12/06/2026
*మాదిగ ల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి లేకుంటే మూల్యం చెంల్లించుకోవసిందే: మాదిగ హక్కుల దండోరా*
ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో *జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ గారు , రాష్ట్ర అధ్యక్షులు కొంగర శంకర్ మాదిగ* గారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు దాదాపు సున్నాకే పరిమితమయ్యాయని, దళితుల అభివృద్ధికి కీలకమైన ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా దళితుల భూములు , లిడ్ క్యాప్ (LIDCAP) భూములు కబ్జాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో దళిత యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఎస్సీ నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ – ఉచిత ఉపాధి కల్పన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో Junior Software Developer, IT Helpdesk Attendant, Key Consignor Executive కోర్సుల్లో మూడు నెలల శిక్షణ అందించబడుతుందని, శిక్షణ పూర్తయిన వారికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించబడుతుందని తెలిపారు.18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎస్సీ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళిత యువత స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి మాదిగ హక్కుల దండోరా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మెమో, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సంప్రదించవలసిన నంబర్లు:📞 9100449109📞 8309302926 📞 8465046265 ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శ్యామ్ మాదిగ గారు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారాం రమేష్ ,రాష్ట్ర కార్యదర్శి వరికిల్ల రాజయ్య , ,సల్మాన్ మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార్ మాదిగ ,మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజకుమార్ మాదిగ,గోగర్ల శేఖర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి, రత్నం ప్రవీణ్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు, మోతె స్వామి మాదిగ ,mhd మందమర్రి పట్టణ అధ్యక్షులు కొలుగురి విజయ్ కుమార్ మాదిగ ,, కరీంనగర్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ మాదిగ , జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు దొడ్డే రాజు మాదిగ,మారుముళ్ల లక్ష్మణ్ మాదిగ ,ఇమెడి రాజు మాదిగ,కుమ్మరి సాంబయ్య మాదిగ ,దాసరిరామస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు