02/09/2026
ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొన్నారు.
టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు "ప్రజలతో ముఖాముఖి" కమిటీ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. పరిష్కారం గాని ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు మేమంతా కృషి చేస్తున్నమని షబ్బీర్ అలీ గారు తెలిపారు.