07/03/2025
All the best team. Few lines from - Kiranmyee Deram
Eagerly waiting to watch on bigscreen Actor Nani odela Vinay Sagar cherukuri Kolla Avinash srinivas mahakali paturi ganesh k masadi yalla
దగడ్ దగడ్
దగడ్ దగడ్
ఆకలి తీరని ఆశలు ఎన్నో
చరిత లో రక్తపు మిరుగులు ఎన్నో
మనసు ని చిదిమి స్వేచ్ఛ ను నలిపి
రక్తం మరిగిన ఆవేశంలో
అడుగే ఆశై కలలే వెలుగై
వచ్చె రా వచ్చె రా దగడ్
ఈ భూమి ఎవడి ఆలి కాదని
ఆ నింగే అందరి హద్దని
అలసిన రెక్కలే రేపటి దారై
నీ బిడ్డే ఆ కలికి ఉసురై
నీ కన్నీటికి సాక్షై
మెరిసే మెరిసే దగడ్
దగడ్ దగడ్
దగడ్ దగడ్
రంగుల స్వప్నంలో కాకులే కనబడితే
మెలుకువ వచ్చేనా మధురం అనిపించేనా
కాకుల కనుసైగ కు తూఫాను తడబడునని
చావును సైతం ఎదురేగునని తెలిసేనా ఈ జీవరాశులకు
దగడ్ దగడ్
దగడ్ దగడ్
చూడరా చూడరా ఆ శివతాండవ గర్జన
హస్తమే త్రిషులమై ఇవ్వరా అమ్మ కు అర్పన
మూడో కన్ను తెరిచేలోపే మట్టు పెట్టరా
సుందర నగ్న అసత్యాన్ని
లెక్కలన్నీ సరిచేసి గెలిచి రారా
దగడ్ దగడ్
దగడ్ దగడ్