22/07/2024
అమరావతి :
_*పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి..!*_
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు.
2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి.
*సోషల్ మీడియా, ఐటీడీపీకి ప్రతి సమాచారం ఇవ్వండి.*
పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి.
ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.
ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి.
ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి.
కార్యకర్తలకు అండగా నిలబడాలి.
వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.