09/02/2020
తినడానికి తిండి లేకున్నా, ఉండడానికి ఇండ్లు లేకున్నా నమ్మిన సిద్దాంతం కోసం, దేశం కోసం ధర్మం కోసం దశాబ్దాలుగా బిజెపి జెండాలు మోస్తున్న తోటి భారతీయ జనతా పార్టీ సోదరి సోదరులకు పాదాభివందనం.
ప్రాంతీయ పార్టీల ఒత్తిడిలను,కుట్రలను కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొంటు డబ్బులు,పదవుల ఆశ చూపినా కూడా పట్టుకున్న బిజెపి జెండా ని వదలకుండా ఎంతో మంది తమ జీవితాలను భారత మాత సేవలో తరిస్తున్నరు.
పైస బలం తో నాయకులుగా చెలామణి అవుతున్న వారు కొన్నిమంది, ఇందులో నుండే నాయకుడిగా ఎదిగిన వారు దశాబ్దాలుగా జెండాలు మోస్తున్న వారిని బానిసలుగా భావించి పని చేయించుకోని పని అయిపోయక వదిలేస్తున్నరే తప్ప.. మరి దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలు మీ దగ్గరకి వస్తే , ఆర్థిక పరమైన సహాయాలు గాని, బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని పెట్టించడమో ,ఇప్పించడమో చేస్తే చచ్చేవారకు కూడా గుండెల్లో పెట్టుకుంటారు కదా !
ఆర్థికంగా గానీ, రాజకీయంగా గాని మంచి స్థాయిలో ఉన్న నాయకులు మీరు ఈ స్థితికి రావడానికి కారణమైన పునాదుల లాంటి కార్యకర్తలను,క్రింది స్థాయి ఆపదలో ఉన్న కార్యకర్తలు మీ దగ్గరకి వస్తే ఆదుకోండి ,సహాయం చేయండి
బీజేపీ కి పని చేసే కార్యకర్త అందరి లాగా పార్టీలు మారలేరు బీజేపీ లో చేరే వారు ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ పార్టీ కి పని చేస్తారు అలాంటి వారు కష్టాలో ఉన్నపుడు ఆదుకోకపోతే మీకు ఎన్ని పరిచయాలు ఉన్న దండగే అది పాపము కంటే ఎక్కువ
అన్ని పార్టీలు చూడండి లీడర్ ఎలా చెబితే అలా పైసలు మందు చిందు తో తోకడిస్తారు.
కానీ బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం అన్నింటికీ తెగేసి ఉంటారు లీడర్స్ కంటే ముందే
బీజేపీ లో చేరే ప్రతి వాడు కులం వర్గం అని బేధం లేకుండా చేరుతారు కుల వర్గ బేధ ఉన్న నాయకులూ పార్టీ లో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే
జై శ్రీరామ్.....