25/08/2026
నివాళి
******
సారంపెల్లి మల్లారెడ్డి గారి కి ఘనంగా యంసిపిఐ(యు) నివాళులు
-------------------
కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమ ఐక్యత కాంక్షించిన మల్లారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
----------------------
సంతాప సభ లో యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్
_________________
సిపిఎం సీనియర్ నేత,రైతు ఉద్యమ నేత సారంపెల్లి మల్లారెడ్డి గారి మృతి కమ్యూనిస్టు, సామాజిక ప్రజా ఐక్య ఉద్యమాలకు తీరని లోటు అని యంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ గారు అన్నారు.
ది:-25-8-2026 రోజున అమరజీవి కామ్రేడ్ సారం పెల్లి మల్లారెడ్డి గారి భౌతిక కాయాన్ని యం.బి భవన్ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి,పొలిట్ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి,మోర్తాల చందర్ రావు,నార్ల చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, పెద్దారపు రమేష్,వి.తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్,తుడుం అనిల్ కుమార్, తాండ్ర కళావతి బృందం తో కలిసి సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సంతాప సభలో కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారితో కలిసి జరిగిన భూస్వామి, పటేల్ పట్వారీ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా మహత్తర నర్సంపేట పోరాటం ఒక చారిత్రాత్మక పోరాటం అని ఆ పోరాటం లో కామ్రేడ్ ఓంకార్ గారితో కలిసి పని చేసిన మల్లారెడ్డి గారు అంచెలంచెలుగా రాష్ట్ర నేత గా రైతాంగ అఖిలభారత నాయకుడుగా అభివృద్ధి చెందిన తీరు నేటి తరానికి ఆదర్శం అని, ఆయన మరణం వామా పక్ష ఐక్యత, రైతాంగ ఉద్యమాలకు తీరనిలోటని కొనియాడుతూ ఆయన మరణం పట్ల యంసిపిఐ(యు) నివాళులు అర్పిస్తుందని,వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతిని వ్యక్తపరుస్తుందని అన్నారు.