01/06/2026
నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో రాజు మండల్‌ను పరామర్శించిన ఆర్ఎస్పీ సర్.
ఈస్‌గాం మండల్, బెంగాలీ క్యాంప్ పరిధిలోని రానగర్ (విలేజ్ నెంబర్ 12) కు చెందిన రాజు మండల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్పి సార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రాజు మండల్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సేవల గురించి సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రాజు మండల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి, ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.