ITDP Telangana

ITDP Telangana iTDP Telangana

తెలంగాణలో "మిస్టర్ తెలంగాణ" బాడీ బిల్డింగ్ పోటీలు – యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు టీడీపీ చొరవ -టీడీపీ పొలిట్ ...
27/08/2026

తెలంగాణలో "మిస్టర్ తెలంగాణ" బాడీ బిల్డింగ్ పోటీలు – యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు టీడీపీ చొరవ -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్: సెప్టెంబర్ 6న తెలంగాణ సిటీ పార్టీ కార్యాలయంలో "శ్రీ ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ జూనియర్స్ అండ్ ఓపెన్ - మిస్టర్ తెలంగాణ 2026" పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 2026 తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు మెన్స్ ఫిజిక్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ పేరిట బహుమతులు, నగదు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అరవింద్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డీజీపీని కలిసిన సందర్భంగా, పాఠశాల విద్యార్థుల వరకు కూడా చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మత్తు పదార్థాలు అమ్ముతున్నారని పోలీసు అధికారులు తమకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై సమగ్ర నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని టీడీపీ డిమాండ్ చేసినట్లు, ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమై మత్తు పదార్థాలు లభించిన పాఠశాలల లైసెన్స్‌లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు.
యువతను సరైన మార్గంలో నడిపించేందుకే బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంటనగరాల్లో యువత పెడదారి పట్టకుండా, వారి దృష్టిని ఫిజిక్ మరియు దేహదారుఢ్యంపై కేంద్రీకరించే ఉద్దేశంతో ఈ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ వివరించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి యువతే పార్టీని ముందుండి నడిపించిందని, పార్టీకి యువతతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు.
గత టీడీపీ పాలనలో స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు, గచ్చిబౌలిలో 167 ఎకరాల్లో బాలయోగి స్టేడియం స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.160 కోట్లతో 7 స్టేడియంలు నిర్మించడంతోపాటు, ఫతే మైదాన్ అథ్లెటిక్ స్టేడియం అభివృద్ధికి రూ.15 కోట్లతో రెండు మినీ స్టేడియంలు, 13 క్రీడా మైదానాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బాలయోగి స్టేడియం, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం వంటివి టిడిపి హయాంలోనే నిర్మించామని, నేడు జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లన్నీ ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే 2002-03లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌ను బాలయోగి స్టేడియం వేదికగా విజయవంతంగా నిర్వహించి, హైదరాబాద్‌కు విశ్వనగర ఖ్యాతిని తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. హైటెక్ సిటీ, ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థల ద్వారా విద్య, ఉద్యోగావకాశాల పరంగా యువతకు టీడీపీ ప్రభుత్వం ఎనలేని అవకాశాలు అందించిందని వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నగర పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, భవాని శ్రీనివాస్, వైఎల్.నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో  పోలిట్ బ్యురో స‌భ్యులు బ‌క్క‌ని న‌ర్సింహులు గారి  అద్వ‌ర్యంలో  నాయ‌కుల స‌మావేశం జ‌రి...
26/08/2026

ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో పోలిట్ బ్యురో స‌భ్యులు బ‌క్క‌ని న‌ర్సింహులు గారి అద్వ‌ర్యంలో నాయ‌కుల స‌మావేశం జ‌రిగింది ఈ స‌మావేశంలో సెప్టెంబ‌ర్‌ 5 న రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించ‌నున్న‌ స‌ర్వెప‌ల్లి రాధాక్రిష్ణ‌న్ జ‌యంతి ( టిచ‌ర్స్ డే) కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణపై చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కేంద్ర అదికార ప్రతినిది న‌న్నూరి న‌ర్సిరెడ్డి, మాజీ రాష్ట్ర ఉపాద్య‌క్షులు సామా భుపాల్ రెడ్డి, టి.జి.కే ముర్తి, మాజీ రాష్ట్ర ప్ర‌దాన కార్య‌ద‌ర్శి అజ్మీరా రాజునాయ‌క్‌, మాజీ రాష్ట్ర అదికార ప్ర‌తినిది నెల్లురు దుర్గాప్ర‌సాద్‌, మాజీ బిసి సెల్ అధ్య‌క్షులు శ్రిప‌తి స‌తీష్‌, ఏస్సీ సెల్ మాజీ అధ్య‌క్షులు పొలంప‌ల్లి అశోక్‌, మాజీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి ముత్తినేని సైదేశ్వ‌ర్ రావు తెలుగునాడు ఉపాద్యాయ సంఘం నాయ‌కులు యం వి.పి రమేష్ బాబు , ముంజా వెంక‌ట్రాజం, నెట్టేం నాగేంద్ర చౌద‌రి, కే.వి రాజా రావు, ఎస్సీ సెల్ మాజీ రాష్ట్ర ప్ర‌దాన కార్య‌ద‌ర్శి గుడేపు రాఘవులు, కె.డి దినేష్ లు పాల్గోన్నారు.

25/08/2026

“International Athlete” అంటే కనీసం ఆ పదానికి అర్థం కూడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటుంది.

ఒక క్రీడాకారుడు తన ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలుస్తాడు. అంతర్జాతీయ వేదికపై దేశం పేరు, ఖ్యాతిని ప్రపంచానికి చాటే క్రీడాకారుల పట్ల బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం.

క్రీడాకారులను గౌరవించడం అంటే దేశ గౌరవాన్ని గౌరవించడమే.
వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా, దేశం కోసం కష్టపడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శేర్లింగంపల్లి డివిజన్లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సంబరాలు
24/08/2026

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శేర్లింగంపల్లి డివిజన్లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సంబరాలు

24/08/2026

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శేర్లింగంపల్లి డివిజన్లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సంబరాలు

ఉప్పల్  శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల సందర్భంగా ఆ దేవి దర్శనం చేసుకొన్న బజారు హేమంత్ గౌడ్ మరియు తెలంగాణ తెలుగు దేశం ప...
17/08/2026

ఉప్పల్ శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల సందర్భంగా ఆ దేవి దర్శనం చేసుకొన్న బజారు హేమంత్ గౌడ్ మరియు తెలంగాణ తెలుగు దేశం పార్టీ, తెలుగు యువత నాయకులు.

ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి  కార్యక్రమాన్ని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఘనం...
16/08/2026

ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి కార్యక్రమాన్ని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సురగోని గజేంద్రగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... మహారాజశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బహుజన బిడ్డలందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు. తన కుల వృత్తిని చేసుకుంటూనే రాజ్యాధికారం గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి పాపన్నగౌడ్ అని అన్నారు. ఇది బహుజనులకు మార్గదర్శకమని అన్నారు. పాపన్నగౌడ్‌కు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధముందని అన్నారు. పాపన్నగౌడ్ ఆలోచన అయిన సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని అన్నారు. పాపన్నగౌడ్ తెలంగాణలో పుట్టాడు... తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే పుట్టింది. పటేల్`పట్వారీ వ్యవస్థ వల్ల, దొరల వల్ల తెలంగాణ ప్రాంతంలో బహుజనులు ఏవిధంగా ఇబ్బంది పడ్డారో మన పెద్దలు మనకు చెప్పేవారు. బహుజనులకు ఇబ్బంది పెట్టిన పటేల్`పట్వారీ వ్యవస్థను ఎన్‌టిఆర్ రద్దు చేసి నిజమైన స్వాతంత్య్రాన్ని ఇచ్చారని అన్నారు. పాపన్నగౌడ్ గోల్కొండను 7 నెలలు పాలించడం చిన్న విషయం కాదు. ఒక సామాన్యుడు బలవంతుడిగా మారిన పరిస్థితి. ఉద్యమ సమయంలో ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక తానే ముఖ్యమంత్రి అయ్యారు. మిగులు బడ్జెటఉన్న రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టారు. ఈ అప్పు మన బహుజనులపైనే పడుతుందని అందరూ గమనించాలి. బీదలందరూ రాజ్యాధికారం వైపు నడవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల కొత్తగా పార్టీ పెట్టినామె కూడా నేను ముఖ్యమంత్రినై మీకు మంచిచేస్తానని చెబుతున్నది. మన బహుజనులకు మేలు చేసిన ఎన్‌టిఆర్ విగ్రహాలను మాత్రం పార్శిల్ చేసి పంపిస్తానని అంటున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? మళ్లీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది అందరూ గమనించాల్సిన అవసరముంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో తెలంగాణ బిడ్డలే ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల వారే ముందుంటారని అన్నారు. ప్రతి బహుజనుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. భవిష్యత్‌లో అందరం కలిసి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసుకుందామని అన్నారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటేనే బడుగులకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. యువతలో చైతన్యం తీసుకురావాలి. భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా మనం సత్తా చాటాల్సిన అవసరముంది. కల్లుగీత వృత్తిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల కల్లుగీత కార్మికులకు పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాల్సిన అవసరముంది. కల్లుగీత కార్మికులకు బకాయి ఉన్న రూ.20 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు కొయ్యాడ స్వామి గౌడ్ మాట్లాడుతూ... పాపన్న గౌడ్ జయంతిని ఇతర ఏ పార్టీ చేయని రోజు అధికారికంగా 13 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్ భవన్‌లో జరపడం జరిగింది. ఎన్‌టిఆర్ భవన్‌లో పాపన్నగౌడ్ జయంతిని జరపడం ప్రారంభించిన తరువాతనే ఇతర పార్టీల వారు ఒక్కొక్కరుగా పాపన్నగౌడ్ జయంతిని చేయడం ప్రారంభించారు. ఆనాటి పాలకుల దౌర్జన్యాలపై పోరాటం చేయడానికి సబ్బండ వర్గాలను పోగు చేసి విజయాలను సాధిస్తూ గోల్కొండ కోటను పాపన్నగౌడ్ ఆక్రమించారు. సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర లండన్‌లోని కేంబ్రిడ్జ్ యÖనివర్సిటీలో లభించడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించాలంటే బీసీలు ఎదగాల్సిన అవసరముంది. కల్లుగీత కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.20 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో 560 జీఓను తీసుకురావడం జరిగింది. ఈ జీఓను పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరముంది.
తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సురగోని గజేంద్ర గౌడ్ మాట్లాడుతూ... బహుజనులకు అన్యాయం చేస్తున్న మొగలాయిలపై పోరాటం చేయడానికి పాపన్నగౌడ్ మొదట అన్ని కులాల నుంచి 12 మందిని సైన్యంగా తయారు చేసుకుని వీరిని 12 వేల మందికి పెంచుకుని 32 కోటలకు తన రాజ్యాన్ని విస్తరింపజేశారు. సోషల్ పాఠ్యపుస్తకంలో పాపన్నగౌడ్ గురించి వివరించారు. గౌడ్‌ల పోరాటాల వల్ల పాపన్నగౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌడ్‌లను ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడ లేదు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. మీరు ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలి. అలాగే సొసైటీలను పునరుద్దరించాలి. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా మనమందరం కృషి చేద్దాం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజునాయక్ , జివిజి నాయుడు, ముంజా వెంకట్రాజం గౌడ్, వల్లారపు శ్రీనివాస్, బాలరాజ్‌గౌడ్, నక్కా కృష్ణగౌడ్, మండవ వెంకటేష్‌గౌడ్, లోకేష్ గౌడ్, మహేష్ యాదవ్, రాంబాబు, జగదీష్‌గౌడ్, లచ్చగౌడ్, మారగోని అశోక్‌గౌడ్, శ్రీమతి సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
-తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు**జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టిడిపి మల్కాజ...
15/08/2026

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ నాయకులు వసునూరి సన్నీ గారు*

*జాతీయ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావడం మన తెలుగు జాతికి గౌరవం వారికి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి - సన్నీ*

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నాయకులు వాసు సన్నీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సన్నీ గారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర భారతమని, వారి ఆశయాలు కనుగుణంగా భారతదేశాన్ని మరింత ముందు తీసుకపోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే జాతీయ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారు మన తెలుగు వాడు కావడం మనకు ఎంతో గర్వకారణం అని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ వేడుకలు టిడిపి నాయకులు బద్దుల గాలయ్య, ఆశీర్వాదం గారు, శ్రీకాంత్ గారు, రామోల శ్రవణ్ గారు, అరుణ్, నాగరాజ్, మిశ్రా, శ్రీనివాస్ మరియు ఇద్దరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ద్వారకాపురం Dilsukhnagar & లక్ష్మీనగర్ కొత్తపేట్ కాలనీ ప్రతినిధులు లతో కలసి వందేమ...
15/08/2026

ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ద్వారకాపురం Dilsukhnagar & లక్ష్మీనగర్ కొత్తపేట్ కాలనీ ప్రతినిధులు లతో కలసి వందేమాతరం గీతపాలన చేసి మన జాతీయజెండ ఆవిష్కరణ కార్యక్రమం.

*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాస్ రెడ్డి*80వ స్వాతంత్ర్య దినోత్సవ...
15/08/2026

*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాస్ రెడ్డి*

80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ కరీంనగర్ తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ కన్వీనర్ శ్రీ వంచ శ్రీనివాస్ రెడ్డి గారుపార్లమెంట్ నియోజక వర్గ కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేసి "స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులకు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ "దేశభక్తి, జాతీయ సమైఖ్యత, దేశం పై మమకారాన్ని చాటుతూ, ప్రతి ఒక్కరు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశ భక్తిని ,చాటుతూ నూతన ఉత్సహంతో ఈ వేడుకల్లో పాల్గొని స్వాతంత్య్రం సాధించుటకు మహనీయులు చేసిన త్యాగలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాద్యత మనందరిపైన ఉందని వంచ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో అడ్ హాక్ కమిటీ మెంబెర్ రొడ్డ శ్రీనివాస్, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి దామెర సత్యం,మాజీ జెనరల్ సెక్రటరీ నాగుల బాలగౌడ్,మాజీ ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశం,బీసీ సేల్ మాజీ కార్యదర్శి ఇట్టామల్లేశం,వాణిజ్య సేల్ మాజీ కార్య దర్శి ఎల్లిమిళ్ల కిషన్,రాష్ట్ర కార్యదర్శి ఐటీడీపి ఎర్రవెల్లి రవీందర్, తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రవెల్లి వినీత్, నగర మాజీ అధ్యక్షులు రొడ్డ శ్రీధర్,పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి లొంక భాస్కర్ శర్మ,దాసరి రామకృష్ణ రెడ్డి, కళ్యాడప్ నరేష్, ఆకుల కాంతయ్య, నూనె రజిత,వడ్కాపురం లక్ష్మిరాజ్యం, ఎన్నం రమేష్,పెరుమాండ్ల సతీష్ గౌడ్, బి. రాజేశం తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేసారు.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Address

NTR TRUST BHAVAN, BANJARAHILLS
Hyderabad
500096

Telephone

04030699999

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share