Andhra Pradesh Pharmacy Council

Andhra Pradesh Pharmacy Council Regulatory body under Ministry of Health, for Advancement & Enforcement of Profession of Pharmacy in State of Andhra Pradesh, India

*Heart Felt Congratulations from the entire team of IPGA ANDHRA PRADESH* to our Proud Team Member - *Dr. Radha Rayi, IPG...
25/05/2026

*Heart Felt Congratulations from the entire team of IPGA ANDHRA PRADESH* to our Proud Team Member - *Dr. Radha Rayi, IPGA AP ZONE-V, COORDINATOR (Academic & Research Division),* and *Professor of Dr. Mohan Babu University, Tirupathi**.. on Her *Achievement of ICSSR Financial Grant of ₹.5,00,000/- (Five Lakhs Rupees) for conduct of National Seminar*.. on *Topic: Integration of AYUSH with Community Medicine*
*Your Personalized Wishes may also be sent to:*
Email: [email protected]
Mobile:9966467409
*Vijay R Annapareddy State President IPGA AP & National Co-option Member*

https://youtu.be/yK0z_Y2D2vY?si=6I3eTGk7hIU5oEBy*IPGA Andhra Pradesh State Branch Executive Committee Meeting. under lea...
20/04/2026

https://youtu.be/yK0z_Y2D2vY?si=6I3eTGk7hIU5oEBy

*IPGA Andhra Pradesh State Branch Executive Committee Meeting. under leadership of Dr. Atul Kumar Nasa, National President, IPGA*
*This event focuses on collaboration, leadership, and the future of pharmacy in India*
*New new SEC also elected on 19-04-2026 At Amma Eco Resorts, Akkaipalem, Chirala, Andhra Pradesh*
*watch* *like* *subscribe* HYBIZ TV

5 likes, 1 comment. "Pharma Leaders Meet in | Andhra Pradesh Executive Committee | Hybiz tv"

Welcome to State Executive Committee Members IPGA ANDHRAPRADESH for the SEC Meeting onn18&19th April 2026.. Amma Eco Res...
17/04/2026

Welcome to State Executive Committee Members IPGA ANDHRAPRADESH for the SEC Meeting onn18&19th April 2026.. Amma Eco Resorts, Chudala Beach AndhraPradesh

*అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యునిగా గెలుపొందిన చిరకాల మిత్రులు.. పెద్దలు.. సీనియర్ న్యాయవ...
16/03/2026

*అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యునిగా గెలుపొందిన చిరకాల మిత్రులు.. పెద్దలు.. సీనియర్ న్యాయవాది జి.శాంతకుమార్ గుంటూరు వారికి హార్దిక శుభాకాంక్షలు!..* అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి.. 'అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్' & 'పూర్వ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్'

20/02/2026

*ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయాల ముట్టడి*.. భారత కమ్యునిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో.. *28 ఫిబ్రవరి 2026 శనివారం నాడు అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీ, కంట్రోలింగ్ అథారిటీ కార్యాలయాలు అంటే ఏడీ.. డీడీ.. జేడీ.. డీజీ కార్యాలయాల ముట్టడి మరియు ధర్నా కార్యక్రమం జరగనుంది.* *షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండా జరుగుతున్న ట్రేడ్ మాఫియా విచ్చలవిడితనంపై చర్యలకు డిమాండ్.. వార్షిక తనిఖీ నివేదికలను ఫారం 35 లో కాకుండా ఇష్టారీతిన తెల్లకాగితాలపై తూతూ మంత్రంగా జరిపేస్తున్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల తీరుకు నిరసనగా.. ఇంకా నకిలీ మరియు నిరర్ధక ఔషధ విక్రేతలపై కేసులు నమోదు చేయాలన్న డిమాండుతో పాటుగా.. వెళ్లూనుకున్న ఔషధ నియంత్రణ శాఖ వ్యవస్తీకృత అవినీతిని పెకళించేందుకు తొలి అడుగుగా.. సీపీఐ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీయే).. మరియు ఫార్మసీస్ట్ సంఘాల జేఏసీ.. సంయుక్త కార్యాచరణలో.. యావత్తు ఫార్మసీ వృత్తిదారుల సమాజాన్ని ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం*. స్థానిక డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా నివేదనలు ఉంటాయి. *ఆసక్తి గల సంఘాలు వ్యక్తులు ఐపీజీయే వాట్సాప్ నెంబర్ 7382385678 కి మీ జిల్లా, మీ పేరు.. ఫోన్ నఁబర్ పంపండి*. స్థానిక సీపీఐ నాయకులతో మిమ్మల్ని జత చేస్తాం.. అందరూ విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి. *త్వరలో ఫార్మా ట్రేడ్ మాఫియా మరియు ఫార్మాసిస్టులు ఇబ్బందుల పరిష్కారానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మీ ఫిర్యాదులు స్వీకరిస్తాం..* వివరాలు త్వరలో...
*అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి.. పూర్వ అధ్యక్ష్యులు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ మరియు ప్రస్తుత అధ్యక్ష్యులు ఐపీజీయే ఏపీ.. మరియు ఐపీజీయే సెంట్రల్ కోఆప్షన్ మెంబర్.. *9573020000*

10/02/2026

*శ్రద్ధాంజలి*
*మా చిరకాల మిత్రులు, నాటి మా తోటి సహచర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, కేజీహెచ్ ఫార్మసీ ఆఫీసర్ (రిటైర్డ్) శ్రీ.పాలికా సుదర్శన రావు గారి సతీమణి శ్రీమతి చిరంజీవిని కుమారి గారు.. ఈరోజు అనగా ఫిబ్రవరి 10వ తేదీన స్వర్గస్థులైనారని తెలియ చేయుటకు చింతిస్తున్నాము.. వారి అంతిమయాత్ర కార్యక్రమం ఫిబ్రవరి 11 బుధవారం నాడున.. వారి ఇంటివద్ద (MK Gold coast, Plat No 205, Yendada, Visakhapatnam) సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడునని తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంలో పాలిక సుధర్శన రావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని.. వారి శ్రీమతి స్వర్గీయ చిరంజీవిని కుమారి గారికి సద్గతులు ప్రాప్తించ గలందులకు ప్రార్ధన!*
ఇట్లు
అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, బొజ్జిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,

09/02/2026

నెయ్యి కల్తీ.. నూనె కల్తీ.. బియ్యం కల్తీ.. పప్పులు కల్తీ.. మందులు కల్తీ.. మతం కల్తీ.. మనసులు కల్తీ.. మనుష్యులు కల్తీ.. వార్త కల్తీ... విజయం కల్తీ.. వీటన్నిటిని వదిలేసి ఒక్క లడ్డు మీదబడి యావత్తు మీడియా?.. సకల రాజకీయ పక్షాలు ఏడవటం ఏమిటి?.. ప్రజలకు కల్తీ లేని పాలన ఇవ్వలేని వీరికి దేవుడి రాజకీయమే అవసరం అయ్యింది!

*మెడికల్ మాఫియాను అరికట్టాలి. ఫార్మసీ, నర్సింగ్, డెంటల్, మెడికల్ కౌన్సిళ్లను పరిరక్షించాలి. వైద్య విద్య పీజీ స్టయిఫండ్ ల...
29/01/2026

*మెడికల్ మాఫియాను అరికట్టాలి. ఫార్మసీ, నర్సింగ్, డెంటల్, మెడికల్ కౌన్సిళ్లను పరిరక్షించాలి. వైద్య విద్య పీజీ స్టయిఫండ్ లను వెంటనే చెల్లించాలి. డ్రగ్స్ ట్రేడ్ మాఫీయా ఫార్మసీ కౌన్సిల్ ను ఆక్రమించిన విధంపై సమగ్ర విచారణ చేయాలి. ఫిబ్రవరి 14 నాడు అన్ని జిల్లాల్లో సీపీఐ ధర్నా, వినతిపత్రాల కార్యాచరణ. ఫార్మసీ కౌన్సిల్, డ్రగ్స్ ట్రేడ్ మాఫియా అంశాలపై వెంటనే స్పందించిన సీపీఐ పార్టీకి, ముఖ్యంగా రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు*
ఫార్మసీ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్

విజయవాడ: 25 జనవరి: విద్యార్హతకు తగిన ఉద్యోగం.. సీపీఐ లక్ష్యం.. ఈశ్వరయ్య!ప్రభుత్వ ఉద్యోగాల కాలెండర్ మాత్రమే కాదు.. ప్రయివ...
25/01/2026

విజయవాడ: 25 జనవరి:
విద్యార్హతకు తగిన ఉద్యోగం.. సీపీఐ లక్ష్యం.. ఈశ్వరయ్య!
ప్రభుత్వ ఉద్యోగాల కాలెండర్ మాత్రమే కాదు.. ప్రయివేటు ఉపాధి అవకాశాలపై కూడా సీపీఐ పోరాటం!
o లక్ష్యం చేరే దాకా.. వృత్తులు , విభాగాలు, అంశాలవారీగా నిరుద్యోగ రణభేరి కార్యక్రమాలు!
o లక్ష మంది ఫార్మసిస్టుల ఉపాధి అవకాశాలను గండికొడుతున్న ఫార్మసీ కౌన్సిల్, ఔషదనియంత్రణ శాఖ, డ్రగ్స్ ట్రేడ్ మాఫియాలపై ప్రత్యేక దృష్టి!

నగరంలోని సీపీఐ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రికాసమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన విజయవాడలో ఏఐవైయఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తలపెట్టిన నిరుద్యోగ రణభేరి కార్యక్రమ వివరాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. ఈ రణభేరిలో అపరిష్కృతంగా ఉన్న మూకుమ్మడిగా ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా శాఖల వారీ, విభాగాల వారీ, అంశాలవారీ వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వత్తిడి తేవడం జరుగుతుంది. నిరుద్యోగ రణభేరి ద్వారా రెవిన్యూ, విద్య, వైద్యారోగ్య, మునిసిపల్ ఇలా ప్రతి ప్రభుత్వ శాఖలలో దీర్ఘకాలంగా ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీ ప్రకటనలకు సీపీఐ డిమాండ్ చేస్తుందని అన్నారు. బాబతోనే జాబు అంటూ నిరుద్యోగుల్లో ఆశలు నింపి వారి ఓట్లు దండుకొని గెలిచిన ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా ఇదిగో జాబ్ కాలెండర్ అదిగో జాబ్ కాలెండర్ అంటూ కాలయాపన చేస్తుండడాన్ని సీపీఐ నిరసిస్తుంది. నిరుద్యోగ భృతి ఇస్తాం, యువతలో ప్రతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అన్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాలను సైతం పీకడంతో తప్ప కొత్త వాటికి ప్రయత్నం చేయలేదన్నది సుసృష్టం అవుతున్నదని ఆయన అన్నారు.
విజయవాడలో ఏఐవైయఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రణభేరి ఒక్క రోజు ప్రక్రియ ఉద్యమం కాబోదని, ఇప్పటి నుంచి దశలవారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివిధ వృత్తుల, రంగాల నిరుద్యోగ యువకులతో, వారి వారి వృత్తి పరమైన సంఘాలతో సహా కళాశాలల, విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టడానికి సీపీఐ రాష్ట్ర శాఖ ఒక ప్రణాళిక సిద్దం చేస్తుందని ఈశ్వరయ్య తెలిపారు. ప్రభుత్వ రంగాలోనే కాదు, ప్రయివేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలకోసం సీపీఐ పోరాడుతుందని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా ఇటీవల తన దృష్టికి వచ్చిన వాటిల్లో ప్రధానమైన అంశం – ఫార్మసీ నిరుద్యోగ వృత్తి నిపుణుల సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని వారి పేరుపై లైసెన్సులు పొంది ఔషధ దుకాణాల నిర్వహణ. ఈ మేరకు రాష్రంలోని పలు ఫార్మసిస్ట్ సంఘాలు తనను కలిశాయని, నిరుద్యోగ రణభేరిలో తమ అంశం ప్రత్యేకంగా ప్రస్తావించాలని వారు కోరారు. రాష్ట్రంలో వున్న 60000 మందుల దుకాణాల రికార్డుల్లో వారిని ఉద్యోగులుగా చూపిస్తూ చదువు రానివారితో ఔషధాలు అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటాడుకుంటున్న డ్రగ్స్ ట్రేడ్ మాఫియా వెనుక ఏటా 1000 కోట్ల లంచాల విషయం తెలిసి అవాక్కాయన్నన్నారు. ఇటీవల జరిగిన ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా సదరు డ్రగ్స్ ట్రేడ్ మాఫియాకు వత్తాసు పలికిన అధికారులపై సీపీఐ ఇప్పటికే ఫిర్యాదు చేసిందన్నారు. విచారణ జరగకుండా కౌన్సిల్ మెంబర్ల నియామక జీవో ను దొడ్డిదారిన ఇవ్వడానికి ప్రయత్నిస్తే సీపీఐ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. ఫార్మసిస్టుల అద్దె సర్టిఫికెట్ల మాఫియాలను అడ్డుకుంటే ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు 60000 ఉద్యోగాలు రావడంతో పాటుగా వారి జీతాలు మహారాష్ట్ర కేరళ తరహాలో 60 నుంచి 70 శాతం మేరకు పెరిగి ప్రతి ఒక్కరికి రూ. 250000/- పైచిలుకు కనీస వేతనం వచ్చే అవకాశాలు వున్నాయని, ఈ మేరకు తాను ఇప్పటికే నిపుణులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసుకున్నానని ఈశ్వరయ్య తెలిపారు.
ఇలాగే ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ప్రతి ఉద్యోగ అవకాశాన్ని విశ్లేషించి, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏటా ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఊదరగొట్టి హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్, నియామక ప్రకటనల కోసం సీపీఐ నిరుద్యోగ రణభేరిని నిరంతరం కొనసాగిస్తామని ఈశ్వరయ్య అన్నారు. తన ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందే విధంగా ప్రజాసమస్యలపై పోరాడే తత్వాన్ని సీపీఐ అలవరచుకుంటుందని, ఈ నిరుద్యోగ రణభేరికి అందరూ నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు హాజరవ్వాలని, ఫార్మసిస్టుల మాదిరిగానే మిగతా నిరుద్యోగ వృత్తి నిపుణుల విషయంలో ఆయా సంఘాలతో చర్చించి ప్రత్యేక నిరుద్యోగ రణభేరి కార్యక్రమాలు జరపాలన్న యోచనలో సీపీఐ వున్నదని ఆయన తెలిపారు.

Address

IPGA-AP (INDIAN PHARMACY GRADUATES ASSOCIATION/ANDHRA PRADESH), Https://maps. App. Goo. Gl/ekFnaA1aaSaneM1V 9
Guntur
522004

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm

Telephone

+917382385678

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh Pharmacy Council posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Andhra Pradesh Pharmacy Council:

Shortcuts

Share