04/10/2026
నిషిత ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుంటున్న భ్రమరాంబ గారు ఈ రోజు స్వర్గస్థులు అయ్యారు..
మా ఆశ్రమంలో ఉంటూ, నేను ఎప్పుడు తనని పలకరించినా నా చేతులు పట్టుకుని, 'నేను నిన్ను వదిలి వెళ్ళను అని,వచ్చిన ప్రతి ఒక్కరితో మేడంని వదిలి వెళ్ళను అమ్మ, ఇక్కడే ఉంటాను' అని ఎంతో ఆప్యాయంగా చెప్పేవారు.
అమ్మా.. నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావు. చివరి శ్వాస వరకు మా ఆశ్రమంలోనే, మా గుండెల్లోనే ఉండిపోయావు. ఒక నిర్వాహకురాలిగా కాకుండా నన్ను నీ కన్నకూతురిలా భావించి నువ్వు చూపించిన ఆ కన్నప్రేమను నేనెప్పటికీ మరువలేను. నీ రూపంలో మా ఆశ్రమానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయాము. నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను..