08/10/2026
వరి సాగులో కృత్రిమ మేధస్సు వినియోగం (RAISE IIRR MOBILE APP).
ఆధునిక వరి సాగులో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ వరి పరిశోధనా సంస్థ వారు రైస్ ఏఐ స్ట్రెస్ ఎవాల్యుయేటర్ (RAISE) App ను రూపొందించారు ఈ App వరి పంటలో కనిపించే సమస్యలను ఫోటోల ఆధారంగా గుర్తించి, AI ఆధారిత నమూనాలతో తక్షణ పరిష్కారాలను సూచిస్తుంది
ఈ నేపథ్యంలో 07 అక్టోబర్ 2026 న, భారతీయ వరి పరిశోధనా సంస్థ,హైదరాబాద్, కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట వారి సహకారంతో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మరియు ఇల్లంతకుంట మండలాలలో రెండు గ్రామాలలో ఈ అవగాహన సదస్సు నిర్వహించి, రైతుల ఫోనులలో ఈ యాప్ను ఇన్స్టాల్ చేశారు.
ఈ కార్యక్రమములో డా. B Sailaja, ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ, రైతులు ఈ RAISE యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, మట్టి పరీక్షల ఆధారంగానే రసాయనిక ఎరువులను వాడాలని రైతులకు వివరించారు.
Dr Krishnaveni, ప్రధాన శాస్త్రవేత్త గారు వరి పంటలో తలెత్తే సమస్యలకు తీసుకోవలసిన సరైన నివారణా చర్యల (Management Practices) గురించి సమగ్రంగా వివరణ ఇచ్చారు.
డా. శ్రీనివాస్ రెడ్డి గారు(శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట) వరిపంటలో వచ్చే చీడ పీడల సమస్యలు అప్ ను ఉపయోగించుకొని ఎలా నిర్ణయాలు తీసుకోవాలో వివరించారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ లో Dr N వెంకటేశ్వరరావు గారు సీనియర్ సైంటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, G అశోక్ గారు SRT కోఆర్డినేటర్, Sri Mahesh garu, Smt Prashanthi garu, Sri Venugopala garu, Sri Vangala Vankata Reddy garu, ATMA Chairman, 10 మంది సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్ట్ సిబ్బంది, 60 మంది BSc Ag -RAWE students, 50 మంది మంది రైతు సోదర సోదరీమణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Indian Council of Agricultural Research Shivraj Singh Chouhan MyGovIndia PMO India Press Information Bureau - PIB, Government of India Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India