25/10/2026
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూమి కోల్పోయి, పరిహారం అందక ఆందోళన చేస్తున్న రైతు నర్సింహులుపై జడ్చర్ల ఎస్సై దాడి చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధిత రైతును పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా గద్వాల్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ, ఉద్దండాపూర్ నిర్వాసితులకు ఎకరానికి ₹20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు నర్సింహులుపై దాడికి బాధ్యుడైన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.