BhimArmy Telangana

BhimArmy Telangana BhimArmy Telangana

07/09/2026

07/09/2026

సిద్ధాంతం లేని రాజకీయం సమాజానికి విషం. ఒక సిద్ధాంతం కోసం బ్రతికే నాయకుడు ప్రజలను చైతన్యపరుస్తాడు" అవకాశవాదంతో బ్రతికే నాయకుడు కార్యకర్తలను బానిసలుగా మారుస్తాడు.

నిర్ణయం నీదే.

-వనం మహేందర్
జాతీయ ఉపాధ్యక్షులు భీమ్ ఆర్మీ

25/08/2026

మీరట్ బాధితులకు అండగా వెళ్తున్న భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ రతన్ సింగ్ గారిని పోలీసులతో అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

వనం మహేందర్
భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు!

25/08/2026

ఇతరులకు దేశభక్తి సిద్ధాంతాలు చెప్పే భాజపా నాయకత్వం, స్వయంగా జాతీయ జెండా స్థానంలో పార్టీ జెండాను ఎగరేసి తమ కపట దేశభక్తిని బయటపెట్టుకుంది. రాజ్యాంగ వ్యవస్థలను, జాతీయ చిహ్నాలను నిర్వీర్యం చేయడమే వీళ్ల అసలు అజెండా!

19/08/2026

పోలీసుల దౌర్జన్యం నశించాలి.. విద్యార్థుల హక్కులను కాపాడాలి! -వనం మహేందర్
భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

​మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం, తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై టౌన్ సీఐ రఘుపతి రెడ్డి అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగినది!

​ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థుల గొంతు పట్టుకుని నెట్టివేస్తూ, భౌతిక దాడికి పాల్పడటం పోలీసు వ్యవస్థకే అపకీర్తి తెచ్చే చర్య.
​కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం:

ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి, 'ప్రజా పాలన' అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక, తమ హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థుల గొంతును పోలీసుల బూటు కాళ్లతో అణచివేస్తారా? ఇదా మీ ప�

15/08/2026
04/08/2026

మహనీయుల బాటలో.. చదువుల వెలుగుల్లో భావి భారతం!

​ఈ చిత్రంలో చూస్తున్న ఈ చిరునవ్వులు, విద్యార్థుల చేతిలో ఉన్న ఆ మహనీయుల (గౌతమ బుద్ధుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, చత్రపతి శివాజీ, మహాత్మా జ్యోతిరావు పూలే, మాన్యశ్రీ కాన్షీరామ్) చిత్రపటాలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు... రేపటి తరం సాధించబోయే సామాజిక విప్లవానికి సంకేతాలు!

​పిల్లలకు చిన్ననాటి నుండే మన చరిత్రను, మహనీయుల ఆశయాలను, హక్కులను తెలియజేయడమే భీమ్ ఆర్మీ ప్రధాన ధ్యేయం. విద్యతోనే ఆత్మగౌరవం, విద్యతోనే సమానత్వం సాధించగలమని బలంగా నమ్ముతున్నాం.

​విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదివి, సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం!

​జై భీమ్! జై భారత్!

​– వనం మహేందర్
(తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, భీమ్ ఆర్మీ)
​ BahujanStudents EducationIsPower SocialJustice TelanganaYouth

31/07/2026

పార్లమెంట్‌లో బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా అన్నవి కావు, అవి బిజెపి యొక్క మనువాద రాజకీయ ఆలోచనా విధానాన్ని మరియు బహుజన వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేస్తున్నాయి.

​దేశంలో కుల గణన జరిగితే బహుజనుల, దళితుల, గిరిజనుల, బిసిల జనాభా ప్రాతినిధ్యం స్పష్టమవుతుంది.
జనాభా ప్రాతినిధ్యం తెలిస్తే, బడ్జెట్ కేటాయింపుల్లోనూ మరియు అధికారంలోనూ సమాన వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే బిజెపి కుల గణనను అడ్డుకుంటోంది.
పార్లమెంట్‌లో కుల గణన డిమాండ్ చేస్తున్న నాయకుల కులాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న బహుజన ఉద్యమాలను మరియు గొంతుకలను అణచివేయాలని చూస్తున్నారు.

​కులం పేరిట రాజకీయం చేస్తూ, అధికారంలోకి వచ్చాక కుల గణన అడిగితే కులాన్ని నిందించడం బిజెపి నైజం. దేశ జనాభాలో 85% ఉన్న బహుజనుల హక్కులను కాలరాసే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. రాబోయే రోజుల్లో బహుజనులంతా ఏకమై ఈ అహంకార పూరిత �

Address

Telangana
Hyderabad
500048

Telephone

+919908170170

Website

Alerts

Be the first to know and let us send you an email when BhimArmy Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BhimArmy Telangana:

Shortcuts

Share