PJR Social Service

PJR Social Service Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PJR Social Service, Social service, Gooty.

24/04/2023

పుట్టినరోజు శుభాకాంక్షలు మహానంద రెడ్డి

22/04/2023
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన నడుస్తుంది...... తెదేపా  నాయకుల పై తప్పుడు కేసులు పెట్టడం ఏంటి.......
17/01/2023

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన నడుస్తుంది......
తెదేపా నాయకుల పై తప్పుడు కేసులు పెట్టడం ఏంటి.......

దేశానికి వెన్నెముక రైతు...... రైతుల వెన్నెముక ను విరుస్తుంది వైసిపి ప్రభుత్వం....... అన్నం పెట్టే రైతు అప్పుల పాలవుతున్న...
05/01/2023

దేశానికి వెన్నెముక రైతు......
రైతుల వెన్నెముక ను విరుస్తుంది వైసిపి ప్రభుత్వం.......
అన్నం పెట్టే రైతు అప్పుల పాలవుతున్నారు.....
రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలే శరణమా......
7 లక్షల ఎకరాలకు 2,800 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి.............
కర్నూలు మహాధర్నాలో టిడిపి నేత పి.జె.ఆర్
పి.జె.ఆర్ ను సన్మానించిన అఖిలపక్ష రైతు సంఘాలు

కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ - చనిపోయినవారి కుటుంబాలకు రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణ...
30/12/2022

కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ - చనిపోయినవారి కుటుంబాలకు రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణయం - పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు చొప్పున సాయం - తనవంతుగా మరో రూ. 8 లక్షలు ఇస్తామని ప్రకటించిన నేతలు - మొత్తంగా రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణయం
టిడిపి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిదర్శనం.

క్రిస్మస్ వేడుకలకు దుస్తులు పంపిణీ.......... ఏసుప్రభు  జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం... టిడిపి నేత పిజెఆర్  25-12-...
25/12/2022

క్రిస్మస్ వేడుకలకు దుస్తులు పంపిణీ..........
ఏసుప్రభు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం... టిడిపి నేత పిజెఆర్
25-12-2022
క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేశామని పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన పాస్టర్ పుల్లయ్య పెద్దడుగురులో ఉన్నటువంటి మిస్సాగ్రేస్ ప్రార్థన మందిరం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రార్థనలో పాల్గొనే వారికి దుస్తులు పంపిణీ చేయాలని గుంతకల్ నియోజకవర్గానికి చెందిన పీజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారిని సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి పాస్టర్ పుల్లయ్యకు దుస్తులు పంపిణీ చేశారు. జీవానంద రెడ్డి గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అయినటువంటి ఏసుప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చూపించిన దైవ దర్శనం మార్గం నందు నడుచుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కోటాను కోట్ల మంది ఏసుప్రభు ని ఆదర్శంగా తీసుకుని ఆయన దారిలో నడుస్తున్నటువంటి వారందరికీ ఏసుప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఆయన దారిలో భగవంతుడు ఉన్నాడని గుర్తించి నడుచుకోవాలని ఏసుప్రభు ఇచ్చిన మార్గం ప్రేమే శాశ్వతం ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి పంచండి అని ప్రేమించండి ద్వేషానురాగాలు వదలండి అని మనం జీవిస్తున్నది అంతా ఎప్పటికైనా వదలాల్సిందేనని భగవంతుని దగ్గరికి చేరాల్సిందేనని ఆ చేరే ప్రయత్నంలో మనం అందర్నీ ప్రేమించి భగవంతునికి దగ్గర య్యే ప్రయత్నం చేద్దాం అని ఆయన మార్గ దర్శకుడిగా కొన్ని కోట్ల మందికి దారి చూపించారన్నారు. ఏసుప్రభు జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్ననన్నారు
అనంతరం పీజేఆర్ ట్రస్టు సభ్యులు ప్రార్థన మందిరానికి వెళ్లి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.అనంతరం పాస్టర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా మాకు దుస్తులు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు కుల మతాలకు అతీతంగా సేవ చేయడం మహా గొప్ప విషయం అన్నారు. యేసు ప్రభు ఆశీస్సులు జీవానంద రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాం అన్నారు. దుస్తులు పంపిణీ చేసిన దానికి జీవానంద రెడ్డి గారికి పాస్టర్ పుల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.జె.ఆర్ ట్రస్టు సభ్యులు రామచంద్రారెడ్డి రామంజి,సూర్యనారాయణ రెడ్డి, ఆది శేషు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు

🔥  గుంతకల్ నియోజకవర్గంలోని   #పెరుమల జీవానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో  గ్రామీణ ప్రాంతాలు  ప్రజల ఆరోగ్యం కోసం గుంతకల్ మండలం...
21/12/2022

🔥 గుంతకల్ నియోజకవర్గంలోని #పెరుమల జీవానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు ప్రజల ఆరోగ్యం కోసం గుంతకల్ మండలంలోని ❶. నాగసముద్రం,❷. నల్లగొండ,❸. గుండాల తాండ, గుత్తి మండలంలోని ❹. బేతపల్లి,5. తొండపాడు, పామిడి మండలంలోని ❻. ఎద్దులపల్లి, విజయవంతంగా జరిగింది.ఇప్పుడు❼. దేవరపల్లి గ్రామం నందు నిర్వహించుచున్నారు.

న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించడానికే నీటిని వదిలారు....పంటలకు నీరు నిల్వ చేయకుండా సముద్రానికి  వదులుతున్నారు ఎందుకు.......
19/12/2022

న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించడానికే నీటిని వదిలారు....
పంటలకు నీరు నిల్వ చేయకుండా సముద్రానికి వదులుతున్నారు ఎందుకు.....?
రైతన్నలకు అన్యాయం చేస్తున్న అధికారులు...........
అధికారుల తప్పులు సరిదిద్దుకోవడానికే భారీగా నీళ్లు వదిలారు... టిడిపి నేత పి జె ఆర్
19-12-2022
న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించడానికి అధికారులు ఎంపీ ఆర్ డ్యామ్ నుండి భారీగా నీటిని సముద్రంలోకి వదిలారని టిడిపి సీనియర్ నాయకులు పీజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాళ్ళ జీవానంద రెడ్డి గారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పామిడి పెన్నా నది నందు ఇసుకరీచులు ఉండకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ
ప్రకృతి సంపద ఇసుకను దోపిడీ చేసిన వారిపై అనంత అధికారులు వాహనాలను సీజ్ చేయకుండా ఇసుక దోపిడీ చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా ఇసుక దోపిడీ చేసిన స్థలం గుంతలు ఉండకూడదని పామిడి పెన్నా నదికి పెనుకచర్ల డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున నీటిని వదులుతున్నారన్నారు. ఎంపీఆర్ డ్యామ్ లో నీటి నిల్వ తక్కువ ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి నీళ్లు వదిలారన్నారు. డ్యాములో నీటి నిల్వ ఉంచితే రైతన్న లు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. రైతన్నలు పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే నీళ్లు ఆపుతారు. వదలమని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ధర్నాలు చేసిన నీళ్లు వదలలేదు కానీ ప్రస్తుతం అధికారులు ఇసుక మాఫియా కి అనుకూలంగా ఉన్నారన్నారు. ఇసుక దోపిడీ చేసి కోట్లు సంపాదించిన కోట్ల సొమ్మును ఎందుకు రికవరీ చేయలేదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు కేసు నమోదు అయిందని అనంత అధికారులు ఉన్నత న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించడానికి భారీ నీళ్లు వదిలారన్నారు. ప్రస్తుతం డ్యాములో నీటిమట్టం ఎక్కువ లేదు నీళ్లు ఎందుకు వదిలారన్నారు. ఇసుక మాఫియాని అరికట్టమంటే ఇసుక మాఫియా కోసం ఎందుకు పనిచేస్తున్నారన్నారు. అనంత అధికారులు ఇసుక మాఫియా అంతం చేసి ఉంటే కోర్టు ధిక్కరణ కేసు ఉండేది కాదన్నారు. ఒక తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు ఎందుకు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇసుక మాఫియాను అరికట్టే విధంగా అధికారులు ముందుకెళ్లాలన్నారు.

Address

Gooty
515401

Website

Alerts

Be the first to know and let us send you an email when PJR Social Service posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category