Torch bearer - Dr B.R Ambedkar

Torch bearer - Dr B.R Ambedkar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Torch bearer - Dr B.R Ambedkar, Social service, Hyderabad.

11/07/2026

“తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారులు,కవులు, రచయితలకు స్వాగతం”
రండి..బహుజన తెలంగాణ నిర్మాణానికి శంఖం పూరిద్దాం.!

మీ..
ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ.





బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
30/06/2026

బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.



Join BSFIBahujan Students Federation Of India
25/06/2026

Join BSFI
Bahujan Students Federation Of India

06/06/2026

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న SC,ST అట్రాసిటీ కేసులపై విచారణ వేగవంతం చేయాలి, చార్జిషీట్ వేయాలి, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర DGP స్పందించాలి.

Bahujana Dandora by Dr. Panthukala Srinivas

Demands:
1). Order a fair, impartial, and time-bound reinvestigation of FIR No. 455/2023.

2) Direct the filing of an Additional Charge sheet based on the documentary, audio, and video evidence already submitted.

3) Initiate departmental action against officers responsible for negligence, delay, and non-compliance with court directions.

4) Ensure strict implementation of the SC/ST (Prevention of Atrocities) Act in Telangana State.

5) Recommend constitution of a High-Power Committee under the chairmanship of Hon’ble Chief Minister Shri A. Revanth Reddy to review investigation standards in SC/ST atrocity cases.

Respected DGP Sir, Nation wants to know about the further investigations of SC, ST Atrocity (PoA) Act case Crime No. 455/2023, dated 04.10.2023, SC No. 118/2024, Sections: 3(1)(u)(r) of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act, 2015 (as amended), Sections 504 and 506 of the IPC and Show the Power of the Constitution. Justice delayed is justice denied, and justice destroyed in atrocity cases becomes social injustice institutionalized in our society.

హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో  హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజూ ఐదు రూపాయల బువ్వే తినేది.. విద్యార్థి ఉద్యమ నిర్మాణం...
07/04/2026

హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు ప్రతి రోజూ ఐదు రూపాయల బువ్వే తినేది..
విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం డిగ్రీ చదివే రోజుల్లో కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తూ పోతూ ఉండేవాడిని,
కట్టెలమండి (టీవీ టవర్స్)హాస్టల్ లో విద్యార్థులను కలిసి దిల్షుక్ నగర్ కి నడుచుకుంటూ వచ్చి, bus స్టాండ్ ఆపోజిట్ సైడ్ ఉన్న ఈ GHMC ఐదు రూపాయల భోజనం చేసి మళ్ళీ కాచిగూడ హాస్టల్ వరకు ఎన్నో సార్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని.,
కాచిగూడలో టీమ్ మొదలయ్యే వరకు మరుసటి రోజు ఎవ్వరినైనా కలిసే అవకాశం ఉంటే ఇక రాత్రి అంత JBS బస్ స్టేషన్ లో ఉండి, మళ్ళీ మనోళ్లని కలవడానికి వచ్చేవాడిని.

ఒకే రోజు కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వచ్చి మళ్లీ కరీంనగర్ వెళ్లడం అయితే ప్రయాణమంతా ఉదయం 5 గంటలకు మొదలై మళ్ళీ 5 గంటలకు ముగిసేది,.
కొన్ని నెలలు రామ్ నగర్ లో 1000 రూపాయల సెట్టర్ రూమ్ లో ఉండేవాళ్ళం, తరువాత గోదాం గడ్డ వెంకటేశ్వర కాలనీ లో ఉన్నం (వామ్మో ఆ గల్లీలో కుక్కలు ఉండేటివి మబ్బుల నాలుగు గంటలకు నడుచుకుంటూ బస్టాండ్ కి రావడం అన్న బస్టాండ్ నుండి రూముకు వెళ్లడం అన్న బిక్కుబిక్కుమంటూ వెళ్తుండేటోడిని 😀😀).

(ఈ నడిచే కాన్సెప్ట్ ఏంటంటే ఆటోలో పోతే పైసలు సరిపోవు అని 😎)

కాస్త టీం ఏర్పడటం వల్ల కాచిగూడ హాస్టల్ లో టీమ్ తో ఉండే అవకాశం ఉండే..

చాలా సార్లు హబిట్స్ BC హాస్టల్ కి, కోటి హాస్టల్ కి ఉస్మానియా యూనివర్సిటీకి కాచిగూడ నుండి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం..
ఇక సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి అయితే లెక్కే లేదు.
అన్నిసార్లు కేవలం మధ్యాహ్నం ఒకపూట మాత్రమే తినేవాడిని.. అది కూడా జిహెచ్ఎంసి ఐదు రూపాయల భోజనం.. ఎవరైనా పెద్ద మనుషులు ఫుడ్ ఆఫర్ చేస్తే మొహమాటపడుతూ చాలాసార్లు తినకుండా ఉండేటోళ్లం (ఇప్పుడు మాత్రం కాదనుకోండి)
ఇలా 2019 నవంబర్ వరకు కొనసాగింది..

నవంబర్లో అనుకుంటా ఒక అన్న (అన్న పేరు ఇంకా ఎప్పుడైనా చెప్తా) తన ఆఫీసుని వాడుకోమని దాదాపు రెండు సంవత్సరాలకు పైగా రెంట్ కడుతూ మా టీం కి మెయింటెనెన్స్ చూస్తూ ఒక టు బిహెచ్కె ఫ్లాట్ ఇచ్చి రెంట్ కట్టారు ...

అలా ఆఫీస్ వచ్చిన తర్వాత 2020 జనవరి 6న సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని BSFI మొదటి జాతీయ కన్వెన్షన్ వందలాదిమంది విద్యార్థులతో జరిగింది..
(ఇంకా ఉంది)

ఐదు రూపాయల బువ్వ తింటున్నంతసేపు ఇదంతా గుర్తు చేసుకుంటూ ఒక విద్యార్థి నాయకులతో కలిసి తిన్న భోజనం ఇది.
Karunakar Bahujan
National Co-ordinator

https://youtu.be/0nV71vulNRc?si=N4eDwqfef_KzA1Cz29 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన  తెలంగాణలో బహుజన రాజ్యం అనే సెమినార్ ల...
03/02/2026

https://youtu.be/0nV71vulNRc?si=N4eDwqfef_KzA1Cz
29 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన తెలంగాణలో బహుజన రాజ్యం అనే సెమినార్ లో కరుణాకర్ బహుజన్

అంబేద్కర్ కు ఎవరంటే ఇష్టం? BSFI Karunakar Bahujan about Babasaheb Ambedkar | BSP |G8 News

తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం విద్యార్థులతోనే సాధ్యం.ప్రత్యేక తెలంగాణ ను విద్యార్థులు ఎట్లా కొట్లాడి సాధించుకున్నరో, అ...
22/01/2026

తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం విద్యార్థులతోనే సాధ్యం.

ప్రత్యేక తెలంగాణ ను విద్యార్థులు ఎట్లా కొట్లాడి సాధించుకున్నరో, అట్లనే బహుజన రాజ్యాన్ని తెలంగాణ లో సాధ్యం చేసుకుంటారు..
ఎట్లా బహుజన రాజ్యం తెచ్చుకుందామో , ఎట్లా పోరాటం చేద్దామో, బహెన్ కుమారి మాయావతి గారి 70వ జన్మదిన సందర్భంగా కలిసి మాట్లాడుకుందాం రండి...

హలో బహుజన
ఛలో ఉస్మానియా యూనివర్సిటీ
29/01/2026
మధ్యాహ్నం 12.00 గంటల నుంచి..

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when Torch bearer - Dr B.R Ambedkar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category