వికీపీడియా

వికీపీడియా వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. http://te.wikipedia.org/

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత జ్ఞాన వనరు అయిన వికీపీడియా, మీరు ఎవరో గమనించకుండా చదవడానికి, రాయడానికి మీ హక్కును కాపాడుతుంది....
29/01/2026

ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత జ్ఞాన వనరు అయిన వికీపీడియా, మీరు ఎవరో గమనించకుండా చదవడానికి, రాయడానికి మీ హక్కును కాపాడుతుంది.
వికీమీడియా ఫౌండేషన్ అభిప్రాయం ప్రకారం, స్వేచ్ఛకు గోప్యత చాలా అవసరం. అందుకే వారి ప్రాజెక్టులు వినియోగదారుల గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే సేకరిస్తాయి ఈ గోప్యతా నిబద్ధత కేవలం విధానాలకే పరిమితం కాదు. ఎడిటర్లు తమ అసలు పేర్లకు బదులు కల్పిత పేర్లతో (ప్సూడోనిమ్) లేదా ఖాతా లేకుండానే సహకరించవచ్చు. గుర్తింపు బయటపడితే ప్రమాదం ఉండే పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం. వికీమీడియా ఫౌండేషన్ సామూహిక నిఘాను (మాస్ సర్వైలెన్స్) వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ నిఘాలో సమతుల్యత, వినియోగదారులకు సమాచారం ఇవ్వడం, పారదర్శకత ఉండాలనే అంతర్జాతీయ సూత్రాలకు మద్దతు ఇస్తుంది.
ఫౌండేషన్ డేటాసెట్లను విడుదల చేసినప్పుడు, వ్యక్తులను గుర్తించలేని విధంగా ‘డిఫరెన్షియల్ ప్రైవసీ’ పద్ధతిని ఉపయోగిస్తుంది. కంటెంట్ తొలగింపు అభ్యర్థనలను సాధారణంగా వాలంటీర్ సమాజాలు చూసుకుంటాయి. అధికారిక అభ్యర్థనలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన వాటి వివరాలను ఏడాదికి రెండుసార్లు పారదర్శక నివేదికలుగా ప్రచురిస్తారు.
ఇంకా తెలుసుకోండి (మీపై నిఘా లేకుండా)

Follow the Wikimedia Foundation on social media to get news and updates on our projects, global community, and advocacy efforts.

Wikipedia 25 Birthday సందర్భంగా వివిధ పత్రికలలో వచ్చిన కథనాలు , ఎందరో  వికీపీడియా సభ్యుల సమిష్టిగా స్వచ్చందంగా చేసిన కృష...
23/01/2026

Wikipedia 25 Birthday సందర్భంగా వివిధ పత్రికలలో వచ్చిన కథనాలు , ఎందరో వికీపీడియా సభ్యుల సమిష్టిగా స్వచ్చందంగా చేసిన కృషి 🙏

విజ్ఞానాన్ని స్వేచ్ఛగా ప్రపంచానికి అందిస్తున్న వికీపీడియా 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో, జనవ...
18/01/2026

విజ్ఞానాన్ని స్వేచ్ఛగా ప్రపంచానికి అందిస్తున్న వికీపీడియా 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో, జనవరి 18న IIIT Hyderabad లో నిర్వహిస్తున్న వేడుకలకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని Open Knowledge Initiatives (OKI) ఆధ్వర్యంలో ఈరోజు, జనవరి 18 ఆదివారం సాయంత్రం నిర్వహించడం ఎంతో ఆనందకరం.
ఉచిత విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే మహత్తర లక్ష్యంతో మీరు చేస్తున్న కృషి అపూర్వమైనది. వాలంటీర్లుగా, రచయితలుగా, సంపాదకులుగా మీరు పెట్టే నిబద్ధత, శ్రమ వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో నమ్మకమైన సమాచార భండారం అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక వెబ్‌సైట్ విజయం కాదు — ఇది సమష్టి కృషితో నిర్మితమైన మానవ విజ్ఞాన ఉద్యమం.
ఈ వేడుకలు మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో మరెన్నో తరాల వరకు విజ్ఞానాన్ని పంచుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
వికీపీడియా ప్రయాణం ఇలాగే వెలుగులు చిందిస్తూ కొనసాగాలని కోరుకుంటూ — మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు!

వికీపీడియా 25 ఏళ్లు: స్వచ్ఛంద సేవకుల నిరంతర కృషికి నిదర్శనం​గత 25 ఏళ్లుగా వికీపీడియా ఉచిత జ్ఞానానికి చిరునామాగా నిలిచింద...
15/01/2026

వికీపీడియా 25 ఏళ్లు: స్వచ్ఛంద సేవకుల నిరంతర కృషికి నిదర్శనం
​గత 25 ఏళ్లుగా వికీపీడియా ఉచిత జ్ఞానానికి చిరునామాగా నిలిచిందంటే, దానికి అసలైన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది స్వచ్ఛంద సంపాదకులే. * నిస్వార్థ సేవ: ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, తమ సమయాన్ని కేటాయించి సమాచారాన్ని క్రోడీకరించే వాలంటీర్ల కృషి వల్లే ఈ జ్ఞాన నిధి సాధ్యమైంది.
​సరిహద్దులు లేని సహకారం: భాషలు, దేశాలతో సంబంధం లేకుండా.. ప్రతి వాలంటీర్ చేసే ఒక చిన్న 'సవరణ', చేర్చే ఒక 'మూలం' నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా విజ్ఞానకోశానికి పునాదిగా నిలిచాయి.
​విశ్వసనీయతకు వారధులు: సమాచారాన్ని నిరంతరం సరిచూస్తూ, భావితరాలకు స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందించడంలో వాలంటీర్లే వికీపీడియాకు వెన్నుముక.
​ఒక చిన్న ఆలోచనను ఉద్యమంగా మార్చి, కోట్లాది మందికి నేర్చుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి వికీపీడియా వాలంటీర్‌కు వందనాలు. జ్ఞానం అందరికీ స్వేచ్ఛగా అందాలన్న మీ ఆశయమే వికీపీడియాకు అసలైన బలం.

అంతర్జాలంలో తెలుగు భాషలోని విజ్ఞానాన్ని విస్తరించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న తెలుగు వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞ...
04/01/2026

అంతర్జాలంలో తెలుగు భాషలోని విజ్ఞానాన్ని విస్తరించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న తెలుగు వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం మీకు ఆహ్వానం పలుకుతోంది.
తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, సంస్కృతి తదితర అనేక రంగాలకు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రపంచానికి అందించడంలో భాగస్వాములవ్వాలంటే విజయవాడ పుస్తక ప్రదర్శన లో వికీపీడియా‘స్టాల్ (నెంబర్ 87) ను తప్పక సందర్శించండి.
ఇక్కడ మీరు తెలుగు వికీపీడియా గురించి తెలుసుకోవచ్చు, సభ్యులుగా చేరవచ్చు, వ్యాసాలు ఎలా రాయాలో శిక్షణ పొందవచ్చు. మీకు తెలిసిన విషయాలను ప్రపంచంతో పంచుకొని, తెలుగు భాషకు డిజిటల్ భవిష్యత్తును నిర్మించడంలో మీ వంతు పాత్ర పోషించండి.
మీరూ రాయండి… మీరూ మార్పుకు భాగస్వాములు కండి… తెలుగు విజ్ఞానాన్ని అంతర్జాలంలో వెలిగించండి!

ఈరోజు, డిసెంబర్ 10, 2025, తెలుగు వికీపీడియాకు పూర్తి 22 సంవత్సరాలు నిండిన శుభ సందర్భం!2003 డిసెంబర్ 10న ఒక చిన్న మొలకలా ...
10/12/2025

ఈరోజు, డిసెంబర్ 10, 2025, తెలుగు వికీపీడియాకు పూర్తి 22 సంవత్సరాలు నిండిన శుభ సందర్భం!

2003 డిసెంబర్ 10న ఒక చిన్న మొలకలా మొదలైన మన తెలుగు వికీపీడియా ప్రయాణం, ఈ రోజు 1,17,000+ వ్యాసాలతో మహా వృక్షంగా ఎదిగింది ఇది కేవలం ఒక ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా మాత్రమే కాదు – తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, విజ్ఞానాన్ని ప్రపంచ నలుమూలలకూ ఉచితంగా అందించే మన జాతి డిజిటల్ ఆస్తి. 22 సంవత్సరాల ఈ అద్భుత ప్రగతిలో ప్రతి అక్షరం వెనుక, ప్రతి పేరా వెనుక ఉన్నది మీరు – నిస్వార్థంగా కష్టపడుతున్న, తెలుగుపై అంకితభావంతో ఉన్న వేలాది మంది స్వచ్ఛంద సంపాదకుల శ్రమ, ప్రేమ. మీ నిబద్ధతకు హృదయపూర్వక అభినందనలు & కృతజ్ఞతలు! ఈ విశేషమైన 22వ వార్షికోత్సవం సందర్భంగా, కొత్త సంపాదకులను స్వాగతించేందుకు తెవికీ ప్రాజెక్టుల అభివృద్ధికి ఉపయోగపడే కొత్త వీడియో పాఠాలను ఈ వేడుకలో విడుదల చేయనున్నాము. తెలుగు విజ్ఞానం శాశ్వతంగా నిలిచి ఉండేందుకు, మన తరం తర్వాత కూడా వెలుగుతూ ఉండేందుకు... మీ ఒక్కొక్కరి చిన్న కృషి ఎంతో అవసరం!
Happy 22nd Birthday !

#తెలుగువారివికీపీడియా #వికీపీడియా22

ఇది మన ఆస్తి! గర్వంగా చెప్పుకుందాం, ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదాం!

03/11/2025

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము — తెలుగు #వికీపీడియా ఇంటర్న్‌షిప్ & వాలంటీర్ అవకాశం

తెలుగువారికి నమ్మదగిన డిజిటల్ విజ్ఞానం ఉచితంగా అందించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది అద్భుతమైన అవకాశం!

తెలుగు భాషలో నాణ్యమైన మరియు విశ్వసనీయమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ (TWUG) ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ మరియు వాలంటీర్ ప్రోగ్రామ్‌ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.కార్యక్రమ కాలం: 14 నవంబర్ 2025 – 14 ఫిబ్రవరి 2026
🕖 సెషన్ సమయం: ప్రతి రోజు సాయంత్రం 7:00 – 8:00 గంటల వరకు (Google Meet ద్వారా)

ఈ కార్యక్రమం ద్వారా యువతలో పరిశోధనా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడంతో పాటు, తెలుగు వికీపీడియాలో నాణ్యమైన సమాచారాన్ని విస్తరించడమే మా ప్రధాన లక్ష్యం.
WhatsApp: 9014120442 తెలుగులో విజ్ఞానాన్ని విస్తరించాలనే అభిలాష ఉన్నవారికి — ఇదే సరైన వేదిక!
📌 దరఖాస్తు చివరి తేదీ: 10 నవంబర్ 2025

వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము.
http://te.wikipedia.org/

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when వికీపీడియా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category