11/07/2024
#ముఖ్య_గమనిక
తాను జీవించాలి అని తపనపడుతూ, భయంతో ఆర్తనాదాలు పెడుతున్న ఒక మూగ జీవిని కర్కశంగా హత్య చేసి దాని శవాన్ని ఆహారంగా వండుకుని మన నాలికను సంతృప్తి పర్చుకోవడం కంటే మన శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని పంచే సాత్వికమైన శాఖాహారాన్ని తీసుకోవడం మంచిది కదా!?
శాఖాహారం మానవులకు సర్వ శ్రేష్ఠమైనది, అలాగే ప్రకృతి సహితమైనది 🙏
..
ప్ర) కౄర జంతువులు మరో జీవిని వేటాడి చంపి తింటాయి కదా మరి మనిషి మరో జీవిని చంపి తినడం ఎందుకు నేరం అవుతుంది?
జ- క్రూర జంతువు యొక్క శరీర నిర్మాణానికి అనుగుణంగా దాని ఆహార అవసరాల కోసం మాంసం పై సహజంగా ఆధారపడాలి. మాంసం అనేది దానికి Optional కాదు అది Definite Need. అదే మనిషి శరీర నిర్మాణంలో జీర్ణ వ్యవస్థకు మాంసం అనేది విరుద్దమైనది అందుకే పచ్చి మాంసాన్ని మనం తినలేం, కాల్చి వండుకుని మాత్రమే తినగలం. మనం సహజంగా మాంసాహారులం అయితే పచ్చి మాంసం తినగలిగే శరీర తీరు సహజంగా వచ్చేది. అయితే ఆది మానవుడు తొలుత మాంసాన్ని తిన్నాడు అని చెప్పే నేటి సైన్స్ పుస్తకాలు అన్నీ బూటకం, అవన్నీ మతిలేని వాడి తప్పుడు రాతలు. ఆదిమానవుడు పండ్లు, అలములు, దుంపలు మాత్రమే తిన్నాడు కానీ పరిణామం చెందుతున్న కొద్దీ ఎప్పుడైతే నిప్పుని కనుగొన్నాడో అప్పుడు జంతువులను వేటాడి కాల్చి తినడం ప్రారంభించాడు. ముఖ్యంగా గల్ఫ్ వంటి ఎడారి ప్రాంతాల్లో, ఐరోపా వంటి చలి ప్రాంతాల్లో ఆహారం దొరకని చోట మాంసం పై ఎక్కువగా ఆధారపడ్డాడు. కానీ భారత్ వంటి భూభాగాల్లో ఎన్నో ప్రకృతి వనరులు ఉన్న చోట సహజంగా నాగరిక జీవనానికి అలవాటు పడిన మానవ సమూహాలు వేల సంవత్సరాలుగా శాఖాహారాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్నాయి. ఒక జంతువు మరో జంతువుని ఆహారం కోసం మాత్రమే వేటాడి చంపి తింటాయి కానీ మానవుడు ఆకలితో కాకుండా కోరికతో, రుచి కోసం మాంసాన్ని తింటాడు. మనిషి తన నాలుకను సంతృప్తి పర్చుకోవడం కోసం దొరికిన ప్రాణులను అన్నింటినీ తినుకుంటూ వెళ్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇక ఫార్మ్ లో పెంచే జంతువుల మాంసం తినడం వల్ల మనిషి ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో ఈరోజు మనం గమనిస్తున్నాం.
ప్ర) మరి చెట్లు సైతం ప్రాణులే కదా వాటిని తినడం కూడా తప్పే కదా?
జ- చర, అచర జీవులుగా రెండు విభాగాలుగా ప్రాణులు ఉంటాయి ఈ విశ్వంలో. అచర జీవులు అంటే కదలలేనివి. అందులో వచ్చేవి చెట్లు, మొక్కలు.. వీటి నిర్మాణం చర జీవులతో పోల్చి చూస్తే విభిన్నమైనదిగా ఉంటుంది. చర జీవి, అంటే కదిలే స్వభావం ఉన్న జీవిలో ఏ శరీర అంగాన్ని మనం వేరు చేసినా ఆ శరీర అంగం పునః సృష్టి కాలేదు. కానీ అచర జీవి అయిన చెట్టు మాత్రం ఒక చిన్న వేరు ఉన్నా చాలు మళ్లీ తనను తాను పూర్తిగా పునః నిర్మాణం చేస్కోగలదు. మనిషి చెట్టు ఫలాలను, ఆకులను, కొమ్మలను ఏ అవసరానికి వాడుకున్నా అవి పునః నిర్మితమౌతాయి. చెట్టు సహజ స్వభావమే ప్రకృతిలోని జీవులకు తనని తాను సమర్పించుకోవడం. మరియు అతిముఖ్యమైనది ఏంటంటే కదిలే జీవుల్లో ఉండే నాడీ వ్యవస్థ ఏదైతే బాధను, ఆనందాన్ని కలిగిస్తాయో అదే రకమైన నాడీ వ్యవస్థ అచర జీవుల్లో ఉండదు. ఫలం కానీ పుష్పం కానీ పత్రం కానీ ఇవి చెట్టు నుండి వేరు చేసినా మళ్లీ పునః సృష్టించబడుతాయి. కాబట్టి చెట్లు, మొక్కలు అందించే ఆహారాన్ని తీస్కోవడం ప్రకృతికి ఏ రకమైన హాని కలిగించదు.
..
ఈ విషయాలను మనం అర్ధం చేస్కోవడానికి ఏ మత గ్రంథాలు చదవనవసరం లేదు, కోరికలను పక్కనబెట్టి వివేకంతో ఆలోచిస్తే చాలు మనకు ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటో తెలుస్తుంది 🙏