10/10/2026
దసరా సెలవుల్లోనూ క్లాసులా? విద్యార్థుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదు! ✊
ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా నిబంధనలకు విరుద్ధంగా హయత్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్, శ్రీ నారాయణ జూనియర్ కళాశాలల్లో చాటుగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఏఐఎస్ఎఫ్ (AISF) మండల సమితి ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. పండుగ పూట పిల్లలకు కనీస విశ్రాంతి లేకుండా చేసి వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తే సహించేది లేదు.
సెలవుల్లో ఎలాంటి స్పెషల్ క్లాసులు కానీ, పరీక్షలు కానీ నిర్వహించవద్దని యాజమాన్యాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.
మండల విద్యాశాఖ అధికారి (MEO) గారు తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని విద్యాసంస్థలకూ కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం!
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.