొలాలు ఇక్కడ ఉన్నాయి.డ్రైనేజీ ద్వారా వచ్చే కలుషిత నీరు ప్లాస్టిక్ వ్యర్ధాల వలన పంటలు పండించడానికి వీలు లేదు కనుక రైతులు బోరున ఏడుస్తున్నారు.ప్రభుత్వ అధికారులకు మరియు రాజకీయ నాయకుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన సరే సమస్య క్లియర్ అవ్వలేదు. సమస్య ఉన్నదని తెలియగానే నేరుగా ప్రజల వద్దకే వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన *లోళ్ళ రాజేష్ గారు* మాట్లాడుతూ తన సొంత నిధులతో ఒక జెసిబి నీ ఏర్పాటు చేసి 4,5 వార్డుల డ్రైనేజీ ద్వారా వచ్చే వ్యర్ధాలు పంట పొలాల్లో పెరికిపోయిన కలుషిత నీరు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకటి, రెండు రోజుల్లో తొలగిస్తా అని హామీ ఇచ్చారు.మిగతా ఉన్నా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని ఇక్కడున్న ప్రజలకు హామీ ఇచ్చారు. డ్రైనేజీ నుంచి వచ్చే కలుషిత నీరు వ్యర్ధాల సమస్యను జెసిబి సహాయంతో దగ్గరుండి క్లియర్ చేయవలసిన బాధ్యత స్థానిక నాయకులు రోకళ్ళ భాస్కరరావు మరియు మండల నాయకులు చీకటి కృష్ణయ్యకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇంచార్జ్ రోకళ్ళ భాస్కరరావు మరియు మండల నాయకులు చీకటి కృష్ణయ్య , ప్రభాకర్, నాని,సుజిత్,బాలు మరియు పంట పొలాల రైతులు తదితరులు హాజరయ్యారు.🙏✊ జై జనసేన ✊🙏🇮🇳 జై హింద్ 🇮🇳