19/04/2016
ఆసక్తి
శ్రీరామ పట్టాభిషేకం ఐన తరువాత శ్రీరాముల వారి కి ఆంజనేయ స్వామి వారే అన్ని సేవలు చేస్తూ సర్వదా స్వామి వెంటే ఉంటూ ఉన్నారు
శ్రీరాముల వారి తమ్ములైన భరత,లక్ష్మణ , శతృజ్ఞులు ఎంతగా ప్రయత్నించిన శ్రీరాముల వారికీ ఎ సేవ కూడా చేయలేక పోతున్నారు అమీ చేద్దామన్న
ముందుగానే మారుతీ అక్కడ ఉంటున్నారు ఇలాకొంత కాలం గడిచింది ఎలా ఐన అన్నగారి సేవ చేయాలనీ బాగా అలోచించి భరత,లక్ష్మణ , శతృజ్ఞులు. ఒక ఉపాయం అలోచించి అన్నగారైన శ్రీ రాముల వారి దగ్గరకు వెళ్లి అగ్రజా ! తమ సేవ చేయు భాగ్యము మా ముగ్గురికి ప్రసాదించవలసింది అని కోరుకున్నారు
ఏది విన్న శ్రీరామ చంద్రుడు మీరు అసేవ చేయాలనుకుంటున్నారో అ సేవను ఆనందం గా చేసుకోండి అని చెప్పారు . ఏది విని ముగ్గురు సంతోషంగా అన్నగారికి చేయాలనుకుంటున్న సేవలను ఒక పట్టికగా రాసుకుని ఎవరెవరు అ సేవ చేస్తారో రాముల వారికి చదివి వినిపించి . రాముల వారి అనుమతిని పొందారు ఇది విన్న ఆంజనేయ స్వామి శ్రీ రాముల వారితో స్వామి అన్ని సేవలు వారు ముగ్గురే పంచుక్కరు కదా "మరి నా గతి ఏమి ? స్వామి అని అడిగారు
ఇంతలో భరత,లక్ష్మణ , శతృజ్ఞులు శ్రీ రామ చంద్రుడు మా ప్రార్ధన మన్నించారు . వారు ఆడిన మాట తప్పారు కావున మేము కోరగా మిగిలిన సేవ ఏదైనా ఉంటె ఆంజనేయుడు చేసుకోన వచును అని భరత,లక్ష్మణ , శతృజ్ఞులు చెప్పారు రాముల వారితో అప్పుడు ఆంజనేయ స్వామి బాగా అలోచించి " సరే మీ షరతును అనుసరించే కోరుకుంటాను అని రాముల వారు "ఆవులించినపుడు " చిటిక వేసే భాగ్యము నాకు ప్రసాదించిన చాలును అని అనగా దానికి భరత,లక్ష్మణ , శతృజ్ఞులు మాకు అభ్యంతరం అమీ లేదు అని ఆ సేవ ఆంజనేయుడు చేసుకోన వచ్చు అని పలికిరి . ఈ విదముగా తీర్మానము ఐనది
శ్రీ రాముడు స్నానానికై లేవగా అ సేవ తన వంతైనా లక్ష్మణుడు బయలుదేరాడు ఇంతలో హనుమతుడు నీవేక్కడికి ఈ సేవ నావంతు అని అన్నారు ఆశ్చర్యంగా చుసుతున్న లక్ష్మణుడితో ఆంజనేయుడు అయ్యా స్నానము చేయునపుడో, దుస్తులు దరిన్చునపుడో,అలంకరించు సమయములోనో ,భోజన కాలములోనో ,శయనించు సందర్భాములోనో ఎప్పుడుడైన
" నా స్వామికి ఆవులింత రావచును అప్పుడు తక్షణమే చిటిక వేయుటకు నేను సిద్దముగా ఉండవలెను కదా ?" అందుచే మీ సేవ మీరు చేసుకునుడు నా సేవకు అడ్డువచ్చుట ధర్మమా ? అని అనెను ఇది విన్న భరత,లక్ష్మణ , శతృజ్ఞులు మారుతి యొక్క యుక్తికి , అద్వితీయ సేవాసక్తికి ,రామ భక్తికి మేచుకున్నారు
నీతి : ఆసక్తి ఉంటె అన్ని సాధ్యమే