Telangana Mudiraj MahaSabha Employees Wing-TMMSEW

Telangana Mudiraj MahaSabha Employees Wing-TMMSEW Affiliate to TELANGANA MUDIRAJ MAHASABHA (Reg No 443/2014), TELANGANA STATE.

ముదిరాజ్ సంఘాల ఐక్యతకు.. తొలిమెట్టు... విజయం ముదిరాజ్ సంఘాల సమన్వయంతోనే సాధన "పండుగ సాయన్న"  జయంతి, వర్ధంతి ఉత్సవాలకు అధ...
19/08/2026

ముదిరాజ్ సంఘాల ఐక్యతకు.. తొలిమెట్టు... విజయం

ముదిరాజ్ సంఘాల సమన్వయంతోనే సాధన "పండుగ సాయన్న" జయంతి, వర్ధంతి ఉత్సవాలకు అధికారిక గుర్తింపు

తెలంగాణలో వెనుకబడిన వర్గాల్లో గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ సమాజం ఐక్యతకు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఒక చారిత్రాత్మక తొలి మెట్టు అని చెప్పవచ్చు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ముదిరాజ్ సమాజానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా, పాలమూరు పోరాట యోధుడు, తెలంగాణ రాబిన్‌ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ద్వారా జీవో విడుదల కావడం ముదిరాజ్ సమాజానికి గర్వకారణం

ఈ విజయం ఒక్కరి కృషి ఫలితం కాదు పార్టీలకు, సంఘాలకు అతీతంగా ముదిరాజ్ నాయకత్వాలు, సంఘాలను సమన్వయంతో ముందుకు రావడం వల్ల సాధ్యమైన సమిష్టి విజయం.

ముదిరాజ్ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ముదిరాజ్ సమన్వయ కమిటీ నిరంతరం కృషి చేసింది. రాష్ట్రంలో విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం నుంచి పండుగ సాయన్న చరిత్రను వెలుగులోకి తీసుకురావడం వరకు అనేక కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లింది.

ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శ్రీ నీలం మధు ముదిరాజ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, యంపి శ్రీ ఈటెల రాజేందర్ ముదిరాజ్, శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తదితర నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి అభిప్రాయాలను సమీకరించడం ద్వారా సమన్వయ కమిటీ ముందుకు సాగింది.

అదేవిధంగా ముదిరాజ్ అధ్యయన వేదిక, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ, తెలంగాణ ముదిరాజ్ మహాజన సభతో పాటు అనేక ముదిరాజ్ సంఘాలు పండుగ సాయన్న చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా పనిచేశాయి.

*174 సంవత్సరాలుగా చరిత్రలో మరుగునపడిన ప్రజావీరుడు పండుగ సాయన్న చరిత్రకు అధికారిక గుర్తింపు లభించడం ఒక గొప్ప చారిత్రాత్మక పరిణామం. పేదలు, అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడిగా పండుగ సాయన్నకు ప్రభుత్వం అధికారికంగా గౌరవం కల్పించడం ముదిరాజ్ సమాజానికి గర్వకారణం.

ఈ సందర్భంగా పండుగ సాయన్న జయంతి అక్టోబర్ 22న, వర్ధంతి డిసెంబర్ 10న అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ *ఎనుముల రేవంత్ రెడ్డి* గారికి, ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన యువజన, క్రీడలు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారికి, శాఖాపరమైన చర్యలు తీసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

అలాగే ఈ కార్యక్రమానికి నిరంతరం సహకరించిన శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ *బండా ప్రకాష్ ముదిరాజ్ గారు*, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ *ఈటెల రాజేందర్ ముదిరాజ్* గారు, శ్రీ నీలం మధు ముదిరాజ్ గారు, శ్రీ కాసాని వీరేశ్ ముదిరాజ్ గారు, ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, మరియు యావత్ ముదిరాజ్ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించే స్థాయికి చేరుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. ఇది ముగింపు కాదు… మరో పెద్ద లక్ష్యానికి తొలి అడుగు. ముందు కూడా ఇదే సమన్వయం, ఇదే ఐక్యత, ఇదే పట్టుదలతో ముదిరాజ్ యువత, విద్యార్థులు ఎదురుచూస్తున్న బీసీ-A సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి.
పార్టీలకతీతంగా… సంఘాలకతీతంగా ముదిరాజ్‌లందరూ ఒక్కతాటిపైకి రావాలి. ఐక్యతతో సాధించలేనిది ఏదీ లేదు. మరోసారి ఈ చారిత్రాత్మక విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా తెలంగాణ ముదిరాజ్ మహాసభ - ఉద్యోగుల సంఘం ప్రక్షాణ హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలియజేస్తున్నాము.
జై ముదిరాజ్! జై జై ముదిరాజ్ !!
Anumula Revanth Reddy
Telangana CMO
Vakiti Srihari Ponnam Prabhakar
Banda Prakash

Choppari Shankar Mudiraj
Dr-Gundlapally Sreenu Mudiraj

The Great Job Yama Raju Garu!!
30/05/2026

The Great Job Yama Raju Garu!!

మీకు తెలుసా❓

27/05/2026

తెలంగాణ ప్రభుత్వ SEEEPC సర్వే నివేదిక ప్రకారం
రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ జనాభా 7.4%
రాష్ట్ర బీసీ కులాల జనాభాలో ముదిరాజ్ జనాభా 13.5%

సహ మత్స్యకార వృత్తిలో ఉన్న గంగపుత్రులు మరియు దళితుల కంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి సూచికలో వెనుకబాటుతనంలో ఉన్న ముదిరాజులు.

గంగపుత్రులు 92 మాలలు 88 సూచికలలో ఉండగా ముదిరాజులు 94 సూచిక స్థానంతో పైకి ఎగబాకి దీనస్థితిలో ఉన్నారు.
Note: సూచిక సంఖ్య పెరిగిన కొద్దీ వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది.
Source: తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సర్వే రిపోర్ట్ & Pittala Ravinder రచన: ముదిరాజ్ ముఖచిత్రం (అంకెలు దాచిన అక్షర సత్యాలు)

25 శాతం రిబేట్ తో LRS కు మరొక అవకాశం!!Amendment to Telangana Regularization of Unapproved and illegal layout Rules - 202...
01/05/2026

25 శాతం రిబేట్ తో LRS కు మరొక అవకాశం!!
Amendment to Telangana Regularization of Unapproved and illegal layout Rules - 2020 - Availment for payment of LRS fee and charges with a rebate of 25% w.e.f. 01.05.2026 to 31.07.2026 - Orders Issued.

రేపు మధ్యాహ్నం SSC ఫలితాలు....!! SSC public examinations, Results will be released on 29th April at 2-00 pm.
28/04/2026

రేపు మధ్యాహ్నం SSC ఫలితాలు....!!
SSC public examinations, Results will be released on 29th April at 2-00 pm.

Address

TMMS State Office
Hyderabad

Telephone

+919492726732

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Mudiraj MahaSabha Employees Wing-TMMSEW posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share