Chennapai.Nagashekhar Raju-TRSKV

Chennapai.Nagashekhar Raju-TRSKV �కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి!!� భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం #

08/02/2026
పైరసీ
23/11/2025

పైరసీ

🔹రూ. 5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ రెడ్డి🔹హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ...
23/11/2025

🔹రూ. 5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ రెడ్డి

🔹హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి

🔹ఇది పాలసీ కాదు.. రూ. 5 లక్షల కోట్ల స్కామ్

🔹లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతున్నడు

🔹ఒకప్పుడు ప్రజల వద్ద పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూమిని, ప్రభుత్వం రాయితీలతో ఇచ్చిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు సమర్పిస్తున్నడు

🔹వెంటనే ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేయాలి

🔹మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువ ఉన్న ఈ భూములను, కేవలం 30% ఎస్ఆర్ఓ రేట్లకి రెగ్యులరైజ్ చేయడం అవినీతికి నిదర్శనం

🔹ఇది కేవలం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అనుచరుల కోసమే తీసుకు వచ్చిన పాలసీ

🔹రేవంత్ అవినీతి కోసం ఇప్పుడు ఇందులో పాలుపంచుకుంటే వాటి రద్దు తప్పదు

- పారిశ్రామికవేత్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక

♦️కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

♦️దీనిని భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అభివర్ణించిన కేటీఆర్, ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు.

♦️పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టీపీ (HILTP), వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ (Multi-Use) విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించబడిందని కేటీఆర్ పేర్కొన్నారు.

♦️ఇది కేవలం పాలసీ కాదు. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారు.

♦️బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

♦️ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు.

♦️ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30%కే అప్పగించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

♦️మేము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ఎస్ఆర్‌ఓ రేట్ల కంటే 100% నుండి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ కాంగ్రెస్ కేవలం 30% కే చేయాలని చూస్తోంది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని ప్రశ్నించారు.

♦️మార్కెట్ ధరలు, ఎస్ఆర్‌ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వాదించారు.

♦️కనీసం ఎస్ఆర్‌ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదు. కేవలం 30% మాత్రమే తీసుకుంటున్నారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు.

♦️ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చారిత్రకంగా పారిశ్రామిక భూములను చాలా తక్కువ ధరలకు లేదా ఉచితంగా కేటాయించారని అన్నారు.

♦️చాలా సందర్భాల్లో ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు అనేక రైతులతో ఇచ్చిన ఈ భూములను ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల నది కోసం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదన్నారు.

♦️ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయి. అది ఉద్దేశం. కానీ ఇప్పుడు, అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారని అన్నారు.

♦️బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని, అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని వెల్లడించారు.

♦️ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము. మేము అప్పుడు తిరస్కరించాం. కానీ మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

♦️ఈ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు.

♦️లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని ప్రశ్నించారు.

♦️రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు మరియు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని ఆయన తెలిపారు.

♦️కాంగ్రెస్ HILTPని ఏటీఎం గా మార్చిందని, ఈ పాలసీని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం (ATM) గా అభివర్ణించిన కేటీఆర్, హెచ్‌ఐఎల్‌టీపీ వెనుక ఉన్న ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్దఎత్తున ధనవంతులుగా మార్చడమేనని అన్నారు.

♦️ముఖ్యమంత్రి పాలన కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

♦️ముందు మూసీ నదీ తీరంలోని భూములు. తర్వాత మెట్రో రైలు భూములు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు. ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు. రేవంత్ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారు. ఆయన చుట్టూ భూ డీలర్లు ఉన్నారు. ఆయన సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే పాలసీని తొందరపెడుతున్నారని ఆరోపించారు.

♦️ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్‌లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని స్పష్టం చేశారు.

♦️ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లేదా స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో, రేవంత్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అనుకుంటున్నారని అన్నారు.

♦️ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు.

♦️దానికి బదులుగా, వారు రూ. 5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

♦️హెచ్‌ఐఎల్‌టీపీ కింద డీల్స్ కుదుర్చుకునే వారికి కేటీఆర్ గారు నేరుగా హెచ్చరిక జారీ చేశారు.

♦️ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారు. ఈ లావాదేవీలు నిలబడవు. ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, తగిన చర్యలు ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.

♦️మేము పూర్తి స్థాయి విచారణ జరుపుతాము మరియు ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం. ఈ స్కామ్‌లో పాల్గొనే ఎవరినీ వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.

♦️ఈ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

♦️కనీసం, ప్రభుత్వం 50% భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, మిగిలిన 50% క్రమబద్ధీకరించాలి. కానీ కాంగ్రెస్ 100% భూమిని చౌక ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తోంది. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.

♦️ముంబై లాంటి మహా నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే.. ఇక్కడ మాత్రం అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ది కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.

♦️ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీనిని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే, కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థం అని అన్నారు.

♦️తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఇది పగటిపూట దోపిడీ అన్నారు.

✳️ ఈ నెల 29న 'దీక్షా దివస్' ఘనంగా నిర్వహించాలి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్✳️ తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టాని...
22/11/2025

✳️ ఈ నెల 29న 'దీక్షా దివస్' ఘనంగా నిర్వహించాలి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

✳️ తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా 'దీక్షా దివస్’

✳️బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ 👇

♦️బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నెల 29న 'దీక్షా దివస్'ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

♦️దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ గారు 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అనే గొప్ప త్యాగ నిరతితో దీక్షను చేపట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.

♦️తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

♦️దీనికి సంబంధించి ఆయన ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, దీక్షా దివస్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శనం చేశారు.

♦️దీక్షా దివస్ నిర్వహణకు ముందుగా, ఈ నెల 26వ తేదీన అన్ని జిల్లాల పార్టీ కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని కేటీఆర్ సూచించారు.

♦️ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు.

♦️ఈ సన్నాహక సమావేశాల ముఖ్య ఉద్దేశం, నవంబర్ 29న పార్టీ ఘనంగా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

♦️నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలి.

♦️ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా, అంటే 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాలి. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలి.

♦️జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించి, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.

♦️మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ గారి భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలి.

♦️దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

♦️ఈ ఫోటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాకు పంపిస్తుంది. వీటితో పాటు, స్థానిక జిల్లాల్లో దీక్షా దివస్ సందర్భంగా జరిగిన సంఘటనల ఫోటోలు, వార్తా కవరేజ్ క్లిప్పింగ్‌లతో మరొక ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

♦️కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా, ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు.

♦️దీక్షా దివస్ రోజున పండ్ల పంపిణీ, వీలుంటే అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చు. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ చేయనున్నారు.

♦️అలాగే, పార్టీ యూత్ మరియు విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా వారు దీక్షా దివస్ పేరుతో, కేసీఆర్ గారి చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ధరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

BRS_HNR
22/11/2025

BRS_HNR

02/10/2025

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

'ది బిల్ ఈస్ పాస్డ్'తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు.తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆత్మగౌరవ పతాక ఎర్రకోట మ...
20/02/2025

'ది బిల్ ఈస్ పాస్డ్'
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు.

తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆత్మగౌరవ పతాక ఎర్రకోట మీద ఎగర వేసిన రోజు

గులాబీ జెండా చేత పట్టి ప్రాణాలను ఫణంగా పెట్టి
రక్తమోడని రణరంగంలో కాలాన్ని గెలిచిన రోజు

ఉద్యమ సారథి కేసీఆర్ శాంతియుత రాజకీయ పంథాకు
పార్లమెంట్ ప్రణమిల్లిన రోజు

20 ఫిబ్రవరి 2014
'ది బిల్ ఈస్ పాస్డ్' అనే శబ్దం విజయ శంఖారావమై వినిపించిన రోజు

తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు..
తెలంగాణ రాష్ట్రం నిజమైన రోజు.

కెసిఆర్ గారి  జన్మదినోత్సవ సందర్భంగా. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా... కెసిఆర్ గారి పథకాలన...
17/02/2025

కెసిఆర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా... కెసిఆర్ గారి పథకాలను ఆయన పరిపాలన తీరును, ఉద్యమ కాలంలో తాను చేసిన వినూత్న నిరసనలు పోరాటాలు గురించి స్మరించుకుంటూ.... జై తెలంగాణ

*మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక చేయూత*ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హుజూర్ నగర్ నియోజవర్గ ముని...
06/05/2023

*మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక చేయూత*

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హుజూర్ నగర్ నియోజవర్గ మునిసిపాలిటీ పరిధి లోని 3వ వార్డ్ నివాసి అల్లం. కిరణ్ కుమార్ గారి కుటుంబాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారు పరామర్శించారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, అల్లం కిరణ్ కుమార్ అందరితో కలివిడిగా ఉండేవారని గుర్తుచేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుడు కడియాల. రామకృష్ణ, మట్టపల్లి ఆలయ కమిటీ మెంబర్ కీసర. కొండల రెడ్డి, BRTU నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెన్నపాయి. నాగశేఖర్ రాజు, , బెల్లంకొండ నాగేశ్వర్ రావు, కుక్కల మధుబాబు, షేక్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

Address

HUZURNAGAR
Huzurnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Chennapai.Nagashekhar Raju-TRSKV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category