మళ్లీ మన సీఎం జగన్ 2029

మళ్లీ మన సీఎం జగన్ 2029 YSR కాంగ్రెస్ పార్టీ 2011లో స్థాపించబడింది. మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది.

14/08/2026

స్నానానికి నీరు కోసం బక్కెట్లతో రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినులు

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని కేజీబీవీలో నీరు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు

స్నానాలకు, మ‌రుగుదొడ్ల‌కు కూడా నీరు లేకపోవడంతో బకెట్లు పట్టుకుని హాస్టల్ వెలుపలికి వెళ్లి తెచ్చుకుంటున్న విద్యార్థులు

నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ చేతగానిపాలనతో విద్యార్థులు ఇంకెన్ని తిప్పలు పడాలో?

08/08/2026

Free Health Check up

08/08/2026
06/08/2026

🟦🟩🟦🟩🟦🟩🟦🟩🟦
*నరసరావుపేట* *నియోజకవర్గం వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ నాయకులు* *మరియు కార్యకర్తలకు* *ఆహ్వానము!*
🟦🟩🟦🟩🟦🟩🟦🟩🟦

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు రేపు అనగా ది 07-08-26 శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక స్టేషన్ రోడ్ లోని గాంధీ పార్క్ వద్ద కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో చేసిన అక్రమాల పై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ , నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మరియు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు , మహిళలు,మరియు కార్యకర్తలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము.
ఇట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం -నరసరావుపేట

04/08/2026

*నిరుపేద తల్లులకు అందని -* *తల్లికి వందనం!*

*తప్పులు సరి చేయండి* - *నిరుపేద తల్లులకు* *న్యాయం చేయండి* !

*పార్టీలతో సంబంధం* *లేకుండా తల్లికి వందనం* *కోల్పోయిన వారందరికీ* *న్యాయం జరగాలి* !

*తల్లికి వందనం పథకం* *కోల్పోయిన వారందరికీ* *న్యాయం జరగకపోతే వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ తరఫున* *పోరాటాన్ని ఉదృతం* *చేస్తాం-పల్నాడు* *జిల్లా వైయస్సార్* *కాంగ్రెస్ పార్టీ వర్కింగ్* *ప్రెసిడెంట్ డాక్టర్* *శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి* *గారు*
***********
తల్లికి వందనం పథకం కోల్పోయిన లబ్ధిదారులందరికీ న్యాయం జరగాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
నరసరావుపేట నియోజకవర్గంలో 5929 మంది నిరుపేదలకు అధిక విద్యుత్ బిల్లులు, 1000 గజాల స్థలం మరియు ఇన్కమ్ టాక్స్ తదితర కారణాలు చూపుతూ తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని, గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్కమ్ టాక్స్ పరిమితిని తల్లికి వందనం పథకానికి వర్తింప చేయలేదని, కానీ లోకేష్ గారు ఇన్కమ్ టాక్స్ కారణంగా చూపుతూ తల్లికి వందనం పథకాన్ని ఎగవేయటం జరుగుతుందని,
ఒక నరసరావుపేట నియోజకవర్గంలోనే సుమారు 6000 మందికి తల్లికి వందనం పథకం రద్దు చేశారని ,రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వందల ,వేలమందికి ఈ పథకం రద్దు చేశారో అర్థం అవుతుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడి పథకం 11000 కుదించారని లోకేష్ బాబు గగ్గోలు పెట్టారని , కానీ ఆ డబ్బు ఆరోజు పాఠశాల అభివృద్ధికి వినియోగించడం జరిగిందని,
కానీ ఈరోజు 15000 ఇస్తామని చెప్పి
13000ఇస్తూ ఆ మిగిలిన డబ్బు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదని, ఈ ప్రభుత్వం నిరుపేద తల్లులను దారుణంగా మోసం చేసిందని,
దుర్గ అనే నిరుపేద కుటుంబానికి చెందిన తల్లికి ముగ్గురు పిల్లలని ,గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీరికి అమ్మ ఒడి పథకం అందిందని, కానీ ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా వీరికి వందనం పథకం రద్దు చేశారని , రద్దుకు కారణం విచిత్రంగా చెబుతున్నారని, ఈమె ఆధార్ కార్డు బండారు సత్యనారాయణ అనే ఎవరో ఎన్నారై ఆధార్ కు లింక్ అయిందని, అతను ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నాడని, ఈమె కూడా ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారు కింద జమ కట్టి ,ఈమెకు తల్లికి వందనం పథకం రద్దు చేశారని, ఈమెకు ఉండటానికి ఇల్లు కూడా లేదని, కానీ హౌసింగ్ లోన్ కూడా తల్లికి వందనం రద్దుకు కారణంగా చూపుతున్నారని,
ఈమె భర్త కాలు గాయపడి ఏ పని చేసుకోలేని దుస్థితిలో ఉన్నారని, రెండు సంవత్సరాలు నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని కానీ ఈమెకు మాత్రం అధికారులు న్యాయం చేయడం లేదని, అధికారు ల తప్పిదాలకు నిరుపేదలు బలవుతున్నారని, తక్షణమే ఈమెకు న్యాయం చేయాలని ,నరసరావుపేట పరిధిలో తల్లికి వందనం పథకం రద్దయిన లబ్ధిదారుల జాబితా మొత్తం కలెక్టర్ గారికి అందజేయడం జరిగిందని, తక్షణమే వాటిపై విచారణ చేసి రద్దయిన లబ్ధిదారులందరికి ,తిరిగి తల్లికి వందనం నిధులు పడేటట్లు చర్యలు తీసుకోవాలని ,లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని.. ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

04/08/2026

ఒక ఊరిలో ఇరవై ఏళ్లు ఒక దుకాణం మాత్రమే ఉండేది. పోటీ లేకపోవడంతో యజమాని ఎప్పుడూ దుకాణాన్ని బాగు చేయలేదు, కొత్త సరుకులు కూడా తేవలేదు. “ఇదే సరిపోతుంది” అనుకునేవాడు.

ఒక రోజు అదే వీధిలో మరో కొత్త దుకాణం తెరుచుకుంది. శుభ్రంగా, కొత్తగా, ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసింది. దాంతో పాత దుకాణం యజమానికి ఒక్కసారిగా జ్ఞానోదయం వచ్చింది. దుకాణానికి రంగులు వేయించాడు, కొత్త సరుకులు తెప్పించాడు, మరమ్మతులు చేయించాడు.

అప్పుడు ఊరి పెద్దలు ఒక మాట చెప్పారు…

“పోటీ వస్తేనే ప్రగతి వస్తుంది. సత్తా ఉన్న నాయకుడు ఎదురుగా నిలిస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది.”

ఇరవై ఏళ్లుగా చెరువు గుర్తుకు రాకపోయినా, ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన రావడం స్వాగతించాల్సిన విషయమే. కానీ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే…

ప్రజలకు ఉపయోగపడే పోటీ మొదలైంది.

Address

62
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when మళ్లీ మన సీఎం జగన్ 2029 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share