25/02/2024
నన్ను నమ్మి గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ధర్మానికి కట్టుబడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
ప్రత్యేక పరిస్థితులు ఉన్న గుడివాడ అభ్యర్థిగా ముందే ప్రకటించడం సంతోషకరం.
టిడిపి జనసేన, ప్రజాస్వామ్యవాదులందరితో కలిసి గుడివాడను తిరిగి ప్రజలకు అంకితం చేస్తాం.
గుడివాడలో బ్రహ్మాండమైన విజయం సాధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కానుకగ ఇస్తాం.
తనను అభిమానిస్తూ, ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకు వెళుతున్న సోదరుడు రావి వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు.
రాజకీయాలు కొత్త అయినా సరే గుడివాడ టిడిపి జనసేన నేతలు నాకు ఇబ్బందులు కలగకుండా ముందుకు నడిపిస్తున్నారు.
దుర్మార్గుడికి గుణపాఠం చెప్పడానికి క్యాడర్ మొత్తం ఏకతాటి పైకి వచ్చింది.
ఎన్నికలయ్యే వరకు అధికార వైసీపీకు అనువంత అవకాశం కూడా ఇవ్వను.
మేము సంబరాలు చేసుకుంటుంటే,అభ్యర్ధి ఎవరో తెలియక వైసిపి శ్రేణులు అయోమయంలో ఉన్నారు.
గుడివాడలో టిడిపి విజయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
సిటు ఉంటుందో లేదో తెలియని వ్యక్తి మాకు పోటీయే కాదు.
గుడివాడ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, బాధ్యతగా అమలు చేస్తాను.
#మనగుడివాడమనవెనిగండ్ల