02/10/2024
*విశాఖ స్టీల్ ప్లాంట్ ను సేయిల్ లో విలీనం చేయాలి*.
*ప్లాంటుకు సొంత గనుల కేటాయించి - ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి*
విద్యార్థి యువజన సంఘాలు అన్నమయ్య జిల్లా
రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదుట విశాఖ ఉక్కు రక్షణ కోసం రిలే దీక్షలు -విద్యార్థి యువజన సంఘాలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరికి సొంత గనులు కేటాయించాలని సైల్ లో కలపాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దీక్షల సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 32 మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా, వందలాదిమంది వామపక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో, వేలాదిమంది రైతుల యొక్క త్యాగాలతో 1971లో నిర్మించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెబుతూనే స్వరములో మార్పు చేసి నష్టాలు వస్తే ఎన్ని రోజులని భరిస్తారు అని మాట మార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ చేయము అని ప్రకటన చేస్తూనే రాత్రికి రాత్రి 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం దేనికి సాంకేతం అని ప్రశ్నించారు. వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించి, శాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే ప్రజాగ్రహానికి లోన్ కావాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం విధానానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి ప్రజా ఉద్యమాలలో పాల్గొని విశాఖ ఒక్క పరిరక్షణ కోసం కలిసి రావాలని వారన్నారు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నరు sfi జిల్లా కార్యదర్శి నరసింహ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ కుమార్ ఐసా జిల్లా కార్యదర్శి లవ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, సాయి కార్యదర్శి చందు, గురునాథ్, సతీష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా నాయకులు బాలసుబ్రమణ్యం,వినయ్, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ ఏ ఐ ఎస్ ఏ జిల్లా నాయకులు హరినాథ్ ఈవేళ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభినందనలతో...
విద్యార్థి యువజన సంఘాలు