JanaSena Telangana

Directions Website

JanaSena Telangana SHATAGNI Digital Regiment - Telangana JanaSena Party, Telangana

08/10/2026

ప్రజలపై భారం మోపుతాం అంటే చూస్తూ ఊరుకోం..

-జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్

ములుగు నియోజకవర్గ కేంద్రంలో జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు కొలిపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప...
08/10/2026

ములుగు నియోజకవర్గ కేంద్రంలో జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు కొలిపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ రుంకు సాయికృష్ణ జనసైనికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డా.గడల శ్రీనివాస్ రావు గారిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ, జనసైనికులు మారబోయిన సంతోష్,అంకం ఉతేజ్,రంజిత్,శ్రావణ్ వీరమహిళలు జ్యోతి,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

08/10/2026

17 శాతం పర్షపాతం లోటు వలన 18 జిల్లాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

సోయి లేని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేసి నీళ్లు లేక నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము

ఈ కరువు పరిస్థితుల్లో నష్టపోయిన ప్రతి రైతుల గురించి ఆలోచించకుండా వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల పేరు మీద వృధా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

ప్రకటన లపైన ప్రచారాలపైన దృష్టి మళ్లించి రైతుల కష్టలపైన సోయి పెట్టి కరెంటు , నీళ్లు రైతులకు పూర్తి స్థాయిలో అందించాలని జనసేన పార్టీ తరుపున, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము

జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా, కోదాడ నియోజకవర్...
07/10/2026

జనసేన పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా, కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీమతి సాయి శిరీష పొన్నూరు ఆదేశాల మేరకు కోదాడ, మునగాల మండలాల్లో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

నాయకులు పసుపులేటి రామారావు, వినయ్ కాసర్ల, జూలకంటి శ్రీను, బాదే అంజి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. అలాగే గ్రంథాలయంలో నిరుద్యోగులు, పట్టభద్రులతో సైదులు గారు ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల సమస్యలు, ఆశయాలను తెలుసుకుంటూ, రాబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో MLC ఎన్నికల వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ శ్రీ డా. చుంచు రాజ్ కిరణ్ విస్తృతంగా పర్...
07/10/2026

వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో MLC ఎన్నికల వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ శ్రీ డా. చుంచు రాజ్ కిరణ్ విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా కాజీపేట్ 45, 47 డివిజన్లు, సుబేదారి 59, 62 డివిజన్లలో పట్టభద్రుల MLC ఎన్నికలకు అర్హులైన పట్టభద్రులను అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసిన శ్రీమతి బయ్యపు పద్మావతి, జి. రవితేజ, శ్రీమతి మేకల ప్రసన్న మరియు వారి టీమ్, గోపు నవీన్ మరియు వారి టీమ్, అలాగే వరంగల్ ప్రముఖ వైద్యులు, వర్మ చెస్ట్ హాస్పిటల్ అధినేత ఎం. శ్రీనివాస్ వర్మ మరియు వారి సిబ్బంది, వరంగల్‌కు చెందిన ప్రముఖ డా. కూరపాటి రమేష్ మరియు వారి సిబ్బందిని కలిసి ఓటర్ నమోదు ప్రక్రియను అభినందిస్తూ సన్మానించారు.

ఈ సందర్భంగా డా. చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా MLC ఓటరుగా నమోదు చేసుకోవాలని, నాయకులు ఓటర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి అధిక సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు.

అలాగే పట్టభద్రులు ఆలోచించి, ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, జనసేన పార్టీ MLC అభ్యర్థి శ్రీ డా. గడల శ్రీనివాస రావు గారికి తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చౌటుప్పల్‌లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్...
07/10/2026

చౌటుప్పల్‌లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రాముఖ్యతను వివరించి, అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ గడల శ్రీనివాసరావు కోసం జనసేన నాయకులు, జనసైనికులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. అర్హులకు ఉచితంగా ఓటర్ నమోదు ప్రక్రియలో సహాయం అందిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గం నాయకులు కూనపురెడ్డి శివ కార్తీక్, పీక ప్రవీణ్, పల్చం శ్రీకాంత్, సరికొండ సంజయ్, నిఖిల్, రమణబాబు, రాజు, గణేశ్, నజీర్, సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.

పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై జనసేన పార్టీ నాయకులు అవగాహన కార్యక్...
07/10/2026

పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై జనసేన పార్టీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ డా. గడల శ్రీనివాస్ రావు గారిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ముస్కు రమేష్ గారు, జనసైనికులు గూడా అభిలాష్, మూర్తల విరాట్, రాజులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఖిల్లా వరంగల్ వాకర్స్ ...
07/10/2026

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఖిల్లా వరంగల్ వాకర్స్ క్లబ్ సభ్యులను కలిసి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావును గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల ప్రక్రియలో చైతన్యవంతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కరాటే ప్రభాకర్ గారు మరియు టీమ్ పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించగా, పలువురు గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకుంటామని తెలిపారు.

06/10/2026

ఖమ్మంలో జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి, జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాస రావు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి విద్యావంతులైన పట్టభద్రులకే ఉందని, పట్టభద్రులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై శాసనమండలిలో నిర్భయంగా ప్రశ్నించే గొంతుకగా నిలబడతానని హామీ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో కోఆర్డినేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయించడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

తనను ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే పట్టభద్రుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడతానని డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు వెల్లడించారు.

Address

8-1-246/2, Near Malkam Cheruvu, Chitrapuri Colony, Manikonda
Hyderabad
500089

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share