27/02/2025
*తేది:23/02/2025*
*కర్నూలు*
*"""""""""""""""""""""""""*
*రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభ విజయవంతం*
*""""""""""""""""""""""""""*
*మాలలు సంఘటితంగా ఉద్యమించాలి*
*ముఖ్య అతిధి గా పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు*
*అతిధులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య*
*మాజీ పార్లమెంటు సభ్యులు జి వి హర్షకుమార్, మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, పి వి రావు గారి సోదరులు పి ఎస్ ఎన్* *మూర్తి,మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కొమ్మతోటి పౌలు గార్లు తదితరులు*
👉 *ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు* *మాట్లాడుతూ మాలలు సంఘటితంగా* *ఉద్యమించినప్పుడే హక్కులు* *సాదించుకుంటామని, అన్ని రాజకీయ పార్టీలు మాలల పై వివక్షను చూపిస్తున్నాయని, మాలలను అణగదొక్కాలని వర్గీకరణ చేస్తున్నారని మాలల కు ఆత్మగౌరవం కష్టపడే తత్వం, అందరిలో కలిసి పోయే గుణం ఎక్కువగా ఉంటుంది అని, అన్నారు*
*భారత రాజ్యాంగమే మనకు రక్ష అని దానిని కాపాడు కోవలసిన బాధ్యత మనపైన ఎక్కువగా ఉందని అన్నారు*
*మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య*
*""""""""""'''''*
👉 *మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాలల కు వ్యతిరేకంగా పని చేస్తారని, అప్పుడు ఇప్పుడు వర్గీకరణకు సూత్రదారి ఆయనేనని, మాలలు తెలుగు రాష్ట్రాలలో గురు శిష్యుల చేతుల్లొ మోసపోయి గోస పడుతున్నారని చెన్నయ్య పేర్కొన్నారు, రాజ్యాంగ విరుద్ధంగా చేసే వర్గీకరణ ను న్యాయ బద్ధంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు, మందకృష్ణ మాదిగ మనువాదులతో చేతులు కలిపి మాలలపై విషం చిమ్ముతున్నారని ఆయన కోరే వర్గీకరణ దళితుల అభివృద్ధికి కాదని మనువాద ఎజెండా అమలుకే అని చెన్నయ్య ఆరోపించారు*
*ఈ రాయల సీమ యుద్ధ గర్జన సభకు యాట ఓబులేషు అధ్యక్షత వహించగా, మాధవ స్వామి, జయారాముడు, యమల సుదర్శన్, అశోక రత్నం శ్రీమతి ఎం సరళ, శ్రీమతి రమ, తదితరులు పాల్గొన్నారు*