21/06/2018
హెచ్ఎండీఎ కు ఉద్యాన వనాల నిర్వహణ లో అవార్డుల పంట
హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్ధకు ఉద్యానవన మహోత్సవ పోటీలో అత్యధిక అవార్డులు గెలుచుకుని అగ్ర భాగాన నిలిచింది. . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన వన విభాగం వారు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే సంస్ధలను ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో ఈ ఏడాది జనవరి 25 నుంచి 31 వరకు ఏర్పాటు చేసిన ఉద్యానవన మహోత్సవ పోటీ లో18 బహుమతులు సాధించి హెచ్ఎండీఎ మొదటి స్ధానంలో నిలిచింది. మొత్తం 26 కేటగిరీల్లో హెచ్ఎండీఎ పోటీ పడగా, అందులో 11 ప్రధమ బహుమతులు, 5 ద్వితీయ బహుమతులు, 2 తృతీయ బహుమతులు పొందింది. పోటీ పడిన అన్ని సంస్ధల కన్నా అత్యధిక బహుమతులు పొంది ఓవరాల్ ఛాంపియన్ గా రోలింగ్ కప్పును హెచ్ఎండీఎ పొందింది. అవుటర్ రింగ్ రోడ్ అవెన్యూ ప్లాన్టేషన్ కు తెలంగాణ హరిత హారం- పచ్చదనం (గ్రీన్ బెల్ట్) విభాగంలో ప్రధమ బహుమతి పొందింది. అలాగే స్మారక ఉద్యానవనం(పార్క్)–రాష్ట్ర నాయకులు విభాగం లో ఎన్.టి.ఆర్. మెమోరియల్ పార్క్, జాతీయ నాయకులు విభాగంలో పి.వి.ఘాట్, థీమ్ పార్క –నేచురల్ విభాగంలో బటర్ ఫ్లై గార్డెన్ కు, థీమ్ పార్క్ ఇన్నోవేటివ్ విభాగంలో రోజ్ గార్డెన్, బిగ్గెస్ట్ థీమ్ పార్క్ విభాగంలో రాక్ గార్డెన్, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ లాండ్ స్కేపింగ్ విభాగంలో జాతీయ జెండా, పార్క్స్ విత్ ఎంటర్టేయిన్మెంట్ షో విభాగంలో లేజర్ షో, అత్యధిక ప్రజలు సందర్శించే పార్కుల కేటగిరీ లో లుంబినీ పార్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ కేటగిరీ లో ముఖ్యమంత్రి కేంప్ కార్యాలయం మరియు నివాస గృహం, హర్బల్ గార్డెన్ రాజ్ భవన్, పిల్లల వైజ్ఞానిక పార్క్ విభాగంలో సంజీవయ్య పార్క్ లోని సైన్స్ పార్క్, తెలంగాణా నేటివిటి పార్క్ కేటగిరి లో బతుకమ్మ ట్రైల్స్- నెక్లేస్ రోడ్డు, బోన్సాయి గార్డెన్ కేటగిరి లో ఎన్.టి.ఆర్. గార్డెన్- బోన్సాయి గార్డెన్, జపనీస్ గార్డెన్ కేటగిరిలో ఎన్.టి.ఆర్. గార్డెన్ లోని జపనీస్ గార్డెన్, రోటరీసే విత్ ప్లవర్ ప్లాంట్స్ ప్లాంటేషన్ కేటగిరీ లో ఇందదిరా రోటరీ, బెస్ట్ ఐ లాండ్ పార్క్ కేటగిరి తెలుగు తల్లి ఐ లాండ్ కు ప్రధమ బహుమతులు వచ్చాయి. అలాగే హర్బల్ గార్డెన్ కేటగిరిలో సంజీవయ్య పార్కులోని హర్బల్ గార్డెన్ మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏరియా పార్క్ కేటగిరి లో ఉప్పల్ భగాయత్ లే అవుట్ కు 2 వ బహుమతి, మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ కేటగిరిలో సచివాలయం కు మూడవ బహుమతి లభించింది. ఈ పోటీలో హెచ్ఎండీఎ తో పాటు జిహెచ్ఎంసి, మెట్రో రైల్, డిఆర్ డీఓ, డీఆర్ డీఎల్, ఇన్ఫోసిస్, రైల్వేస్, ప్రగతి రిసార్ట్స్, ఉద్వాన శాఖ, మిలటరీ తదితర 24 సంస్ధలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, ఉద్యాన వన విభాగానికి చెందిన రిటైర్డ్ ఉన్నతాధికారులు, లాండ్ స్కేప్ నిపుణులతో కూడిన 18 మంది సభ్యులు కలిగిన కమిటీ వ్యక్తిగతంగా పరిశీలించి విజేతలను నిర్ణయించారు.
నేడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఎ కమీషనర్ టి. చిరంజీవులు బహుమతులను ఆందుకున్నారు. పార్కులలో పచ్చదనం, నాణ్యత, పూల దిగుబడి, ప్రజల స్పందన, వినూత్న ప్రయత్నాలు తదితర 24 విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ సంధర్భంగా పిన్స్ పల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో పట్టణ అటవీ విభాగం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించటం చేస్తున్న కృషి పట్ల హెచ్ఎండీఎ కమీషనర్ టి.చిరంజీవులు ను అభినందించారు. ఇతర న్యాయనిర్ణేతలు కూడా హెచ్ఎండీఎ, పట్టణ ఉద్యాన వన విభాగం ద్వారా నగరంలో పచ్చదనాన్ని పెంచడంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రధ్ధను పోటీ నిర్వహణాదారులు కొనియాడారు. ...............హెచ్ఎండీఎ....