30/04/2026
📈GMC Achieves Record ₹69.27 Crore in Advance Property Tax Collections
— Commissioner K. Mayur Ashok —
♦️ *ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుపై నగర ప్రజల నుంచి అద్భుత స్పందన – రికార్డు స్థాయిలో రూ. 69.27 కోట్ల వసూలు: కమిషనర్ కె.మయూర్ అశోక్*
♦️ *గత ఆర్థిక సంవత్సరంలో ముందస్తు పన్ను కింద రూ. 56.27 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ రూ. 69.27 కోట్లను వసూలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.*
🔸 *రాష్ట్ర *స్థాయిలో* *మూడవ స్థానంలో నిలిచిన జీఎంసీ.**
♦️ *ఈ రికార్డు స్థాయి వసూళ్లు పన్ను బకాయిదారులకు నిరంతరం మెసేజ్లు, నోటీసులు అందించి పన్ను చెల్లించాలని అవగాహన కల్పించడం వలన సాధ్యమయ్యాయని తెలిపారు. అలాగే, పన్ను చెల్లించే వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం మరియు కౌంటర్ల సమయాన్ని పెంచడం వల్ల ఈ లక్ష్యాన్ని సాధించగలిగామన్నారు.*
♦️ *రికార్డు స్థాయి వసూళ్లలో కీలక పాత్ర పోషించిన నగర ప్రజలకు, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరియు అడ్మిన్ కార్యదర్శులను ప్రత్యేకంగా అభినందిచిన కమిషనర్* .