02/04/2026
ఉత్తరాంధ్రకు న్యాయం వైపు మరో ముందడుగు – పలాస డివిజన్‌పై ఆశలు!!
రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ఒక సానుకూల నిర్ణయం.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ అంశంపై నేను కూడా పలుమార్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఇమెయిల్స్ మరియు పోస్టల్ లెటర్స్ ద్వారా వినతిపత్రాలు సమర్పించిన విషయం సంతోషంగా తెలియజేస్తున్నాను.
అయితే, ఉత్తరాంధ్రలోని చివరి ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస మరియు పరిసర ప్రాంతాల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన పలాసను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం పై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
పలాసను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతానికి రైల్వే సదుపాయాలు మెరుగుపడి, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదం అవుతుందని ఆశిస్తున్నాము.
త్వరలోనే పలాస డివిజన్ ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నాము.