02/06/2026
గ్రామ ప్రజలకు డ్రగ్స్ దుష్పరిణామాలపై చైతన్యం
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, గోనపపేట గ్రామం:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కార్మికులు మరియు గ్రామ ప్రజలకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే హానికర ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ మరియు సామాజిక జీవితంపై పడే దుష్ప్రభావాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులను, సమాజ భద్రతను కూడా దెబ్బతీస్తుందని తెలియజేశారు.
యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని ఈగల్ అధికారులు సూచించారు. క్రీడలు, విద్య మరియు సృజనాత్మక కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని ప్రోత్సహించారు.
అదేవిధంగా, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1972 గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసిన వెంటనే 1972 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.