MRPS4India

MRPS4India founded on July 7, 1994, under the visionary leadership of Padma Shri Manda Krishna Madiga Garu.

Committed to the cause of social justice and reservation categorization.🏴l✊

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు వర్ల రామయ్య గారిని అభినందించిన పద్మశ్రీ మంద కృష్ణ మాది...
19/08/2026

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు వర్ల రామయ్య గారిని అభినందించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు వర్ల రామయ్య గారి నివాసంలో ఆయనను కలసి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలిలో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన ఆయనను మొదటగా మందకృష్ణ మాదిగ గారు కలిసి అభినందించారు.

ప్రజా సమస్యలపై మండలిలో పేదవారి పక్షాన మీ గొంతు వినిపించాలని ఆకాంక్షించారు.

ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలపై కొంతసేపు చర్చించుకున్నారు.

నాకు అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలో అండగా నిలిచి మాదిగ జాతి పక్షాన బలమైన గొంతు వినిపించినందుకు వర్ల రామయ్య గారు మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి - ( MRPS )

17/08/2026

🫂...

వర్గీకరణ కోసం జైలుకు వెళ్లిన నిజమైన సామాజిక న్యాయ వాది సాదం వెంకట్ యాదవ్ గారి పాడే మోసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు.....
15/08/2026

వర్గీకరణ కోసం జైలుకు వెళ్లిన నిజమైన సామాజిక న్యాయ వాది సాదం వెంకట్ యాదవ్ గారి పాడే మోసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు...

జర్నలిస్ట్ వెంకటేశ్ గా నాలుగు, ఐదు దశాబ్దాల పాటు తెలుగు సమాజానికి పరిచయమున్న సాధం వెంకట్ యాదవ్ గారు పూలే, అంబేడ్కర్ , జగ్జీవన్ రామ్ మార్గంలో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు.

జర్నలిజంలోను అలాగే వ్యక్తిగత జీవితంలోను సైద్ధాంతిక నిబద్ధతను ఏనాడు కోల్పోలేని వ్యక్తి సాధం వెంకట్ యాదవ్ గారు.

బీసీల ఉద్యమంలోనూ అలాగే MRPS ఉద్యమంలోనూ అలాగే దళిత ఉద్యమాలలోనూ, గిరిజన, ఆదివాసి ఉద్యమాలలో ఇంకా సామాజిక న్యాయం జ కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో వెంకట్ యాదవ్ గారు అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించి తన అంకితభావాన్ని అణగారిన వర్గాల సమాజం పట్ల చాటుకున్నాడు.

ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాల కాలంలో సాదం వెంకట్ యాదవ్ గారు భాగస్వామ్యం లేని అణగారిన వర్గాల ఉద్యమం అంటూ లేదు.

జర్నలిస్టుగా, మేధావిగా, విశ్లేషకుడిగా , రచయితగా ఉద్యమకారుడిగా, వివిధ పాత్రలు పోషిస్తూ అన్ని సామాజిక ఉద్యమాల్లో కీలక భాగస్వాములైన చరిత్ర వెంకట యాదవ్ గారికి ఉంది.

ముఖ్యంగా తన భాగస్వామ్యం, తన పాత్ర మాటలకు సంఘీభావాన్ని మాత్రమే పరిమితం కాలేదు.అందుకు నిదర్శనమే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారిని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తున్న సందర్భంలో అరెస్టును నిరసిస్తున్న క్రమంలో సాధం వెంకట్ యాదవ్ గారు కూడా అరెస్ట్ చేయబడి మందకృష్ణ మాదిగ గారితో పాటు దాదాపు 20 రోజులకు పైగా చంచల్ గూడ జైల్లో జైలు శిక్ష అనుభవించాడు.ఇది సాధం వెంకట్ యాదవ్ గారికి మాదిగల మీద దళితుల మీద సమస్త బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల మీద ఉన్న నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం.

ఓవైపు ఆర్ కృష్ణయ్య గారు , జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరొకవైపు మందకృష్ణ మాదిగ గారు , బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, ఇలా అన్ని సామాజిక ఉద్యమాల అధినేతలతో అత్యంత ఆత్మీయ అనుబంధం కలిగిన ఒకే ఒక వ్యక్తి సాధం వెంకట్ యాదవ్ గారు. సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నేతలందరూ ఏకమై అణగారిన వర్గాల ప్రజలందరి కోసం రాజకీయ పోరాటాన్ని ప్రారంభించాలని ఆశించాడు.అందుకోసం ఎంతో శ్రమించారు.

సాదం వెంకట్ యాదవ్ గారు జీవితకాలం నిరాడంబరుడిగా జీవించాడు.

ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలై దాదాపు నెల రోజులుగా నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ చివరికి నేడు మరణించడం జరిగింది.

వారి మరణం ఎంత బాధాకరం.

సాదం వెంకట్ యాదవ్ గారి మృతి అనగారిన వర్గాల సమాజానికి తీరని లోటు.

సాదం వెంకట్ యాదవ్ గారికి సామాజిక ఉద్యమ జోహార్లు కన్నీటి నివాళులు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

సాదం వెంకట్ యాదవ్ గారి మరణించిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి మందకృష్ణ మాదిగ గారు పూలమాలవేసి నివాళులర్పించారు సాధం వెంకట్ యాదవ్ గారి పాడే మోసి అంతక్రియల్లో పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారితో పాటు ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

ఈరోజు ఒంగోలులో జరుగుతున్న మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు.ప...
09/08/2026

ఈరోజు ఒంగోలులో జరుగుతున్న మాదిగ ఉద్యోగుల జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు.

పెద్దాయనకు గజమాల వేసి సభకు ఆహ్వానించి, MEF ర్యాలీ నిర్వహణ మరియు సభ నిర్వహణ కార్యక్రమాలు జరిగాయి.

సభకు డ్రెస్ కోడ్ లేకుండా అటెండ్ అయిన MEF నేతలను మీటింగ్ హాల్ బయటకు పంపడం జరిగింది.

సభలోకి మాదిగ ఉద్యోగులు తప్ప, మిగతా ఎవరినీ లోపలికి అనుమతించలేదు.

సభలో మాదిగల ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు సభ లేచి నిలబడి నివాళి అర్పించడం జరిగింది.

ఎస్సీ వర్గీకరణ అమలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు మరియు ఇతర భవిష్యత్ కార్యచరణ గురించి మాట్లాడటం జరిగింది.

సభకు మాజీ జాతీయ అధ్యక్షులు, మాదిగ మేధావుల ఫోరం జాతీయ అధ్యక్షులు ఆచార్య చిలుమూరి శ్రీనివాస రావు గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ గారు పాల్గొని మాట్లాడారు. MEF ఏపీ ఇన్ ఛార్జ్ దేవరపల్లి బిక్షాలు, తెలంగాణ ఇన్ ఛార్జ్ మంద దేవేంద్ర ప్రసాద్ గారు, జాతీయ రాష్ట్ర జిల్లా నియోజక వర్గ స్థాయి నేతలు పాల్గొన్నారు.

- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS)

07/08/2026

ఆరోగ్యశ్రీ పథకం రావడానికి మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగిన పోరాటం..

పోరాటం ద్వారా వచ్చిన ఫలితం

07/08/2026

మంద కృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం...

మాదిగ మహిళా సమాఖ్య & మహాజన మహిళా విభాగం జాతీయ స్థాయి ముఖ్యులతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, సీతాఫల్ మండి లోని సాయి RKM ఫం...
04/08/2026

మాదిగ మహిళా సమాఖ్య & మహాజన మహిళా విభాగం జాతీయ స్థాయి ముఖ్యులతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, సీతాఫల్ మండి లోని సాయి RKM ఫంక్షన్ హల్ లో జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మాదిగ మహిళా సమాఖ్య అలాగే మహాజన మహిళ విభాగాలకు నూతన జాతీయ ,రాష్ట్ర కమిటీలను ఎన్నిక చేసే విషయమై మరియు భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం మీద చర్చ జరుగుతుంది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

31/07/2026

పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గారు..

Address

500003, Secunderabad
Hyderabad
500003

Alerts

Be the first to know and let us send you an email when MRPS4India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MRPS4India:

Shortcuts

Share