RSS Seva Bharathi Gurramkonda

RSS Seva Bharathi Gurramkonda సేవాహి పరమో ధర్మః

ఆర్ఎస్ఎస్ నమోదు కాకపోయినా చట్టబద్ధ సంస్థే!   పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలిదేశానికి సేవ చేస్తున్నామని...
10/11/2025

ఆర్ఎస్ఎస్ నమోదు కాకపోయినా చట్టబద్ధ సంస్థే!

పాక్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలి

దేశానికి సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ సంఘ్ “నమోదు కాని సంస్థ”గా ఎందుకు మిగిలిపోయిందని ప్రశ్నించిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి చాలా ముందు 1925లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని చెబుతూ ఆ సమయంలో ఆ సంస్థ బ్రిటిష్ ప్రభుత్వం కింద నమోదు అయి ఉంటుందని విమర్శకులు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.

“సంఘ్ 1925 లో ప్రారంభమైందని మీకు తెలుసా? మేము బ్రిటిష్ ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకున్నామని మీరు అనుకుంటున్నారా? దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము?

స్వాతంత్ర్యం తరువాత, స్వతంత్ర భారత్‌లోని చట్టాలు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయలేదు. వ్యక్తుల నమోదు కాని సంస్థలకు కూడా చట్టపరమైన హోదా ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని అలా వర్గీకరించారు. ఒక సంస్థగా గుర్తించారు” అని భగవత్ బెంగళూరులో “100 సంవత్సరాల సంఘ ప్రయాణం: న్యూ హారిజన్స్” ఉపన్యాస శ్రేణిలో తెలిపారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆదాయపు పన్ను శాఖ, కోర్టులు ఆర్ఎస్ఎస్ ను వ్యక్తుల సంఘంగా పేర్కొన్నాయని, సంస్థను ఆదాయపు పన్ను నుండి మినహాయించారని చెప్పారు. “మమ్మల్ని మూడుసార్లు నిషేధించారు. అంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. మేము లేకపోతే, వారు ఎవరిని నిషేధించేవారు? ప్రతిసారీ, నిషేధాన్ని కోర్టులు కొట్టివేసాయి” అని గుర్తు చేశారు.

“ఆర్ఎస్ఎస్ ను చట్టపరమైన సంస్థగా కోర్టులు గుర్తించాయి. పార్లమెంటులో, ఇతర చోట్ల అనేక ప్రశ్నలు లేవనెట్టారు. చట్టబద్ధంగా, మేము ఒక సంస్థ; మేము రాజ్యాంగ విరుద్ధం కాదు. కాబట్టి, హిందూ ధర్మం ‘రిజిస్టర్డ్’ కానప్పటికీ, రిజిస్ట్రేషన్ అవసరం లేదు” అని స్పష్టం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని పిలుపు నిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆయన సంస్థ రిజిస్ట్రేషన్ స్థితిని ప్రశ్నించగా, దాని నిధుల వనరులకు సంబంధించి పారదర్శకతను కోరింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ జెండాలను మాత్రమే గౌరవించడం, భారతీయ త్రివర్ణాన్ని గుర్తించకపోవడం అనే అంశంపై స్పందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ లో కాషాయ రంగును గురువుగా పరిగణించినప్పటికీ, భారతీయ త్రివర్ణ పతాకాన్ని దానికి అధిక గౌరవం ఉందని భగవత్ స్పష్టం చేశారు. “మేము ఎల్లప్పుడూ మన త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తాము, నివాళులు అర్పిస్తాము, రక్షిస్తాము” అని తేల్చి చెప్పారు.

కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ లో హిందువులు మాత్రమే అనుమతీస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, హిందూ మతం ఒక మతం కాదని, భారతదేశానికి చెందిన ఎవరైనా హిందువులేనని భగవత్ తేల్చి చెప్పారు. బ్రాహ్మణులు, ముస్లింలు లేదా క్రైస్తవులు తమ “వేర్పాటు”ని వదిలి “భారత మాత కుమారులు”గా వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలలో చేరడానికి స్వాగతం అని భగవత్ ప్రకటించారు.

“సంఘంలో బ్రాహ్మణులకు అనుమతి లేదు. సంఘ్‌లో ఇతర కులాలకు అనుమతి లేదు. ముస్లింలకు అనుమతి లేదు, సంఘ్‌లో క్రైస్తవులకు అనుమతి లేదు. హిందువులకు మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి వివిధ తెగల ప్రజలు – ముస్లింలు, క్రైస్తవులు, ఏదైనా తెగ – సంఘ్‌లోకి రావచ్చు కానీ మీ వేర్పాటును దూరంగా ఉంచుకోవచ్చు” అని ఆయన సూచించారు.

“మీ ప్రత్యేకత స్వాగతించదగినది. కానీ మీరు శాఖలోకి వచ్చినప్పుడు, మీరు భారత మాత కుమారుడిగా, ఈ హిందూ సమాజంలో సభ్యుడిగా వస్తారు. ముస్లింలు శాఖకు వస్తారు, క్రైస్తవులు శాఖకు వస్తారు. సాధారణంగా హిందూ సమాజం అని పిలువబడే అన్ని ఇతర కులాల మాదిరిగానే, వారు కూడా శాఖకు వస్తారు. కానీ మేము వారిని లెక్కించము. వారు ఎవరు అని అడగము. మనమందరం భారత మాత కుమారులం. సంఘం అలా పనిచేస్తుంది…” అని డా. భగవత్ వివరించారు.

రామ మందిరాన్ని నిర్మించడానికి పార్టీ చొరవ తీసుకున్నందున ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపికి మద్దతు ఇచ్చిన్నట్లు భగవత్ తెలిపారు. అయితే, సంఘ్ మద్దతు ఓ ప్రత్యేక పార్టీకి, వ్యక్తులకు ఉండదని, వారు అనుసరించే విధానాలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. దేశం హితంకోసం ఎవ్వరు పనిచేసినా, దేశానికీ అవసరమైన విధానాలను ఎవ్వరు చేపట్టినా తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు.

స్వయంసేవక్ లు ఏ పార్టీలో అయినా చేరవచ్చని, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కొన్ని పార్టీలు తమను వ్యతిరేకిస్తున్నాయని, మరొకొందరు తమకు ప్రవేశం లేదని చెబుతున్నాయని, అటువంటప్పుడు ఒక పార్టీ మాత్రమే వారిని ఆహ్వానిస్తున్నదని గుర్తు చేశారు.
పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే భారత్‌ సమాధానం చెప్పాలని డా. భాగవత్‌ సూచించారు. నిజాయితీ గల స్నేహితునిగా భారత్‌కు సహకరించటం ద్వారానే దాయాదికి మేలు జరుతుందని ఆయన హితవు చెప్పారు. పాకిస్థాన్‌కు నష్టం జరిగేలా భారత్‌ ప్రతిసారి ఓడించాలని పేర్కొంటూ దానివల్ల పాకిస్థాన్‌ శాశ్వతంగా పశ్చాతాపం చెందకతప్పదని స్పష్టం చేశారు.

“పాకిస్థాన్‌తో ఎల్లప్పుడూ మనం శాంతినే కోరుకుంటాం. పాకిస్థానే మనతో శాంతి కోరుకోవటం లేదు. భారత్‌కు హానిచేయటం ద్వారా ఎంతోకొంత సంతృప్తి చెందినంతకాలం పాకిస్థాన్‌ అలాగే చేస్తూనే ఉంటుంది. పాకిస్థాన్‌తో శాంతికి మార్గం ఏమంటే మనవైపు నుంచి ఉల్లంఘన జరగకూడదు. కానీ శాంతిని పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తే అది ఎప్పుడూ విజయం సాధించలేదు. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతఎక్కువ నష్టపోతుంది” అని హెచ్చరించారు.

“ఉదాహరణకు 1971 పాకిస్థాన్‌ దండయాత్ర చేసింది. భారత్‌కు 90వేల మంది సైనికులను కోల్పోయింది. ఆ విధంగా వరుసగా జరిగితే పాకిస్థాన్‌ ఒకరోజు పాఠం నేర్చుకుంటుంది. అందువల్ల యుద్ధం చేయటానికి పోటీపడే కంటే మనకు సహకరించమే మేలని అర్థమవుతుంది. వారికి మరో భాష అర్థమవుతుందని అనుకోవటం లేదు. పాకిస్థాన్‌కు అర్థమయ్యే భాషలోనే మనం చెప్పాలి” అని తేల్చి చెప్పారు.

“భారత్‌ను ఏమి చేయలేమనే విషయం పాక్‌కు అర్థంకావాలి. సన్నిహితంగా, స్నేహంగా, నిజాయితీగా, సహకరించటమే మార్గమని అర్థంచేసుకోవాలి. పాక్‌ పదేపదే చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. తగిన విధంగా సమాధానం చెప్పాలి. ఎల్లప్పుడూ ఓడించాలి. నష్టం జరిగిన ప్రతిసారి పశ్చాతాపం చెందుతుంది. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు పాకిస్థాన్‌కు అర్థమవుతుంది” అని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన...
01/11/2025

ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్

ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్
ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన లేఖ
“హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా, ఆర్ఎస్ఎస్ యువకులు, మహిళలను పిల్లలను సంరక్షించారు, వారికి సహాయంగా ఎంతో పాటుపడ్డారు. అర్ధం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికీ దానిపట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు”, ఆయన ఇంకా ఇలా అంటారు, “వేరేగా లేక వ్యతిరేకంగా కాక, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను”.

Sardar Patel on RSS
Letter dt 11th Sept 1948 to M.S.Golwalkar by Sardar Patel
"There can be no doubt that the RSS did service to the Hindu society. In the areas where there was the need for help and organization, the young men of the RSS protected women and children and strove much for their sake. No person of understanding could have a word of objection regarding that"
and he writes further
"I am thoroughly convinced that the RSS men carry on their patriotic endeavour only by joining the Congress and not by keeping separate or by opposing "


1949 జూలై 12న RSS పై నిషేధం తొలగించబడిన తర్వాత, సర్దార్ పటేల్ ఈ సందర్భంలో శ్రీ గురుజీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు:
“సంఘంపై నిషేధం తొలగించినప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, అది కేవలం నా దగ్గర్లో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మీకు నా శుభాకాంక్షలు.”

(Collected Correspondence of Sardar Vallabhbhai Patel, volume 10, జూలై 1949) లో భారత ప్రభుత్వం ద్వారా ప్రచురించబడింది.


1966లో – ఇంద్రా గాంధీ, న్యాయమూర్తి జె.ఎల్. కపూర్ కమిషన్ ఏర్పాటు చేశారు.
100 మంది సాక్షులను విచారించిన తర్వాత నివేదికలో –
"ఆర్‌ఎస్‌ఎస్ గాంధీ హత్యలో బాధ్యత వహించలేదు" అని స్పష్టం చేశారు

—------------------------------------------------------------------------------------------------------------------------
స్వయంగా సర్దార్ పటేల్ తన ప్రసంగంలో, ముస్లిములతో ఏమన్నారో ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు.

“ఒక విషయంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది భారతీయ ముస్లిములు, పాకిస్తాన్ ఏర్పాటుకి సహాయపడ్డారు. వారంతా రాత్రికి రాత్రే మారిపోయారని ఎలా నమ్మగలం? తాము విధేయత కలిగిన పౌరులని, కాబట్టి వారిని ఎందుకు అనుమానించాలి అని ముస్లిములు అంటున్నారు. వాళ్ళతో నేను ఇలా అంటాను ”ఆ మాట మమ్మల్ని అడగడం ఎందుకు? మీ అంతరాత్మలలో తరచి చూడండి!”.
భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములు, దేశం పట్ల పూర్తి విశ్వాసం, విధేయత చూపించాలని ఆయన తన భావాన్ని సూటిగా వ్యక్తపరిచారు. 13నవంబర్ 1947లో రాజకోట్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఎంతో స్పష్టంగా సూటిగా ఉంటుంది.

ఈ వాక్యాలను పేర్కొనే నిజాయితీ Rss ను విమర్శిస్తున్న వాళ్లకు ఉన్నదా
ఇదొక్కటే కాదు, దేశ విభజన జరిగిన ఆ భయంకర సమయంలో, తూర్పు పశ్చిమ పాకిస్తాన్లో, హిందువులు పెద్ద ఎత్తున హృదయ విదారకమైన అత్యాచారాలకు, హింసకు హత్యలకు గురైనపుడు, ఎవరు వాళ్ళను పట్టించుకుని కాపాడారు? ఆర్ఎస్ఎస్. అంతేకాదు, ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ చేసిన సహకారం, త్యాగాల గురించి ఎంతోమంది సహృదయులు మాట్లాడారు.

భారతరత్న డా. భగవాన్ దాస్, 1 అక్టోబర్ 1948 తేదిన ఈ విధంగా వ్రాసారు.

“సాయుధ దళాలతో దాడులు చేసి, భారత ప్రభుత్వ మంత్రులు, అధికారులను హత్యలు చేసి, ఎర్రకోట మీద పాకిస్తాన్ జెండా ఎగురవేసి, భారత్ లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా ముందుగానే జవహర్లాల్ నెహ్రుకి, సర్దార్ పటేల్ కి తెలియపరిచారని నాకు ఖచ్చితంగా తెలుసు.
నిజాయితీగల దేశభక్తులైన ఆర్ఎస్ఎస్ యువకులు, నెహ్రు పటేల్ లకు ముందుగానే ఆ సంగతి తెలియజేయకపోతే, ఈ రోజు దేశమంతా పాకిస్తాన్ అయి ఉండేది, లక్షలాది హిందువులు హత్య చేయబడేవారు లేక బలవంతంగా మతమార్పిడి చేయబడేవారు, భారతదేశం మరొకసారి బానిసదేశం అయి ఉండేది. ఇది దేనినీ సూచిస్తుంది? ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులను అణిచివేసి బదులు, లక్షలాదిమంది ఆర్ఎస్ఎస్ దేశభక్తుల శక్తి సామర్థ్యాలు ప్రభుత్వాలు సద్వినియోగ పరుచుకుంటే దేశం బాగుపడుతుంది

He spoke in Calcutta on 3 January 1948 before a large crowd of five lakh people where he highlighted the huge task of reconstruction. He exhorted those Muslims who had favoured the idea of Pakistan to now show unequivocal loyalty to India:

One fact is indisputable. Many Muslims in India have helped for the creation of Pakistan. How can one believe that they can change overnight? The Muslims say that they are loyal citizens. Therefore, why should anybody doubt their bona fides? To them I would say: 'Why do you ask us? Search your own conscience!'73
He put across his idea without mincing words that those Muslims who had stayed back needed to show unalloyed loyalty to the homeland. His address to the Rajkot citizens on 13 November 1947 may be seen as the most blunt and unambiguous suggestion in this regard:
Source - Patel: Political Ideas and Policies by Shakti Sinha

AI ఇచ్చిన సమాచారం బ్రిటిష్ వారి ఆక్రమణకు ముందు, అనగా 17వ శతాబ్దంలో, భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటిగా ఉ...
30/10/2025

AI ఇచ్చిన సమాచారం
బ్రిటిష్ వారి ఆక్రమణకు ముందు, అనగా 17వ శతాబ్దంలో, భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటిగా ఉండేది. ఆ సమయంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో భారతదేశం 24% నుండి 35% వరకు వాటాను కలిగి ఉండేది.
దాని సంపద మరియు ప్రభావానికి సంబంధించిన సారాంశం ఇక్కడ తెలుగులో ఉంది:
భారతదేశం - ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్
స్వయం సమృద్ధిగల ఆర్థిక వ్యవస్థ: బ్రిటిష్ పాలనకు ముందు భారతీయ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, చేతివృత్తులు మరియు వాణిజ్యం వంటి వివిధ కార్యకలాపాలతో స్వయం సమృద్ధిగా ఉండేది.
ప్రధాన ఎగుమతులు: భారతదేశం సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు (టెక్స్‌టైల్స్) మరియు విలువైన లోహాలను (precious metals) యూరప్, ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉండేది.
శక్తివంతమైన నగరాలు: మొఘల్ కాలంలో ఢిల్లీ మరియు ఆగ్రా వంటి నగరాలతో పాటు, చారిత్రక రాజధానులు అభివృద్ధి చెందిన పట్టణీకరణకు మరియు వ్యాపార కేంద్రాలకు నిదర్శనంగా నిలిచాయి.
విజయనగర సామ్రాజ్యం (1336–1565)
మీరు పేర్కొన్న విజయనగర సామ్రాజ్యం, ముఖ్యంగా దాని రాజధాని హంపి, దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక విశేష స్థానాన్ని కలిగి ఉంది. ఇది హిందూ సంస్కృతి మరియు సంపదకు ప్రతీకగా నిలిచింది.
హంపి - వైభవ రాజధాని: మధ్యయుగ ఐరోపా ప్రయాణికులైన డొమింగో పేస్ మరియు ఫెర్నావో నూనిజ్ వంటి వారి రచనలు హంపిని ఒక గొప్ప మరియు సంపన్నమైన మహానగరంగా వర్ణించాయి.
వాణిజ్యం మరియు అభివృద్ధి: ఈ సామ్రాజ్యం శక్తివంతమైన విదేశీ వాణిజ్యాన్ని కలిగి ఉంది మరియు సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. ఇది పర్షియా మరియు మధ్యప్రాచ్యంతో విస్తృతమైన వ్యాపార సంబంధాలను కొనసాగించింది.
సాహిత్య మరియు కళా పోషణ: విజయనగర రాజుల ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం మరియు సంస్కృతంలో లలిత కళలు మరియు సాహిత్యం కొత్త శిఖరాలను చేరుకున్నాయి.
ఆర్థిక వ్యవస్థలో మార్పు
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దం ప్రారంభంలో వ్యాపారం కోసం భారతదేశంలోకి అడుగుపెట్టింది. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత, వారు వ్యాపారుల నుండి పాలకులయ్యారు. వారి వలస ఆర్థిక విధానాలు భారతదేశ సంపదను దోచుకోవడానికి మరియు పారిశ్రామికీకరణను అణచివేయడానికి దారితీశాయి. ఫలితంగా, స్వాతంత్ర్యం వచ్చే నాటికి (1947), ప్రపంచ GDPలో భారతదేశం యొక్క వాటా 2%కి పడిపోయింది.

Before the British invasion in the 17th century, India was the richest nation in the world, flourishing in trade, culture, and resources. Among its many powerful kingdoms, the Vijayanagar Empire (1336–1565) stood as the wealthiest and most influential. Its capital, Hampi, was a grand metropolis known for advanced infrastructure and economic prosperity. The empire traded spices, textiles, and precious metals with Persia, the Middle East, Southeast Asia, and Europe, strengthening its military and cultural patronage. Despite its decline in the 16th century, Vijayanagar remains a symbol of India’s glorious past.

🔸 4 ఏళ్లకే తల్లిని కోల్పోయింది.🔸 14 ఏళ్లకే వివాహం చేసుకుంది.🔸 23 ఏళ్లకు తల్లి అయింది.🔸 25 ఏళ్లకే వితంతువు అయింది.🔸 30 సం...
30/10/2025

🔸 4 ఏళ్లకే తల్లిని కోల్పోయింది.
🔸 14 ఏళ్లకే వివాహం చేసుకుంది.
🔸 23 ఏళ్లకు తల్లి అయింది.
🔸 25 ఏళ్లకే వితంతువు అయింది.
🔸 30 సంవత్సరాలకే భారతదేశ స్వాతంత్రం కోసం యుద్ధభూమిలో ప్రాణాలర్పించింది.
🔸 She is Great Warrior Rani Jhansi Lakshmi Bhai

ఆరెస్సెస్‌‌లో పాల్గొనే ప్రభుత్వోద్యోగుల విషయంలో కోర్టులు చెప్పిందిదే..ప్రాథమిక హక్కుల పరిరక్షణ: RSS కార్యకలాపాల్లో పాల్గ...
22/10/2025

ఆరెస్సెస్‌‌లో పాల్గొనే ప్రభుత్వోద్యోగుల విషయంలో కోర్టులు చెప్పిందిదే..

ప్రాథమిక హక్కుల పరిరక్షణ:

RSS కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c) కింద పౌరులకు లభించిన సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ (Freedom of Association) పరిధిలోకి వస్తుంది.

తొలగింపునకు ప్రాతిపదిక కాదు:

గతంలో లేదా ప్రస్తుతం RSSతో అనుబంధం కలిగి ఉండడం అనేది ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి, తొలగించడానికి లేదా పదోన్నతి నిరాకరించడానికి సరియైన కారణం కాదని న్యాయస్థానాలు నిర్ధారించాయి. ఈ తీర్పులు ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తిస్తూనే, తమ సామాజిక, సాంస్కృతిక అనుబంధాలను చట్టబద్ధంగా కొనసాగించవచ్చని స్పష్టం చేస్తున్నాయి.

కేసు 01: పి. రాఘవులు VS స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1965వ సంవత్సరం.

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఘవులు అనే ఉద్యోగిని RSS సభ్యత్వానికి సంబంధించి తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ కేసు దాఖలైంది. ఆ సందర్భంలో హైకోర్టు స్వేచ్ఛ (Freedom of Association) అనే ప్రాథమిక హక్కును ప్రస్తావించింది. RSS రాజకీయ సంస్థ కాదని, అది సామాజిక-సాంస్కృతిక సంస్థ అని పేర్కొంది. ఒక ఉద్యోగిని ప్రాథమిక హక్కును వినియోగించుకున్నందుకు శిక్షించడం చెల్లదని తీర్పు ఇచ్చింది. RSS రాజకీయ సంస్థ అనే అపోహను ఈ తీర్పు ఖండించింది. ఒక సంస్థ నిషేధించబడనంత కాలం, దానిలో సభ్యత్వం కలిగి ఉండడం లేదా దాని కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా హైకోర్టు గుర్తించింది.

కేసు 02: స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ VS రామశంకర్ రఘువంశీ, ఇతరులు, 1983వ సంవత్సరం

ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు గతంలో RSS, జనసంఘ్ కార్యకలాపాలలో పాల్గొన్నాడనే కారణంతో అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. ఈ తొలగింపు అక్రమం అని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. "ఒక వ్యక్తి గతంలో RSS లేదా జనసంఘ్‌కు చెందినవాడని చెప్పడం మాత్రమే అతని సేవలను రద్దు చేయడానికి సరైన కారణం కాదు" అని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా, RSS రాజకీయ పార్టీ కాదనే విషయాన్ని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. గతంలో RSS కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రభుత్వ సేవా నియమాలను ఉల్లంఘించినట్లు కాదని, ఉద్యోగి తొలగింపునకు అది సరియైన ప్రాతిపదిక కాదని తేల్చి చెప్పింది.

కేసు 03: రామ్ పాల్ VS స్టేట్ ఆఫ్ పంజాబ్, 1967వ సంవత్సరం

రాష్ట్ర ఉద్యోగి అయిన రామ్ పాల్ 1965లో RSS శిబిరానికి హాజరయ్యాడనే ఆరోపణపై సర్వీస్ నుండి తొలగించారు. ఆ సమయానికి, ఉద్యోగులు రాజకీయ సంస్థలలో పాల్గొనరాదనే నియమం అమల్లో ఉంది. హైకోర్టు తీర్పు ఆ ఉద్యోగి తొలగింపు నిర్ణయాన్ని రద్దు చేసింది. RSS ఒక రాజకీయ సంస్థ అని చెప్పడానికి ఎటువంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది. ఉద్యోగిని తొలగించడం ద్వారా అధికారులు అతని ప్రాథమిక హక్కులను (సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ - ఆర్టికల్ 19(1)(c)) ఉల్లంఘించారని పేర్కొంది.

RSS అనేది సాంస్కృతిక/సామాజిక సంస్థగా పరిగణించబడాలని, దాని కార్యక్రమాలలో పాల్గొనడం ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు విరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

Rss లో join అవ్వాలనుకుంటున్నారా?
19/10/2025

Rss లో join అవ్వాలనుకుంటున్నారా?

19/10/2025

దేశమే దైవంగా, సేవే శ్వాసగా, ధర్మమే మార్గంగా భరతమాత సేవ, భారతీయ సంస్కృతి పరిరక్షణకై సాగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ద గాథ.. భవిష్యత్ తరాలకు స్పూర్తి, సమస్త మానవాళికి మార్గదర్శి.
Rashtriya Swayamsevak Sangh (RSS)
For join rss

https://www.rss.org/pages/joinrss.aspx

06/10/2025

RSS@100
విజయదశమి ఉత్సవం గుర్రంకొండ

25/08/2025

ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం తో కూడిన వినాయక చవితి లోగో తయారు చేస్తున్న యువత.. నా దేశ యువత మన చరిత్ర తెలుసుకుంటున్నారు 🚩🚩 శుభపరిణామం
జై భవాని

02/07/2025

అద్భుతమైన సందేశం

Address

Gurramkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when RSS Seva Bharathi Gurramkonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category