18/08/2026
పత్రిక ప్రకటన 18.08.2027
*2016 ఆర్పిడి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి*.
*2016 RPWD చట్టం అమలు,పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి*
*ప్రభుత్వ కార్యాలయల్లో ర్యాంపులు నిర్మించాలి*
*వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి*
*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య*
*జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.. కలెక్టర్కు వినతిపత్రం అందచేత*
*కమిటీ ఏర్పాటు చేయిస్తాం.. కలెక్టర్ హామీ*
2016 ఆర్ పి డి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, చట్టం అమలు,పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
*ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ* 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలులోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది.చట్టం అమలు మరియు పర్యవేక్షణ కోసం 2016 ఆర్పిడి చట్టం సెక్షన్ 60 ప్రకారం వైకల్యంపై కేంద్ర, రాష్ట్ర సలహా బోర్డులు మరియు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. సెక్షన్ 72 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమనికి నిర్దేశించే విధులను నిర్వర్తించడానికి వైకల్యంపై జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నప్పటికీ జిల్లాలో గత 8 సంవత్సరాలనుండి కమిటీని ఏర్పాటు చేయడం లేదు. కమిటీ ఏర్పాటు చేయాలని అనేక పర్యాయలు జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.కానీ జిల్లా అధికారుల వైపు నుండి ఎలాంటి స్పందన లేదు.చట్టం అమలుపై పర్యవేక్షణ చేయాల్సిన జిల్లా సంక్షేమ అధికారి పట్టించుకోకపోవడం వలన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సెక్షన్ 38 ప్రకారం అధిక మద్దతు అవసరం ఉన్న వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించడానికి అవసరమైనా చర్యలు తీసుకోవాలి.జిల్లాలో ఉన్న వికలాంగులకు 2016 ఆర్పిడి చట్టం ప్రకారం సౌకర్యాలు అందడం లేదు.జిల్లాలోని సామూహిక ప్రాంతాలు వికలాంగులు వినియోగించుకునేందుకు అనుకూలంగా లేవు.జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులకు ర్యాంపులు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.చట్టం అమలు, పర్యవేక్షణ పట్ల జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జిల్లాలో ఉన్న ప్రయివేట్ పరిశ్రమల నుండి ప్రభుత్వంకు
వస్తున్న సిఎస్ఆర్ నిధులను వికలాంగులకు సహాయ పరికరాలు మరియు తీవ్ర వైకాల్యం కలిగిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించుకునే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ నుండి గ్రీవెన్స్ హాల్ వరకు ఎలక్ట్రికల్ ఆటో ఏర్పాటు చేయూలని డిమాండ్ చేశారు.జిల్లాలోని ప్రయివేట్, ప్రభుత్వ బ్యాంక్లలో ర్యాంపులు లేవని దీనితో వికలాంగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు.సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.
*కమిటీ ఏర్పాటు చేయిస్తాం:జిల్లా కలెక్టర్ హామీ*
జిల్లా స్థాయిలో వికలాంగుల కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయల్లో ర్యాంపూలు నిర్మించేందుకు కృషి చేస్తామని, కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ నుండి గ్రీవెన్స్ హాల్ వరకు ఎలక్ట్రికల్ ఆటో ఏర్పాటు చెస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సి సాయమ్మ, జిల్లా అధ్యక్షులు బస్వరాజు కార్యదర్శి కె నర్సిములు,జిల్లా ఉపాధ్యక్షులు యం జయలక్ష్మి, రాజు కుమార్, కృపవరం, సహాయ కార్యదర్శులు మచ్చేందర్,సంగమేష్, జిల్లా నాయకులు భాగ్యమ్మ, యదుల్, సత్యనారాయణ నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు