18/10/2022
కోస్తా ఆంధ్ర మీద, శ్రీకాకుళం మీద మీకు అంత ప్రేమ ఉంటే వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలని డెవలప్ చెయ్యండి, పరిశ్రమలను తీసుకురండి,
సిదిరి అప్పలరాజు గారు పోటీ చేసి గెలిచిన పలాస ని అర్బన్ సిటీ గా, స్మార్ట్ సిటీ గా ఇంకా ఎక్కువ డెవలప్ చెయ్యండి
వైజాగ్ కి రైల్వే జోన్ ఇవ్వాలి,
భూ కబ్జాల మీద వస్తున్న వార్తల మీద నిజాలు జనాలకి చెప్పాల్సిన అవసరం ఉంది.ఒకసారి ఆత్మ పరిశీలన చేస్కోండి.
శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలలని రహదారులన్నీ ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి చిద్రం అయి ఉన్నాయి,
ఎన్నో రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు వెయ్యండి ముందు...
కళింగపట్నం పోర్ట్ ని డెవలప్ చెయ్యండి, ఇంకా అదనంగా పోర్ట్ లని డెవలప్ చెయ్యండి, మిని వైజాగ్ బీచ్ గా పేరొందిన బారువా బీచ్ నీ డెవలప్ చెయ్యండి.
ఫిషెరీస్ నీ ఫిషర్మెన్ కుటుంబాలని ఆదుకోండి,
రైతు కుటుంబాలకు కనీస మద్దతు ధర కల్పించండి
ఎడ్యుకేషన్ పరం గా శ్రీకాకుళం చాలా వెనకబడి ఉంది, నా ఉద్దేశం నిజమైన ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ గా నేర్చుకున్న దానిని ఫిజికల్ గా అప్లై చెయ్యడం.
క్లాసెస్ లో ఎంత మంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ గా ఒక కోర్స్ గానీ ఒక సబ్జెక్టు గానీ నేర్చుకోగలుగుతున్నారు.
శ్రీకాకుళం ఉద్దనం ప్రజలు కిడ్నీ సమస్యల తో బాధపడుతున్నారు, వారికి వెన్ను - దన్ను గా నిలబడండి,
ఎన్నో ప్రకృతి అందాలు కలిగిన శ్రీకాకుళం ని, విజయనగరం ని టూరిస్ట్ హబ్ గా మార్చండి
దోపిడీలు మీరే చేస్తారు సలహాలు మీరే ఇస్తారు
ఇలాంటి సమస్యలన్నీ గాలికి వదిలేసి, ఒక ఎమ్మెల్యే స్థాయి అంటే గౌరవప్రదమైన స్థాయి, ఆ స్థాయి లో ఉండే వ్యక్తులు ఆచి - తోచి మాట్లాడాలి,
అది మానేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి గత జీవితం మీద పడతారు,ప్యాకేజీ అంటారు, ఇంట్లోవాల్లని తిడతారు, కులాల వారిగా, ప్రాంతాల వారిగా చిచ్చులు రేపుతారు, మాటలని వక్రీకరించి తారుమారు చేసి మాట్లాడతారు, బూతుల భాగోతం మొత్తం ప్రజలందరూ చూసి నవ్వుకునే విధంగా, చీదరించుకునే విధంగా వ్యవహరిస్తారు, సిగ్గుండాలి కొంచెం అయినా, మీ ధ్యాస అంతా పవన్ కళ్యాణ్ గారి మీదనే ఉంటే ఇంక పరిపాలన ఎం చేస్తారు, ప్రజల బాగోగులు ఎం చూస్తారు. ఇలానే మీ వ్యవహార శైలి ఉంటే ప్రజలు ఏదో ఒక రోజు తమ ఉక్కు పాదాన్ని వైసీపీ పార్టీ మీద మోపుతారు
Janasena Party Student Wing - Srikakulam